Upendra: అవమానకర సామెత వాడి చిక్కుల్లో పడ్డ నటుడు ఉపేంద్ర.. ఇప్పటివరకూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. పొరపాటున తన నోటి నుంచి ఈ కామెంట్ దొర్లిందని నటుడి వివరణ
కన్నడ నటుడు ఉపేంద్ర వివాదంలో చిక్కుకున్నారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్ బుక్ సెషన్ లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు.
Newdelhi, Aug 14: కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) వివాదంలో చిక్కుకున్నారు. దళితులపై (Dalits) అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ (FIR) లు నమోదు చేశారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను (Prajakeeya) విమర్శిస్తున్న వారిపై ఫేస్ బుక్ సెషన్ లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు. ‘‘నిష్కల్మషమైన హృదయాలతోనే మార్పు సాధ్యం. కానీ కొందరు మాత్రం చాలా ఖాళీగా ఉంటారు. మనసుకు తోచింది వాగేస్తుంటారు. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉన్నట్టు వీళ్లు కూడా ఉంటుంటారు’’ అని తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఫేస్‌బుక్, ఇన్ స్టా లైవ్ సెషన్ లో ఉపేంద్ర కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ కావడంతో ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Karnataka | FIR registered against Kannada actor and Uttama Prajaakeeya Party founder Upendra for allegedly using objectionable language in a live streaming on a social media platform. The case has been registered at CK Achukattu Police Station in Bengaluru.
A second FIR has… pic.twitter.com/Xg0SyqREZY
— ANI (@ANI) August 14, 2023
క్షమాపణలు
తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘‘లైవ్ సెషన్‌లో నేను ఈ రోజు పొరపాటున ఓ అభ్యంతరకర వ్యాఖ్య చేశాను. ఇది అనేక మంది మనసులను గాయపరిచిందని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను. ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణ చెబుతున్నా’’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
(The above story first appeared on LatestLY on Aug 14, 2023 09:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

