India

Train Derailment In Peddapalli:పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 37 రైళ్ల రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు

Arun Charagonda

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రాఘవాపురం-రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 44 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలులో 11 వ్యాగన్‌లు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. దీంతో 37 రైళ్లను రద్దు చేయగా పలు రైళ్లను దారి మళ్లించారు.

Bunty Shelke: ఎన్నికల ప్రచారంలో వింత, బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి ఓట్లు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షిల్కే, బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరించిన కాంగ్రెస్ అభ్యర్థి...వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వింత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి. నాగ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి బంటీ షిల్కే ...తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ దాట్కే ప్రచార కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరిస్తూ, కొందరు సీనియర్ నాయకుల నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hero Varun Tej At Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్, మట్కా రిలీజ్ నేపథ్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం..వీడియో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో వరుణ్ తేజ్ . 'మట్కా' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చింది చిత్రబృందం. ఈ సందర్భంగా స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు.

Warangal: దొంగగా మారిన ఆర్టీసీ డ్రైవర్, బంగారం కొట్టేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు..ఓ ప్రయాణికుడి వీడియోతో బయటపడ్డ డ్రైవర్ బాగోతం...వీడియో ఇదిగో

Arun Charagonda

ఓ ఆర్టీసీ డ్రైవర్ దొంగగా మారాడు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న మహిళ, తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. ఈ క్రమంలోనే ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్‌గా నొక్కేశాడు. అయితే, ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్‌ ఫోన్‌లో రికార్ట్ చేయడంతో బండారం బయటపడింది.

Advertisement

CM Revanth Reddy: రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

Arun Charagonda

అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిపై మాకొక స్పష్టమైన విజన్ ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్.. వంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం అన్నారు. ఇప్పుడు మా నినాదం రైజింగ్ తెలంగాణ... చైనా ప్లస్ వన్ కంట్రీకి సరైన మార్గంగా చైనా ప్లస్ తెలంగాణ చూపిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Andhra Pradesh Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు, ఏకగ్రీవం కానున్న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

Arun Charagonda

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ. వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో రఘురామకు చోటు దక్కుతుందని అంతా భావించిన సామాజిక సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు.

New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి నుంచి సరికొత్తగా డిజైర్ వచ్చింది, ధర రూ. 6.79 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన ఫోర్త్ జనరేషన్ సెడాన్ `డిజైర్`ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. డిజైర్ ఫీచర్లు మరింత డెవలప్ చేసి విపణిలోకి తీసుకువచ్చింది. డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, పవర్ ట్రైన్, కంఫర్ట్, సేఫ్టీ, స్టైల్‌గా రూపుదిద్దుకుని ఈ బండి మార్కెట్లోకి వచ్చింది

Vivo Y18t: 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైన వివో వై18టీ, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో అదనపు ఆకర్షణ, ధర ఎంతంటే..

Vikas M

స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) తన వివో వై18టీ (Vivo Y18t) ఫోన్ భారత్ మార్కెట్లో విడుదల చేసింది. వివో వై18టీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది.రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తోంది.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి రీల్ కోసం రైలు పట్టాలపై ఎస్‌యూవీని నడిపిన మందుబాబు, చివరకు ఏమైందంటే..

Vikas M

రాజస్థాన్‌లో జరిగిన ఓ విచిత్రమైన ఘటనలో, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు రీల్ కోసం జైపూర్‌లోని రైల్వే ట్రాక్‌పై తన ఎస్‌యూవీని నడిపాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైల్వే ట్రాక్‌పై నాలుగు చక్రాల వాహనం ఇరుక్కున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shocking Rent Deal in Bengaluru: బెంగుళూరులో ఇంటి అద్దె నెలకు రూ. 40 వేలు, డిపాజిట్ 5 లక్షలు, షాక్ అయ్యానంటూ పోస్ట్ పెట్టిన మహిళ, నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే...

