తాజా వార్తలు
Health Tips : మీరు నోరు తెరిచి నిద్రపోతున్నారా? , అయితే జాగ్రత్త, సమస్యల్లో ఉన్నట్లే?, ఓ సారి డాక్టర్లను సంప్రదించండి?
Arun Charagondaమీరు కానీ మీ ఇంట్లో వారు కానీ నోరు తెరచి నిద్రపోతున్నారా?,అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే?, అనారోగ్య సమస్యలు మీ చుట్టూ ఉన్నట్లే?,ఇంతకీ నోరు తెరచి నిద్రపోతే జరిగే అనార్థాలు ఏంటో తెలుసా?, ఓ స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Karnataka Shocker: దారుణం, అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyకర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది.
Independence Day 2024: 78వ స్వాతంత్య్ర దినోత్సవం, పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం, సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్న పర్యాటకులు
Arun Charagondaదేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఊరూర, వాడ వాడలా మువ్వన్నెల జెండ రెపరెపలాడింది.
Telangana: వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం
Hazarath Reddyఅధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు. రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. మేయర్ కమీషనర్ ఉన్న సమయంలోనే.. ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు విజయ్.
Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..
Hazarath Reddyకామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు
Viral Video: రెండుగా విడిపోయిన అహ్మదాబాద్ - ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, గోతంగం యార్డ్ సమీపంలో ఘటన, వీడియో వైరల్
Arun Charagondaఅహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్ భోగిలు రెండుగా విడిపోయాయి. కప్లర్ లోపం కారణంగా సూరత్ సమీపంలో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెనుక ముందు బోగీలను ఫ్లాట్‌ఫామ్‌కి తరలించారు. ఇవాళ ఉదయం 8:50 గంటలకు వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోని ఢీకొట్టిన భారీ ఐరన్ లోడ్ లారీ, ఒకరు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyజోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్థాన్ భారీ ఐరన్ లోడ్ ట్రాలీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Weight Loss Story: అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి
Hazarath Reddyప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మోహ్‌సేన్ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు.
Vivek Ramaswamy on Bangladesh Hindus Attack: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన వివేక్ రామస్వామి, హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని మండిపాటు,
Arun Charagondaరిజర్వేషన్లు తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆందోళనలకు కారణం కాగా వందలాది మంచి చనిపోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా బంగ్లాలో దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఆ దేశంలో ఉంటున్న హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.
New ED Director: ఈడీ కొత్త బాస్‌గా రాహుల్ నవీన్, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్న 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి
Hazarath Reddyఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్ నవీన్ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన నవీన్ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.
Jagan's Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్
Hazarath Reddyఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు.
CM Chandrababu: 2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
PM Modi Independence Day 2024 Speech: 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యం, ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత ఎదగాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ
Hazarath Reddy78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు.
Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaతెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్ పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నుండి తిరిగి వచ్చిన సీఎం రేవంత్...ఆనంద్ మహీంద్రా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు
CM Revanth Reddy: గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ
Arun Charagondaదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మరువలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రేవంత్.
Mpox Outbreak in Africa: ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ కల్లోలం, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలకు పొంచి ఉన్న ముప్పు
Hazarath Reddyఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇందులో 96శాతానికిపైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్ మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.
Kolkata Doctor Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్, సామూహిక అత్యాచారం చేసి చంపేశారని తెలిపిన తల్లిదండ్రులు, వైద్యురాలి శరీరంలో 150 మి.గ్రా వీర్యం
Hazarath Reddyకోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం (Doctor Rape-Murder Case) చేసి చంపేసిన సంగతి విదితమే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
Stray Dogs Attack In Karimnagar: కరీంనగర్‌లో వీధి కుక్కల దాడి, ముగ్గురు చిన్నారులపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaకరీంనగర్‌లో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి వీధి కుక్కలు. కరీంనగర్ - వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాగ ప్రణయ్(12), రిషి(10), స్వప్న అనే ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.గాయపడిన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
Telangana: శభాష్ ఆటో అన్న, నీటిలో కొట్టుకుపోతున్న కుటుంబాన్ని కాపాడిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
Arun Charagondaమహబూబాబాద్ - గార్ల మండలంలో ఏరు దాటుతుండగా కాలు జారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు. రాంపురం పాకాల ఏరు పైనుంచి దాటుతున్న తండ్రి, కూతురు, కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడాడు. దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు.
Andhra Pradesh: బెట్టింగ్‌లో రూ.2.40 కోట్ల అప్పు చేసిన కొడుకు, అప్పులు కట్టలేక తల్లిదండ్రుల ఆత్మహత్య, నంద్యాలలో విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో విషాదం నెలకొంది. అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ₹2.40 కోట్ల అప్పు చేశాడు. తల్లిదండ్రులు వాళ్ల 10 ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్నారు.