తాజా వార్తలు
Health Tips: మీకు ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఫ్రీ డయాబెటిక్ ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.
sajayaఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే షుగర్ వచ్చే ముందు మన శరీరము కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని ఫ్రీ డయాబెటిక్ సంకేతాలు అని అంటారు.
IND vs BAN 2nd Test 2024:బంగ్లాపై రెండో టెస్టులో విక్టరీతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్
Hazarath Reddyబంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు(Ind Vs Ban)లో సూపర్ విక్టరీ కొట్టింది ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..మీ శరీరంలో రక్తం పెరగాలంటే ఈ పండ్లు తింటే సమస్య దూరం.
sajayaమారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను సరైన సమయంలో సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: ఉదయం నిద్ర లేవగానే వికారంగా అనిపిస్తుందా.. అయితే ఈ మూడు వ్యాధుల ప్రారంభ సంకేతాలు కావచ్చు.
sajayaచాలామంది ఉదయం పూట నిద్రలేచిన వెంటనే వికారంగా అనిపించి వాంతులు చేసుకుంటారు. మరి కొంత మంది అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అప్పుడప్పుడు జరిగితే ఇది మామూలే కానీ ప్రతిరోజు ఇలా జరగడం కొన్ని రకాలైన జబ్బులు రావడానికి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.
SC on Bulldozer Action: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు, ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందే, బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం (SC on Bulldozer Action) చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు.. ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.
Telangana Shocker: వీడియో ఇదిగో, గ్రామం నుండి బహిష్కరించారని దంపతులు ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని పెద్దలు గ్రామ బహిష్కరణ విధించడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ బహిష్కరణ చేశారు.
Mainpuri Infant Death: యూపీలో దారుణం, పుట్టిన బిడ్డను చూపించాలంటే రూ. 5 వేలు డిమాండ్ చేసిన నర్సు, తల్లి పాలు లేక పరిస్థితి విషమించి మృతి చెందిన పసిబిడ్డ
Hazarath Reddyడబ్బులు చెల్లించే వరకు శిశువును అప్పగించేందుకు నర్సు నిరాకరించడం వల్లే తమ పసికందు మృతి (Mainpuri Infant Death) చెందిందని మెయిన్‌పురిలోని ఓ కుటుంబం ఆరోపించింది.చికిత్స చేయకపోవడం వల్ల పసికందు పరిస్థితి విషమించడంతో పాప మరణానికి (Newborn Dies in Uttar Pradesh)దారితీసినట్లు సమాచారం
Women at Isha Foundation: నీ కూతురుకు పెళ్ళి చేసి ఇతర యువతుల్ని ఎందుకు సన్యాసినులుగా మారుస్తున్నారు, సద్గురు జగ్జీ వాసుదేవ్‌ను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
Hazarath Reddyజగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్‌లో తన ఇద్దరు కూతుళ్లను బందీలుగా ఉంచి బ్రెయిన్‌వాష్ చేస్తున్నారని ఓ తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఇషా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను మద్రాసు హైకోర్టు కోరింది.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. దీంతో కోప్రాదిక్తులైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం సేవించి యువకులు కారు నడిపారంటూ వారిని స్థానికులు చితకబాదారు.
Haryana Assembly Elections 2024: కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రంగంలోకి వీరేంద్ర సెహ్వాగ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తోషమ్ అసెంబ్లీ అభ్యర్థి అనిరుధ్ కు ప్రచారం చేయనున్న మాజీ క్రికెటర్
Hazarath Reddyఅక్టోబరు 2, బుధవారం నాడు హర్యానాలోని తోషమ్‌లో జరిగే బహిరంగ సభకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హాజరవుతారని కాంగ్రెస్ నాయకుడు, తోషమ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అనిరుధ్ చౌదరి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు తోషమ్‌లోని గ్రెయిన్ మార్కెట్‌లో సమావేశం జరుగుతుందని చౌదరి తెలిపారు.
Govinda Shot By His Own Gun: బాలీవుడ్ నటుడు గోవిందా కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ప్రమాదవశాత్తూ తనకుతానే కాల్చుకున్న నటుడు
Rudraబాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు కాలుకి తీవ్ర గాయాలయ్యాయి.
UP Horror: క్యాష్ ఆన్ డెలివరీపై రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఇంటికి రాగానే గొంతు నులిమి ప్రాణాలు తీసి ఫోన్ తీసేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం
Rudraఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో విక్రయిస్తున్న లక్షల విలువైన ఐఫోన్ పై ఆ ఇద్దరి దుండగుల కన్ను పడింది. డబ్బులు ఇవ్వకుండా ఆ ఫోన్ ను కాజేయాలని కుట్ర చేశారు.
Tortoise Wins Race On Rabbit: పరుగు పందెంలో కుందేలుపై మళ్లీ తాబేలే గెలిచిందోచ్.. చైనా పరుగు పందెం వీడియో మీరూ చూడండి..!
Rudraచిన్నప్పుడు మనం కుందేలు-తాబేలు కథను చదివాం గుర్తుందా? ఓసారి కుందేలు, తాబేలుకు జరిగిన పరుగు పందెంలో వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉన్న కుందేలు నిర్లక్ష్యంగా చెట్టుకింద నిద్రపోయి ఓడిపోతుంది.
MLC Kavitha Hospitalized: హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వైద్య పరీక్షల నిర్వహణ (వీడియో)
Rudraబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కు వచ్చారు. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవనున్నట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుమార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.
No Sleep For 45 Days: '45 రోజులుగా నిద్రలేదు'.. పని ఒత్తిడితో మరో ఉద్యోగి ఆత్మహత్య.. బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఘటన
Rudraపని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది.
Jagananna Thodu Name Change: 'జగనన్న తోడు' పథకం పేరు మారుస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ.. 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మార్చిన ప్రభుత్వం
Rudraఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన 'జగనన్న తోడు' స్కీమ్ పేరును మార్చింది.
Rajinikanth Hospitalised in Chennai: చెన్నైలోని దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు గుండె సంబంధిత వైద్య పరీక్షలు
Rudraతన స్టైల్, మేనరిజమ్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో దవాఖానలో ఆయన చేరినట్టు సమాచారం.
LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన
Rudraదసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్ లో కూడా గ్యాస్ ధర పెరిగింది.