India
Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన
Rudraమహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.
CM Revanth Reddy: ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.
Top Real Estate Deal: అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఢీల్... గరుగ్రామ్‌లో ఏకంగా రూ.190 కోట్లకు అమ్ముడైన పెంట్‌హౌస్
Arun CharagondaInfo-x సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గురుగ్రామ్‌లోని DLF ది కామెలియాస్‌లో ₹190 కోట్లకు 16,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేసింది. ఇది భారతదేశపు అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్‌లలో ఒకటి.
Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి.. పల్నాడు జిల్లాలో ఘటన (వీడియో)
Rudraపల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.
Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన
Rudraసిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
Rudraదేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Traffic Restrictions At Tankbund: ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఈ వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం
VNSవాయుసేన విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Delhi Horror: నచ్చిన పిల్లతో పెళ్లికి ఒప్పుకోలేదని కన్నతల్లినే చంపేశాడు, పైగా దోపిడీ దొంగలు చంపేశారని కథ అల్లాడు
VNSనచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లి నిరాకరించింది. దీనిపై అసంతృప్తి చెందిన కొడుకు ఆమెను హత్య చేశాడు. (Man Kills Mother) దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 22 ఏళ్ల శావన్ పోలీసులకు ఫోన్ చేశాడు
Telangana Govt Gazette on GP Merging: ఓఆర్ఆర్ సమీప మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయతీల విలీనం, గెజిట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
VNSహైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
CM Revanth Reddy: తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు
Arun Charagondaసరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా జీబీ గూడెం గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలు సభలో పాల్గొని ప్రసంగించారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా నుంచే అనేక మంది ప్రాతినిధ్యం వహించారు అన్నారు.
Nara Lokesh: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్..ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తయారుచేస్తామని నారా లోకేష్ వెల్లడి
Arun Charagondaబాపట్ల మున్సిపల్ హైస్కూలులో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్ – టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కలిసి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు.
Ponnam Prabhakar Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా వినతి, రాజకీయాలు చర్చించలేదన్న పొన్నం
Arun Charagondaతెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్‌ను ఆహ్వానించాం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 9న సచివాలయంలో జరిగే విగ్రహావిష్కరణకు ప్రోటోకాల్ అధికారులతో కలిసి కేసీఆర్‌కు ఆహ్వానం అందించాం అని చెప్పారు
Andhra Pradesh: మంగళగిరిలో కారు బీభత్సం, నలుగురికి తీవ్ర గాయాలు...అతివేగంతో చెట్టును ఢీకొట్టిన కారు, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి బైపాస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో భగీరథ హోటల్ వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Actress Pragya Nagra: ఆ వీడియో నాది కాదు.. ఏఐ కంటెంట్‌తో ఫేక్ వీడియోలు, అలాంటి వారిని చూస్తే జాలేస్తోందన్న నటి ప్రగ్యా నగ్రా
Arun Charagondaతన ప్రైవేట్ వీడియోలు లీక్ అంశంపై స్పందించింది నటి ప్రగ్యా నగ్రా. ఆ వీడియో నాది కాదు.. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారి చూస్తే జాలేస్తోందన్నారు. తనకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్ చెప్పారు. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదని చెప్పారు.
PM Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..ముంబై పోలీసులకు బెదిరింపు మెస్సేజ్..నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Arun Charagondaప్రధాని మోదీని హతమారుస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్‌తో అప్రమత్తమై విచారణ చేపట్టారు పోలీసులు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసికి మతి భ్రమించినట్లుగా గుర్తించగా భారత న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
KTR: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం..పోయింది అధికారమే కానీ పోరాడేతత్వం కాదన్న కేటీఆర్, రసమయి రూపొందించిన పాట రిలీజ్
Arun Charagondaతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కెసిఅర్ పదవి త్యాగం నుంచి మొదలైన పార్టీ ప్రయాణం ఆయన ప్రాణత్యాగం దాకా సాగిందని, అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పోయింది అధికారమే, కానీ ప్రజల కోసం పోరాడే పార్టీ లక్షణం కాదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అంతే నిబద్దతతో పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.
Minister Seethakka: క్రికెట్ ఆడిన మంత్రి సీతక్క, భారత్ జోడో యాత్ర స్పూర్తితో క్రీడా పోటీలు నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ
Arun Charagondaఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సనత్ నగర్ ఎంసీహెచ్ గ్రౌండ్‌లో జరిగిన భారత్ జోడో స్పోర్ట్స్ మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్పూర్తితో క్రీడా పోటీలు నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు సీతక్క.
Earthquake In Mahbubnagar: తెలంగాణలో మరోసారి భూకంపం..మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు
Arun Charagondaతెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్ నగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 భూకంప తీవ్రత నమోదుకాగా భయంతో ప్రజలు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KTR: రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ..రైతులు ఆశపడతారు కానీ అడుక్కోరు, కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించిన కేటీఆర్...రైతులకు మేలు చేసింది బీఆర్ఎస్ అని వెల్లడి
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతుబంధు,అడగకుండానే రైతుబీమా,అడగకుండానే సాగునీళ్లు, అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు,అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు ఇవన్నీ ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.
Andhra Pradesh Shocker: వివాహేతర సంబంధం...భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య..కళ్ళల్లో కారం కొట్టి..వీడియో ఇదిగో
Arun Charagondaకళ్ళల్లో కారం కొట్టి, బండరాయితో మోది భర్తను హతమార్చింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడు ఆనంద్ సహాయంతో భర్త గోవింద్ ను కడతేర్చింది భార్య మీనా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోలిశెట్టి పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.