తాజా వార్తలు
Manmohan Singh Funeral Updates: నేటి ఉదయం.11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. నిగమ్ బోధ్ ఘాట్ లో అంతిమ సంస్కారాలు (లైవ్)
Rudraమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరుగుతాయని ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Bathinda Bus Accident: పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, కాలువలో పడ్డ బస్సు 8 మంది మృతి, 18 మందికి గాయాలు
VNSబఠిండాలో ఘోర ప్రమాదం (Bathinda Accident) జరిగింది. వంతెనను రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు.. కాల్వలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా (8 Killed), మరో 18 మంది గాయపడ్డారు. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.
Corbin Bosch Creates History: పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెలరేగిన ఆటగాడు, అరంగేట్రంలోనే అదరగొట్టి సరికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెటర్
VNS30 ఏళ్ల కోర్బిన్ ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు (4/63) పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో నాలుగు వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
Venkatesh About Ramanaidu: నాన్న చివరి కోరిక తీర్చలేక పోయా! అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్ అయిన విక్టరీ వెంకటేష్..ఇంకా ఏమన్నారంటే?
VNSఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. ఫ్యామిలీని, వర్క్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసారు. చివరి క్షణాల్లో కూడా సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ నచ్చి నాకు చెప్పారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు
Honda Unicorn 2025: మార్కెట్లోకి వచ్చేసిన హోండా యూనికార్న్ 2025 మోడల్ బైక్, కేవలం రూ. 1.19వేల నుంచే ప్రారంభం
VNSప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లో హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) ఆవిష్కరించింది. దీని ధర రూ.1,19,481 (EX Showroom) పలుకుతుంది. ఓబీడీ2బీ కంప్లియంట్ ఇంజిన్, అదనపు ఫీచర్లతో ఈ మోటారు సైకిల్ అప్ డేట్ చేశారు.
Lava Yuva 2 5G: లావా నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్, కేవలం రూ.9500కే ఎన్నో ఫీచర్స్ తో ఫోన్ రిలీజ్
VNSభారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది. ఏఐ బ్యాక్డ్ ఫీచర్లతో 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. యాప్ అలర్ట్స్ లేదా షోయింగ్ సిస్టమ్ కోసం నోటిఫికేషన్ లైట్ ఫీచర్ జత చేశారు. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది
Andhra Pradesh: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం, వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyఏపీలోని రెండు జిల్లాలు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపు యజమాని గమనించి చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Imtiaz Ahmed Resigns: కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం
Hazarath Reddyవైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు.ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు.
Andhra Pradesh: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దాడి, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గాలీవీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఎంపీడీవో తెలిపారు.
Malla Reddy: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి..ఈసారి మాటలతో కాదు జిమ్‌లో, 7 పదుల వయస్సులో కండలు పెంచుతున్న మాజీ మంత్రి..వీడియో
Arun Charagondaమాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ప్రతిసారి తనదైన శైలీలో మాటలతో రెచ్చిపోయే మల్లారెడ్డి ఈ సారి జిమ్‌లో కండలు పెంచుతూ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
Accident Caught on Camera: మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైక్ మీద వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొని ఇద్దరు మృతి
Hazarath Reddyఅతివేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెంది. మృతులు బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు
Hazarath Reddyరైతుల హక్కుల కోసం నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించకోవడంపై పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుబట్టింది.
Dead Lizard Found in Food: దారుణం, ఆస్పత్రిలో రోగికి వడ్డించిన ఆహారంలో చనిపోయిన బల్లి, తెలియకుండా తినడంతో పరిస్థితి విషమం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఓ రోగికి ఆసుపత్రిలో వడ్డించిన ఆహారంలో చనిపోయిన బల్లి వచ్చింది. తెలియకుండా అతను ఆ ఆహారం తీసుకోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.
Manmohan Singh Funeral Updates: రేపు ఉదయం 9.30 గంటలకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం, ఇవాళ రాత్రి భారత్ చేరుకోనున్న మన్మోహన్ కుమార్తె
Arun Charagondaప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుండగా రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఏంది.
Krishnagiri Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, తమిళనాడులో బోల్తా పడిన టూరిస్ట్ బస్సు, 22 మందికి గాయాలు
Hazarath Reddyడిసెంబర్ 27న తమిళనాడులోని తిరువణ్ణామలైకి వెళుతుండగా టూరిస్ట్ బస్సు బోల్తా పడడంతో 22 మంది గాయపడ్డారు. ధర్మపురి నుంచి బస్సు వెళ్తుండగా కృష్ణగిరి జిల్లా తురింజిపట్టి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..ఇకపై వారానికి రెండుసార్లు సిఫారసు లేఖలకు అనుమతి
Arun Charagondaతెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తనందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyమాడుగుల జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు.
Viral Video: వైరల్ వీడియో, పూజారికి కోసం వస్తే ఇలా ఉంటుంది, వధూవరులపై వేసిన పూలు తనపై పడటంతో ఏం చేశాడో చూడండి
Hazarath Reddyపెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో వధూవరులు అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా వారిని స్నేహితులు పట్టిస్తున్నారు. పూలను వారిపై విసిరేస్తూ కనిపించారు.అయితే ఆ పూలు పూజారిపై కూడా పడటంతో అతను తట్టుకోలేకపోయాడు.
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..నూతన సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాట రిలీజ్ చేయనున్న హరిహర వీరమల్లు మేకర్స్!
Arun Charagondaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండగా ఎన్నికలకు ముందు కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమా షూటింగ్‌లను సమయం దొరికినప్పుడల్లా పూర్తి చేస్తున్నారు పవన్.
Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి
Arun Charagondaభారత మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలు ఇచ్చారు.