తాజా వార్తలు

Wine Shops Close For 2 Days: రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్, ఈ ప్రాంతాల్లో బార్లు, వైన్స్, మద్యం అమ్మ‌కాల‌పై ప్ర‌త్యేక నిఘా

VNS

గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ (Cyberabad Police) పరిధిలో మద్యం షాపులు (Wine Shops Close), కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Petition on Hydra: హైడ్రాపై ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ‌! హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు, హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన హైకోర్టు

VNS

ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేయ‌డంపై ఆగ్ర‌హం వెలిబుచ్చారు. వివ‌ర‌ణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తార‌ని ప్ర‌శ్నించారు. జీవో 99పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశార‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు.

Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్, పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియామకం

Hazarath Reddy

సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు.

Traffic Restrictions in Cyberabad: సైబ‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, సైబ‌ర్స్ ట‌వ‌ర్స్ నుంచి వెళ్లే వారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

VNS

ఈ నెల 14వ తేదీ నుంచి సైబ‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) వెల్ల‌డించారు ఈ ఆంక్ష‌లు సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ టవ‌ర్స్ ఫ్లై ఓవ‌ర్ ల్యాండింగ్ నుంచి య‌శోద హాస్పిట‌ల్ వ‌ర‌కు కొత్త‌గా స‌ర్వీసు రోడ్డు నిర్మిస్తుండ‌డంతో.. 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

RBI on Interest Rates: వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు, తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేసిన శక్తికాంతదాస్‌

Vikas M

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించడానికి తాను తొందరపడటం లేదని భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సంకేతాలు ఇచ్చారు.

Aadhar Card Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా, సెప్టెంబర్ 14 దాటితే రూ. 50 చెల్లించాల్సిందే, ఆధార్ కార్డ్‌ ఉచిత అప్‌డేట్ కోసం మీరు ఇలా చేయండి

Vikas M

సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాలి. గతంలో దీని గడువు చాలాసార్లు పొడిగించబడింది. దీంతో ఈసారి సెప్టెంబర్ 14 తర్వాత గడువు పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉంది

Ford Returns to Chennai: చెన్నై కేంద్రంగా భారత్‌లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్, వచ్చే మూడేండ్లలో 3 వేల మందికి ఉద్యోగాలు

Vikas M

ఫోర్డ్ నాయకత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఇటీవల జరిగిన సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి TRB రాజా, ముఖ్యమంత్రి MK స్టాలిన్ నేతృత్వంలోని ఒక సంవత్సరం ప్రయత్నాల తర్వాత ఫోర్డ్ తమిళనాడుకు తిరిగి రావడం గురించి Xలో పోస్ట్ చేసారు.

Realme P2 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ పీ2 ప్రో 5జీ విడుదల, ధర ఎంతంటే..

Vikas M

చైనా దిగ్గజం రియల్‌మీ (Realme) తన రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మీ పాడ్ 2 లైట్ (Realme Pad 2 Lite) కూడా తీసుకొచ్చింది.

Advertisement

Satyam Sundaram Teaser Out: స‌త్యం సుంద‌రం టీజర్ విడుదల, స్నేహితులుగా నటిస్తున్న కార్తీ,అరవింద స్వామి

Vikas M

ఈ మూవీ నుంచి త‌మిళ టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా తెలుగు టీజ‌ర్‌ను వ‌దిలారు.ఈ సినిమాలో కార్తీ, అర‌వింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండ‌గా.. రాజ్ కిర‌ణ్, శ్రీదేవి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Mohammad Rizwan Diving Catch Video: వీడియో ఇదిగో, ముందుకు డైవింగ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్

Vikas M

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024, తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైన భారత్ డి, మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్

Vikas M

ఇండియా ఎ వర్సెస్ ఇండియా డి దులీప్ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో 2వ రోజు జరిగిన మ్యాచ్‌లో, ఇండియా ఎ బౌలర్లు ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్ మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇండియా డిని 52/4 స్కోరుకు పరిమితం చేశారు.

Shreyas Iyer Duck Video: శ్రేయ‌స్‌ అయ్యర్ డ‌కౌట్ వీడియో ఇదిగో, స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని మరీ గోల్డన్ డక్, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Vikas M

దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జ‌ట్టు తరఫున ఆడుతున్న శ్రేయ‌స్‌ అయ్యర్ తాజాగా డ‌కౌట్ అయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 7 బంతులు ఎదుర్కొని ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. క్రీజులోకి వ‌చ్చిన అయ్య‌ర్ స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Kadambari Jethwani: వీడియో ఇదిగో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీ, అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్‌ జెత్వానీ వేధింపుల కేసులో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై సినీ నటి జత్వనీ ఫిర్యాదు చేసింది.తనను అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.

Video: వీడియో ఇదిగో, కువైట్‌లో అమ్మేస్తామని బెదిరిస్తున్నారు, నన్ను కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న ఆంధ్రప్రదేశ్ యువతి

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కవితా అనే మహిళ బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లానని, కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Arvind Kejriwal Released From Tihar Jail: వీడియో ఇదిగో, తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, వర్షంలో తడుస్తూ కార్యకర్తలకు అభివాదం

Hazarath Reddy

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.

Andhra Pradesh Rains: రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, వచ్చే రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు

Hazarath Reddy

ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్‌ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

YS Jagan: వీడియో ఇదిగో, పాపా నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ సెటైర్ వేసిన జగన్, పిఠాపురం పర్యటనలో ఆసక్తికర వీడియో వైరల్

Hazarath Reddy

చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.

Port Blair As Sri Vijaya Puram: పోర్టు బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం, శ్రీ విజయ పురంగా మారుస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Arun Charagonda

అండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Astrologer Venuswamy: వేణుస్వామికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు, వేణుస్వామిపై కేసు నమోదుచేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు

Arun Charagonda

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొనగా పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది కోర్టు

YS Jagan Slams CM Chandrababu: ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమంటారు, చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ జగన్, ఇకనైనా జగన్నామం ఆపు అంటూ ఎద్దేవా

Hazarath Reddy

పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్‌ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.

Advertisement
Advertisement