Newdelhi, May 9: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ (The Kerala Story) మూవీ ఓటీటీలోకి (OTT) వచ్చేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE 5) కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ (Two Months Gap) తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. లవ్ జిహాద్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
The Kerala Story OTT Release Date, OTT Platform Rights and Watch Online 🔥✅https://t.co/68yyRauUPV#TheKeralaStory #entertainment #Bollywood #TheKeralaStoryMovie pic.twitter.com/UE216O2xNd
— Techno Gold (@technogolds) May 9, 2023
కలెక్షన్ల దూకుడు
అనేక ఆందోళనల నడుమ ఇటీవల రిలీజైన ఈ మూవీ ఇండియా వైడ్‌గా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్నది. మరోవైపు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ మూవీని బ్యాన్ చేయాలని కొన్ని సంఘాలు పట్టుపడుతోన్నాయి. వెస్ట్ బెంగాళ్‌లో ఈ సినిమాను నిషేదించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ సినిమాను నిషేధించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.