బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు (FIR Against Rahul Jain) నమోదు అయింది. ముంబైలో ఉన్న 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అత్యాచారం (Raping Costume Stylist in His Mumbai Flat)చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదయింది.తన పనిని ఇన్స్టాగ్రామ్ ద్వారా మెచ్చుకుంటూ... ఒకసారి తన ఫ్లాట్ కు రమ్మని రాహుల్ ఆహ్వానించాడని... తనను పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా నియమించుకుంటానని చెప్పాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఆయన ఆహ్వానం మేరకు ఫ్లాట్ కు వెళ్లిన తనను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది.
తాను ప్రతిఘటించినప్పటికీ బలవంతంగా అత్యాచారం చేశాడని... సాక్ష్యాలను తొలగించాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో రాహుల్ జైన్ పై పోలీసులు సెక్షన్ 376, 323, 506 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని రాహుల్ జైన్ తెలిపాడు. గతంలో కూడా మరో మహిళ తనపై అత్యాచారం కేసు పెట్టిందని చెప్పాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది అక్టోబర్ లో ఓ మహిళ రాహుల్ జైన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.