తాజా వార్తలు
Cristiano Ronaldo: 100 కోట్ల ఫాలోవర్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ రికార్డు, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో దుమ్మురేపుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం
Hazarath Reddyఅన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పోర్చగల్‌కు చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ CR7 ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ "UR క్రిస్టియానో"ని ప్రారంభించారు.
Japan Shocker: దారుణం, 1000 మందికి పైగా మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు, రాయి లాగా స్పై కెమెరా అమర్చి నిందితుడు ఘాతుకం
Hazarath Reddyఫుకుషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి జపాన్‌లోని వేడి నీటి బుగ్గల్లో (hot springs) స్నానం చేస్తున్న 1,000 మంది మహిళలను రహస్యంగా చిత్రీకరించినందుకు రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. ఆ వ్యక్తి మహిళల అనుమతి లేకుండా అక్కడ ఉండే రాళ్లలో స్పై కెమెరాలను ఉపయోగించి వీడియో రికార్డు చేశాడు.
Sudden Death Caught on Camera: విధి ఎంత విచిత్రమైనది, పనిచేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యోగి, షాకింగ్ వీడియో ఇదిగో..
Hazarath Reddyగుజరాత్‌లోని సూరత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీ కార్మికుడు పనిలో ఉండగానే గుండెపోటుతో మరణించిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. మరణించిన 50 ఏళ్ల విను భాయ్ పటేల్ తన వర్క్‌స్టేషన్‌లో వజ్రాన్ని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా తన కుర్చీలోంచి కుప్పకూలిపోయాడు
MLA Arekapudi Gandhi: బీఆర్ఎస్‌లోనే ఉన్నా, కేసీఆర్‌ను కలవడానికి ఇబ్బంది లేదన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్ అని మండిపాటు
Arun Charagondaబీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలవటానికి తనకు ఇబ్బేందేమీ లేదు అని తెలిపారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పారు...కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్..మా మనోభావాలు దెబ్బదతినటం వలనే ప్రతిగా స్పందిచాల్సి వచ్చిందని చెప్పారు.
KTR On BRS Leaders House Arrest: బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్, సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో ఎందుకంత వణుకు? అని ప్రశ్న
Arun Charagondaబీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్ ల పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేటీఆర్...మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు అని మండిపడ్డారు.
Kejriwal Gets Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు, ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో కేజ్రీవాల్..కండీషన్స్ ఇవే
Arun Charagondaఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ రాగా తాజాగా సీబీఐ కేసులో బెయిల్ లభించింది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్.
Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు
Rudraస్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.
CM Revanth Reddy On Law And Order: శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం
Arun Charagondaతెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న రేవంత్..
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి
Rudraమద్యం పాలసీ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది.
Andhra Pradesh Shocker: తాడిపత్రిలో దారుణం, బైక్ పై వస్తున్న వ్యక్తిని రాళ్లతో దాడి చేసి హత్య చేసిన దుండగులు..వీడియో
Arun Charagondaఅనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు
Leopards in Nizamabad: నిజామాబాద్ లో చిరుతల సంచారం.. పలు గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్.. వైరల్ వీడియోలు
Rudraనిజామాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి కనబడింది.
BRS MLA Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో పోలీసులు.. వీడియో ఇదిగో
Rudraబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ కాంగ్రెస్ ఆందోళనలు, కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతల నిరసనలు వెరసి తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
Bihar Horror: నర్సును గ్యాంగ్ రేప్ చెయ్యడానికి వైద్యుడు సహా మరికొందరి యత్నం.. తనను తాను కాపాడుకోవడానికి వైద్యుడి జననాంగాలు కోసిపారేసిన నర్సు.. బీహార్ లో ఘటన
Rudraతనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఓ వైద్యుడిపై శివంగిలా ఎదురు తిరిగింది ఓ నర్సు. అతని జననాంగాలను కోసిపారేసి తగిన బుద్ధి చెప్పింది ఆ ధీరవనిత.
Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్ ఇకలేరు
Rudraటాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.
FSSAI: కల్తీ స్వీట్స్, పాల ఉత్పత్తులపై కన్నెయ్యండి.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచన
Rudraరానున్న పండుగల సీజన్ నేపథ్యంలో పాలు, పాల సంబంధిత పదార్థాలు, స్వీట్స్ పెద్దయెత్తున కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
Telugu States Weather Update: మొన్నటి విలయానికి ఇంకా కోలుకోకముందే తెలంగాణ, ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
Rudraఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నది. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు.
Ram Mohan Naidu: ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మెన్‌గా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి
Hazarath Reddyఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది.
Committee Kurrollu In OTT: వెండితెరపై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండదు
VNSఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాలను తట్టి లేపడంతో పాటు మంచి విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu OTT platform) సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
WhatsApp Ban: పలు దేశాల్లో వాట్సాప్ బ్యాన్, ఈ ఆరు దేశాల్లో వాట్సాప్ వినియోగించడం కుదరదు, ఎందుకో తెలుసా?
VNSవాట్సాప్ (WhatsApp) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల్లోని ప్రభుత్వాలు మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ని నిషేధించాయనే విషయం చాలా మందికి తెలియదు.
Mamata Banerjee To Resign?: సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన మమతా బెనర్జీ! జూనియర్ డాక్టర్లతో చర్చల కోసం వెయిట్ చేసిన దీదీ..వైద్యులు రాకపోవడంపై అసహనం
VNSప్రజా ప్రయోజనాల కోసం తన పదవికి రాజీనామా (Mamata Banerjee To Resign) చేసేందుకు సిద్ధమేనని అన్నారు. గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లను చర్చల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే సీఎం మమతా బెనర్జీ హాజరు కావాలని, చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. చర్చలకు మమతా బెనర్జీ హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది.