India
Donald Trump: నేను డొనాల్డ్ ట్రంప్ నిజమైన కూతురిని, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ యువతి, పాత వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఇక ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది.
Food Safety Inspections: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టి అధికారుల తనిఖీలు, కృతుంగ రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తింపు..వీడియో
Arun Charagondaహైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
SC on Recruitment Rules for Govt Jobs: రిక్రూట్‌మెంట్ మధ్యలో రూల్స్ మార్చకూడదు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Hazarath Reddyప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రిక్రూట్‌మెంట్ మధ్యలో రూల్స్ మార్చకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
Andhra Pradesh: వైసీపీ సంచలన నిర్ణయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు కీలక ప్రకటన, కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనపై మండిపాటు
Hazarath Reddy‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు.
Andhra Pradesh: వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు, అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyపులివెందులకు చెందిన వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం తనపై రవీంద్రరెడ్డి అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే.
Ancient Weapons: వీడియో ఇదిగో, పొలాల్లో బయటపడ్డ వందేళ్లనాటి కత్తులు, తుపాకులు, బాకులు, ఈటెలు, తుప్పు పట్టిపోయిన పురాతన ఆయుధాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నగరంలో కత్తులు, తుపాకులు, బాకులు, ఈటెలు వంటి పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేసిన వైరల్ వీడియోలో పొలంలో లభించిన పురాతన ఆయుధాల నిధిని చూపిస్తుంది.
Aghori At Srikalahasti Temple: శ్రీకాళహస్తిలో మహిళ అఘోరి హల్‌చల్, పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం, నీళ్లు పోసిన పోలీసులు...వైరల్ వీడియో
Arun Charagondaశ్రీకాళహస్తిలో మహిళా అఘోరి హల్ చల్ చేశారు. ఆలయంలోకి వెళ్ళేందుకు యత్నించింది అఘోరి. అయితే అఘోరిని అడ్డుకున్న ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తన మీద, తన కార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించుకునేందుకు యత్నించగా అఘోరిపై నీళ్ళు పోశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CM Revanth Reddy Sand Art In Puri Beach: పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఒడిశాలోని సముద్ర తీరం పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని వేయించి తన అభిమానాన్ని చాటారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Merugu Nagarjuna Case: మేరుగు నాగార్జున కేసులో ఫిర్యాదుదారుకి హైకోర్ట్ షాక్, తప్పుడు కేసు పెట్టినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిక, విచారణ 12కి వాయిదా
Hazarath Reddyవైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు హైకోర్టుకి (Andhra Pradesh high court) నివేదించారు.
Actress Janhvi Kapoor: అమీర్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు చేసిన దేవర బ్యూటీ..వీడియో
Arun Charagondaఅమీర్ పేటలోని వెంగళరావు నగర్‌లో సందడి చేశారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. వెంగళరావు నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాన్వీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
PV Sindhu: బ్యాడ్మింటన్ అకాడమీకి పీవీ సింధు భూమి పూజ, ఏడాదిలోపు అకాడమీ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటన
Arun Charagondaబ్యాడ్మింటన్ అకాడమీకి పీవీ సింధు భూమి పూజ చేశారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింటన్ అకాడమీని నిర్మిస్తున్నారు సింధు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు సింధు. ఏడాదిలోపు అకాడమీ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించగా తమ అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వ సహకారం ఉందని తెలిపారు. అన్నీ అనుమతులు లభించాకే భూమి పూజ చేశానని తెలిపారు.
Weather Forecast: తమిళనాడుకు మరో తుపాను ముప్పు, వచ్చే 48 గంటల్లో అల్లకల్లోలంగా మారనున్న బంగాళాఖాతం, తెలుగు రాష్ట్రాలకు 4 రోజులు పాటు వర్ష సూచన
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను గత నెలలో వణికించిన వానలు మళ్లీ వణికించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Weather Forecast for Telugu States) ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Viral Video: వృద్దురాలిపై ఎద్దు దాడి, దేశ రాజధాని ఢిల్లీలో ఘటన, ధైర్యంతో ఎద్దును ఎదుర్కొన్న వృద్ధురాలు..శభాష్ అంటున్న నెటిజన్లు..వీడియో ఇదిగో
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొనగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
J&K Assembly session: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ
Arun Charagondaజమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంజనీర్ రషీద్ బ్రదర్ అవామి ఇత్తేహజ్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బ్యానర్ ప్రదర్శించడంతో గొడవ మొదలైంది.
Hydra Team To Visit Bangalore: బెంగళూరుకు హైడ్రా బృందం, రెండు రోజుల పాటు పర్యటన, బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం
Arun Charagondaహైడ్రా బృందం ఇవాళ బెంగళూరులో పర్యటించనుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించి అక్కడి చెరువుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేయనున్నారు అధికారులు.
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు, ఏడుగురు పోలీసుల సస్పెండ్, సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు..వైరల్‌గా మారిన వీడియో, ఉన్నతాధికారుల చర్యలు
Arun Charagondaవైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్లిన పోలీసులు. అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు పోలీసులు.
TTD: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభం, త్వరలో నివేదిక ఇవ్వనున్న సిట్
Arun Charagondaతిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. నిన్న అమరావతి లో సమావేశమయ్యారు సిట్ సభ్యులు. ఇప్పటికే సిట్‌లో సభ్యులుగా సీబీఐ నుంచి సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్.వీరేష్‌ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ ఆర్.మురళీ ఉండగా ఏపీ ప్రభుత్వం నుంచి సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అహార భద్రతా సంస్థ నుంచి ఇంకా సభ్యుడి నియామకం జరుగలేదు.
Drunk And Drive Cases: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు, 27 మందికి పారిశుద్ధ్య పనులు చేయాలని ఆదేశం..
Arun Charagondaడ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు తీర్పునిచ్చింది. మంచిర్యాల కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh: ఏపీ మంత్రి సవిత మంచి మనసు, రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు, మంత్రిని అభినందించిన స్థానికులు..వీడియో
Arun Charagondaగుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై APSRTC బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు... అదే సమయంలో అటుగా వెళుతున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను హాస్పటల్‌కి తరలించారు. గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు వెళ్లడంతో మంత్రి... అక్కడికి సమీపంలోని తన ఇంటికి నడుచుకొంటూ వెళ్ళిపోయారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు సాయపడిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.