తాజా వార్తలు

Telangana: నీళ్ల సంపులో యువకుడి మృతదేహం...నవీన్ శరీరంపై గాయాలు..హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు!

Arun Charagonda

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న నీళ్ల సంపులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు శాంతి నగర్ కు చెందిన నవీన్ ( 21 ) గా గుర్తించగా నవీన్ శరీరంపై గాయాలు ఉండటంతో హత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Andhra Pradesh Shocker: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ - బస్సు ఢీ..8 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Arun Charagonda

చిత్తూరు జిల్లాలో చిత్తూరు - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద కంటైనర్ లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Donations To Telangana CMRF: రెడ్డీస్ ల్యాబ్ రూ.5 కోట్లు, బాలయ్య కూతురు రూ.50 లక్షలు..ఇంకా ఎవరెవరూ ఎంత ఇచ్చారంటే!

Arun Charagonda

తెలంగాణ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని అందివ్వగా తాజాగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ.

Andhra Pradesh: సీబీఎస్‌ఈ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

TCS Employees Get Tax Notices: 40 వేల మంది టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ షాక్, రూ.1 లక్ష వరకు పన్నుచెల్లించాలంటూ నోటీసులు, కంపెనీ స్పందన ఏంటంటే..

Hazarath Reddy

టీసీఎస్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాకిచ్చింది. 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులను పంపించింది ఐటీ డిపార్ట్ మెంట్. టీడీఎస్ విషయంలో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు పంపింది.

Eid Milad Un Nabi 2024: మిలాద్ ఉన్ నబీ ఎందుకు జరుపుకుంటారు? ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఏమిటీ, అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నారా..

Hazarath Reddy

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.

Nasal Covid-19 Vaccine From Wuhan Lab: కరోనా పుట్టిన వుహాన్‌ ల్యాబ్‌ నుండి కొత్త వ్యాక్సిన్‌, భవిష్యత్తులో వచ్చే అన్ని వైరస్‌లను ఎదుర్కునే నానో వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు సైంటిస్టులు వెల్లడి

Hazarath Reddy

కరోనా వైరస్‌ పుట్టుకకు ప్రధాన కేంద్రమని భావిస్తున్న చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పుడున్న కరోనా వైరస్‌లతో పాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్‌ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు

Fake Doctor Arrest: మేడ్చల్‌లో నకిలీ డాక్టర్, చదివింది డీ ఫార్మసీ చెప్పుకునేది ఎంబీబీఎస్, వల వేసి పెట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు

Arun Charagonda

నకిలీ డాక్టర్‌ని అరెస్ట్ చేశారు ఎస్‌ఓటీ పోలీసులు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడకు వెళ్ళే దారిలో డీ ఫార్మ చేసిన బండ సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ వైద్యుడి అవతారమెత్తి వైరమ్ లతాశ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు. పక్కా సమాచారంతో సాయి వర్ధన్ రెడ్డి ఆటకట్టించారు పోలీసులు.

Advertisement

Uttar Pradesh: సమోసాలో కప్పకాలు, ఉత్తరప్రదేశ్‌లో దారుణం, నిర్వాహకులతో కస్టమర్ల గొడవ..వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తర్ ప్రదేశ్ - గాజియాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సమోసాలు తింటోన్న వ్యక్తికి అందులో కప్ప కాలు కనిపించింది. దీంతో షాక్‌కు గురై నిర్వాహకులతో గొడవకు దిగారు. అనంతరం సదరు స్వీట్స్ షాపుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Telangana Congress: కౌశిక్‌ రెడ్డిపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు, మహిళలను కించ పరిచేలా మాట్లాడారని ఆగ్రహం

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ మహిళా విభాగం. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా నేతలు. కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Arekapudi Gandhi Vs Kaushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ..మొత్తం వివాదానికి కారణం ఇదే, పీఏసీ వ్యవహారం..అగ్నిగుండంలా మారిన రాష్ట్రం!

Arun Charagonda

పార్టీ ఫిరాయింపులు దీనికి తోడు రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం(పీఏసీ) ఛైర్మన్‌ పదవి వెరసీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారిపోయాయి.

Miss Switzerland Finalist: స్విట్జర్లాండ్ మాజీ మిస్ ఫైనలిస్ట్ దారుణ హత్య, క్రిస్టినా జోక్సిమోవిక్‌ను హత్య చేసిన భర్త, దర్యాప్తులో సంచలన నిజాలు

Arun Charagonda

స్విట్జర్లాండ్‌ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే న్యూస్. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. క్రిస్టినా జోక్సిమోవిక్ హత్యకు గురైందని, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఆమె భర్త థామస్ కరిగించాడని స్విస్ అధికారులు వెల్లడించారు. ఆమె 41 ఏళ్ల భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో ఆయన తన నేరాన్ని అంగీకరించాడు.

Advertisement

SC on Bulldozer Action: బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు, చట్టాలే అత్యత్తమమని భావించే దేశంలో ఇలాంటివి తగదని మండిపాటు..

Hazarath Reddy

బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్నిసర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది

MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన బాధితురాలు, రాజీ కోసం టీడీపీ నాయకులు రహస్య మంతనాలు

Hazarath Reddy

టీడీపీ నుంచి సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telangana Flood Relief: తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ఏఎంఆర్‌ ఇండియా కోటి రూపాయల విరాళం, సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన కంపెనీ ఎండీ మహేష్ కుమార్‌

Arun Charagonda

వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కంపెనీ ఎండీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి .

TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, వైఎస్సార్‌సీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు

Hazarath Reddy

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Tollywood: సీఎం చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారనే వార్తలు అబద్దం, క్లారిటీ ఇచ్చిన చరణ్ పీఆర్ టీమ్, అసలు నిజం ఏంటంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి విదితబే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

Ganesh Laddu Auction: వినాయకుడి లడ్డూ వేలంపాటలో ముస్లిం సోదరులు, లడ్డూను రూ.15వేలకు దక్కించుకున్న తాజోద్దీన్..వెల్లివిరిసిన మతసామరస్యం

Arun Charagonda

తెలంగాణలోని వనపర్తిలో మత సామరస్యం వెల్లివిరిసింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో వినాయక లడ్డు వేలం పాట జరిగింది. వేలం పాటలో రూ.15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్. ఇందుకు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశంగా మారింది.

Arvind Kejriwal Granted Bail: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఇవే, సుదీర్ఘంగా నిర్బంధించడమంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు బిగ్ రిలీఫ్ దొరికింది. లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌ తెలుగు 8..అదిరే రేటింగ్స్, గత సీజన్‌ల రికార్డులు బ్రేక్, వెల్లడించిన కింగ్ నాగార్జున

Arun Charagonda

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారం ముగింపుకు వచ్చేసింది. ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. గత సీజన్‌ల రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ వ్యూస్‌ని రాబట్టింది. ఇది గత సీజన్‌ల కంటే అధికమని హోస్ట్ నాగార్జున ఎక్స్ ద్వారా వెల్లడించారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలను మర్చిపోలేమని తెలిపారు నాగ్.

Advertisement
Advertisement