Newdelhi, March 18: ఆస్కార్ అవార్డ్ (Oscar Award) సాధించిన ఆర్ఆర్ఆర్ (RRR) టీమ్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అకాడమీ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), తండ్రి చిరంజీవితో (Chiranjeevi) కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను (Amit Shah) కలిశారు. ఈ సందర్భంగా కాసేపు ముగ్గురు ముచ్చటించుకున్నారు. అనంతరం ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.
భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు @KChiruTweets మరియు @AlwaysRamCharan లను కలవడం ఆనందంగా ఉంది.
తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది.
నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు. pic.twitter.com/eyLWuq3xmM
— Amit Shah (@AmitShah) March 17, 2023
Was part of Shri @KChiruTweets Garu & @AlwaysRamCharan’s meeting with Union Home Minister Shri @AmitShah Ji at #IndiaTodayConclave.
Amit Ji congratulated Ram Charan on the Oscar win for the Naatu-Naatu song and the phenomenal success of the film @RRRMovie! pic.twitter.com/kOVlEYr4Tq
— Dr. CM Ramesh (@CMRamesh_MP) March 18, 2023
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలను కలవడం ఆనందంగా ఉందని షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్ అద్భుత విజయం, నాటునాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు రామ్‌చరణ్‌ను అభినందించినట్టు పేర్కొన్నారు. కాగా, ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ్‌చరణ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.