Vikas M

బెంగళూరులో ఇటీవలి ఉదాహరణలో, నెలవారీ అద్దె రూ. 40,000 ఉన్న ఫ్లాట్ కోసం ఇంటి యజమాని రూ. 5 లక్షల డిపాజిట్‌ను అభ్యర్థించడంతో ఫ్లాట్ కోసం వెతుకుతున్న ఒక మహిళ ఆశ్చర్యపోయింది. ఈ అద్దె ఎంపికను చూసిన హర్నిద్ కౌర్ అనే మహిళ, దాదాపు 12 రెట్లు అద్దెకు ఉన్న అసమానమైన డిపాజిట్ డిమాండ్‌ను చూసి షాక్ అయ్యారు.

Asian Champions Trophy 2024:మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024, దక్షిణ కొరియాపై భారత మహిళల హాకీ జట్టు 3-2తో ఘన విజయం

Vikas M

బీహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో దక్షిణ కొరియాను 3-2 స్వల్ప తేడాతో ఓడించిన భారత మహిళల జాతీయ హాకీ జట్టు తమ విజయాల పరుగును కొనసాగించింది. గత మ్యాచ్‌లా కాకుండా, మొదటి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది.

Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్ కోచ్‌గా వరల్డ్ కప్ హీరో మునాఫ్ పటేల్, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ యాజమాన్యం

Vikas M

ఐపీఎల్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) స్థానంలో భార‌త మాజీ ఆట‌గాడు హేమంద్ బ‌దొనికి హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ ఢిల్లీ యాజ‌మాన్యం తాజాగా భార‌త జ‌ట్టు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో అయిన మునాఫ్ ప‌టేల్ (Munaf Patel)ను కొత్త‌ బౌలింగ్ కోచ్‌గా నియ‌మించింది.

Advertisement

Gold, Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్, బంగారం ధర ఆకాశం నుంచి నేల మీదకు వస్తోంది, నిన్న ఒక్కరోజే రూ.1,750 తగ్గిన బంగారం ధర

Vikas M

చుక్కలను అంటిన బంగారం, వెండి ధరలు దేశీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం తగ్గుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర మంగళవారం ఒక్కరోజే రూ.1,750 తగ్గి రూ.77,800లకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.2700 పడిపోయి రూ.91,300లకు చేరుకున్నది.

Shalini Passi: తిరుపతిలో నాలుగు సార్లు తలనీలాలు ఇచ్చాను, ఢిల్లీ ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి కీలక వ్యాఖ్యలు, టీటీడీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చిన దంపతులు

Vikas M

ఢిల్లీకి చెందిన ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిలో నాలుగుసార్లు తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపింది. "నేను కూడా తిరుపతిలో నాలుగు సార్లు నా తలనీలాలను సమర్పించుకున్నాను కాబట్టి నాకు హెయిర్ స్టైల్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు.

Allu Arjun Fans Storm YouTube Channel: వీడియో ఇదిగో, యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారని మండిపాటు

Vikas M

బన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు.

KTR Slams Congress: పార్టీ మారిన ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చిన కేటీఆర్, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్

Hazarath Reddy

ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మీరు ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారని విమర్శించారు

Advertisement

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణకు చెందిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) స్కీమ్ టెండర్లలో జరిగిన అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలించాలని కెటి రామారావు (కెటిఆర్) డిమాండ్ చేశారు.

YS Sharmila on Jagan: వీడియో ఇదిగో, జగనన్నను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన షర్మిల, సోషల్ మీడియాలో మాపై అసభ్యకర పోస్టులు పెట్టించింది ఆయనేనని మండిపాటు

Hazarath Reddy

Telangana Land Acquisition Protest: వికారాబాద్‌లో అధికారులపై దాడి, 55 మందిని అదుపులోకి తీసుకున్న పొలీసులు, కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరో విచారణ చేస్తామని తెలిపిన ప్రభుత్వం

Hazarath Reddy

లగిచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారులపై దాడి జరిగిన ఒక రోజు తర్వాత, పోలీసులు కనీసం 55 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు ఇంటర్నెట్ సేవలను కూడా మూసివేశారు.

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ

Hazarath Reddy

సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జనసేన నాయకులు.

Advertisement
Advertisement