తాజా వార్తలు

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

Arun Charagonda

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు..మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అని ఆరోపించారు.

Telangana: దారుణం, కాజీపేటలో వృద్ధుడైన వ్యాపారిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన యువకుడు, రాత్రిపూట షాపు మూసి ఇంటికి వెళుతుండగా దాడి

Hazarath Reddy

కాజీపేట డీజిల్ కాలనీలో సిమెంట్ బ్రిక్స్ వర్క్ షాప్ నిర్వహిస్తున్న వృద్దుడు రాత్రి షాపు మూసి ఇంటికి నడిచి వెళ్తుండగా దాడి చేసిన వసీం అక్రం అనే యువకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాజీపేట పోలీసులు.

Earthquake in Medaram: వీడియో ఇదిగో, భూంకంపం దెబ్బకు వణికిపోయిన మేడారం సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు, గ‌ద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగిన‌ట్లు సీసీకెమెరాల ద్వారా స్ప‌ష్ట‌ం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు వ‌ణికిపోయాయి.

Earthquake in Telugu States: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం, భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.

Advertisement

Patnam Narendra Reddy: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ, క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Arun Charagonda

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు.

Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Hazarath Reddy

అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, రేపు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా

Arun Charagonda

మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. 11 రోజుల సస్పెన్స్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక సీఎం పదవిని ఆశీంచిన షిండేను బుజ్జగించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దీంతో ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్‌ను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

TTD: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు..పీఎస్‌ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి దర్శనం, ప్రత్యేక పూజలు

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుంది ఇస్రో టీం. ఇవాళ సాయంత్రం పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలుకానున్న నేపథ్యంలో రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ముందుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఇస్రో సైంటిస్టులు.

Advertisement

Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..

Hazarath Reddy

అంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో, స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు, అనుచరులు అలర్ట్ కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సుఖ్ బీర్ సింగ్ బాదల్

Hazarath Reddy

పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై ఓ అగంతకుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఆలయ కాపలాదారుడిగా సేవ చేస్తుండగా బాదల్ సమీపంలోకి నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్పులకు ప్రయత్నించాడు. వృద్ధుడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమైన బాదల్ అనుచరుడు ఎదురు వెళ్లి అడ్డుకున్నాడు.

Warangal: వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్, గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిన యువతి..ఎస్‌ఐని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన వైనం!

Arun Charagonda

వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.

Earthquake In Singareni Areas: సింగరేణి ప్రాంతాల్లో భూకంపం..కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు..తనిఖీల తర్వాతే కార్మికులను అనుమతిస్తామన్న సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి

Arun Charagonda

సింగరేణి ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు సింగరేణి జనరల్ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను అనుమతిస్తాం అన్నారు.

Advertisement

Punjab: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు..వీడియో ఇదిగో

Arun Charagonda

పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh: పాత మిద్దె కూలి ముగ్గురి మృతి, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు..అనంతపురంలో విషాదం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లిలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య లుగా గుర్తించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Earthquake In Vijayawada: తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం, విజయవాడలో భూప్రకంపనలతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు..సెకన్ల పాటు కంపించిన భూమి..వీడియో

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని విజయవాడ, జగ్గయ్య పేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు.అలాగే హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం ఏరియాల్లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్‌,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు

Arun Charagonda

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది.

Advertisement

CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

Arun Charagonda

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రూప్-4 విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

Telangana: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు, అనంతరం గోడదూకి పారిపోయిన టీచర్...వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. మంచిర్యాల - ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితక బాదారు తల్లిదండ్రులు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Flying Snake: అత్యంత అరుదైన 'తక్షక' నాగును చూశారా?, జార్ఖండ్‌లో ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యక్షం..గాలిలో 100 అడుగుల వరకు ప్రయాణించగల తక్షక నాగు..వీడియో

Arun Charagonda

తక్షకుడనే పాము పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్లోని రాంచీలో కనిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు.అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది.

Earthquake In Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భూకంపం, 10 సెకండ్ల పాటు ఊగిన భూమి..ఉలిక్కిపడ్డ ప్రజలు

Arun Charagonda

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement