తాజా వార్తలు

Srisailam Temple: వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం, ఆలయ ప్రాముఖ్యత నేపథ్యంలో చోటు, వెల్లడించిన ఆలయ అధికారులు

Arun Charagonda

శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆలయ ప్రాముఖ్యత, ప్రాచీన శిల్పాలు, కట్టడాలు ఆధారంగా వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నట్లు వెల్లడించారు.

Cow In PM Modi House: ప్రధాని మోడీ నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు..దూడకు ప్రత్యేక పూజలు, దీపోజ్యోతి అనే పేరు పెట్టిన మోడీ

Arun Charagonda

ఢిల్లీలోని లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. దీంతో అమ్మవారి ముందు ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడ నుదుడిపైన తెల్లటి జ్యోతి ఆకారంలో ఉండటంతో ఆ దూడ పేరు దీపోజ్యోతి అని పెట్టారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని.

Milad Un Nabi Wishes In Telugu: మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి

sajaya

మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది.

Ganesh Idol: రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు

Arun Charagonda

కోటిన్నర కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేశారు వరంగల్ వాసులు. శివనగర్‌ వాసవీ కాలనీకి చెందిన వినాయక ట్రస్ట్ సభ్యులు ఏకంగా కోటిన్నరతో వినాయకుడికి అలంకరణ చేశారు.రూ. 10, 20, 100, 200, 500 నోట్లతో గజమాలలు తయారు చేసి అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Kadambari Jatwani Case: కాదంబరి జత్వానీ కేసు..ఇద్దరు పోలీసులపై వేటు,పోలీసులు వేధించారని ఫిర్యాదుతో ఇద్దరు పోలీసుల సస్పెండ్

Arun Charagonda

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణ సస్పెన్షన్‌ వేటు పడింది. పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి వేధించారని నటి జత్వానీ ఆరోపణలు చేస్తుండగా.. ఇద్దరు పోలీసులు సస్పెండ్ కావడం గమనార్హం.

Ganesh Immersion: వీడియో ఇదిగో.. వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం, అదుపులోకి తీసుకున్న పోలీసులు, తార్నాకలో ఘటన

Arun Charagonda

వినాయక నిమజ్జనంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. తార్నక వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం ఆడారు కొంతమంది. దీంతో పాములతో ఆడుతున్న వేషధారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Uttarakhand:రిషికేష్‌ను ముంచెత్తిన గంగా నది, భారీ వర్షాలతో భక్తుల అవస్థలు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేష్‌లోని ఆలయం నీట మునగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్‌ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.

Advertisement

TamilNadu CM Stalin On America Tour: ముగిసిన సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన, రూ.7618 కోట్ల పెట్టుబడులు,11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అని వెల్లడించిన తమిళనాడు సీఎం

Arun Charagonda

తమిళనాడు సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన ముగిసింది. తన అమెరికా పర్యటనలో భాగంగా 19 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా రూ.7618 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 11,516 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.

YSRCP Spoke Persons: జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే

Arun Charagonda

ఏపీలో అధికారం దూరమైన తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.

Case Filed Against MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు

Rudra

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Population Crisis in China: బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకుని పిల్లల్ని కనండి.. యువతీ యువకులను వేడుకుంటున్న చైనా.. ఎందుకంటే?

Rudra

‘బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్‌ అవ్వండి’ అంటూ యువతీ యువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటున్నది.

Advertisement

Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి 7 పల్టీలు కొట్టిన కారు, ప్రమాద సమయంలో కారులో 8 మంది..వీడియో

Arun Charagonda

చిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన జరిగిన ఘటనలో కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

UIDAI Extends Free Online Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌ డేట్‌ గడువు మళ్లీ పొడిగింపు.. డిసెంబర్ 14 వరకూ అవకాశం

Rudra

పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్‌ ప్రకటించింది.

Symbol Of Communal Harmony: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్

Rudra

మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు.

Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ ప్రోగ్రాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై ప్రశ్న.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారా? వీడియో ఇదిగో

Rudra

ప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ పై ప్రశ్న అడిగారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటూ అడగ్గా.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న విలువ రూ.1.6 లక్షలు. దీనికి సంబంధించిన వీడియో చూడొచ్చు.

Advertisement

Ganesh Immersion: 17న గణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెల‌వు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..

Rudra

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి.

Sankranti Trains Full: దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

Rudra

తెలుగువారికి ముఖ్యంగా ఆంధ్రులకు పెద్దపండుగగా పిలిచే సంక్రాంతి ఎంత ప్రముఖమైందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే.

Government Scraps Minimum Export Price: ఉల్లి ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు ఎత్తివేసిన కేంద్రం, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ముందు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న స‌ర్కార్

VNS

ఉల్లి ఎగుమతులపై (onion exports) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర (minimum export price condition) నిబంధనను ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్‌టీ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Devara Censor Report: దేవ‌ర సినిమాలో నాలుగు సీన్ల‌కు కోత పెట్టిన సెన్సార్ బోర్డు, ఏయే సీన్ల‌ను తీసేశారో తెలుసా?

VNS

గ్లోబ‌ల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న మూవీ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

Advertisement
Advertisement