Hyderabad, Jan 24: సోషల్ మీడియాలో (Socialmedia) చురుగ్గా ఉంటూ ఆసక్తికర ట్వీట్లు (Tweets) చేస్తూ ఆకర్షించే దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా అలాంటిదే మరో ట్వీట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా యూనిట్ ఇటీవల ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేసిన వర్మ.. ఓ భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే నుంచి రాజమౌళి సహా ఇప్పటి వరకు ఎవరూ ఊహించి ఉండరని పేర్కొంటూ ప్రశంసలు కురిపించాడు.
బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీలో అడుగుపెట్టండి.. లేకపోతే, లేదు.. విద్యార్థినులకు ఓ కాలేజీ అల్టిమేటం
అలాగే, మరో ట్వీట్‌లో రాజమౌళిని భద్రత పెంచుకోమని కోరాడు. దేశంలోని కొందరు దర్శకులు స్వచ్ఛమైన అసూయతో రగిలిపోతున్నారని, రాజమౌళిని అంతమొందించేందుకు రెడీ అవుతున్నారని, అందులో తానూ ఒకడినని పేర్కొన్నాడు. తానేదో తాగి ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని బయటపెట్టేస్తున్నానంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
Hey @ssrajamouli U basically SURPASSED every film maker from #KaAsif who made #MughaleAzam till #RameshSippy who made #Sholay and also the likes of Aditya Chopras, Karan Johars and the bhansalis of India and I want to suck ur little toe for that https://t.co/KCgN0u2eJa
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023