India
MP Kiran Kumar Reddy: ఫోర్త్ సిటీపై విష ప్రచారం సరికాదు, తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
Arun Charagondaప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్, పాకిస్థాన్‌లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వీడియో సందేశం, ఓ చిన్నారి పాటను షేర్ చేసిన పవన్
Arun Charagondaదీపావళి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. ఓ చిన్నారి పాడిన పాటను షేర్ చేస్తూ దేశ విభజనకు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది. భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు పవన్.
Warangal: ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో
Arun Charagondaఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు ఓ చిరు వ్యాపారి. వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం చేశాడు.
RS Praveen Kumar: మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ, విలువైన పత్రాలు మాయం...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaమాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసినిలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.
CM Revanth Reddy: సిరిసిల్ల కళాకారుడి అద్భుతం, వాటర్ మిలన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు. గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో వాటర్ మిలన్ పై రేవంత్ చిత్రాన్ని తీర్చిదిద్ది అందరినీ అబ్బుర పరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్
Arun Charagondaదీపావళి వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు అన్నారు. అలాగే దేవుళ్ల బొమ్మ ఉన్న టపాసులను కొనుగోలు చేయవద్దని తద్వారా వచ్చే దీపావళికి అయినా అలాంటి టపాసులు మార్కెట్‌లోకి రావన్నారు. ఇందుకు అందరూ ప్రతిజ్ఞ చేసి కలిసి రావాలని కోరారు రాజాసింగ్.
Vijayasai Reddy: చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు, ప్రాజెక్టు ఎత్తును తగ్గించి ద్రోహం చేస్తున్న చంద్రబాబు అని మండిపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Arun Charagondaపోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన..అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అని మండిపడ్డారు.
Delhi Air Pollution: దీపావళి రోజున ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత.. ఉదయం వరకు కమ్మేసిన పొగమంచు, బాణసంచాతో గాలి మరింత విషపూరితమవుతుందని ఆందోళన
Arun Charagondaదీపావళి రోజు దేశ రాజధాని ఢిల్లీని ముంచేసింది పొగమంచు. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచి 418గా నమోదుకాగా అక్షరధామ్ ఆలమ సమయంలోనూ గాలి నాణ్యత పడిపోయింది.దీపావళి పండుగ కావడంతో బాణాసంచాలు కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరికి చేరే ప్రమాదం ఉంటుందని.. ప్రజలంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Diwali At Graveyard: స్మశానంలో దీపావళి, కరీంనగర్‌లో ఆరు దశాబ్దాలుగా వింత ఆచారం, సమాధుల దగ్గర టపాసులు కాల్చి దీపావళి పండుగ..వీడియో ఇదిగో
Arun Charagondaసాధారణంగా దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే.. వీళ్లు మాత్రం స్మశాన వాటికలకి వచ్చి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కోనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోనే ఓ సామాజిక వర్గం. సమాధుల వద్ద పూజలు నిర్వహించి... చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. అనంతరం పిల్లలతో కలిసి దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
Naga Chaitanya-Sobhita Dhulipala Wedding Date: నాగచైతన్య - శోభిత ధూళపాళ్ల పెళ్లి డేట్ ఫిక్స్, డిసెంబర్ 4న పెళ్లి జరగనుందని ప్రకటించిన కుటుంబ సభ్యులు!
Arun Charagondaఅక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 4న వీరు ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా..?, తస్మాత్ జాగ్రత్త..డబ్బులు కాజేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన స్ధానికులు
Arun Charagondaకర్నూలులో బడా మోసం బయటపడింది. ఏటీఎం మెషిన్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారికి టోకరా వేస్తున్నాడు ఓ యువకుడు. మెషిన్ లో డిపాజిట్ కి బదులు.. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సెక్షన్ చేస్తానంటూ భారీగా డబ్బులు కాజేస్తున్నాడు యువకుడు. దీంతో యువకుడిని పట్టుకుని చితకబాదారు స్థానికులు.
DK Shivakumar:ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్షిస్తామని వెల్లడించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
Arun Charagondaఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
Donald Trump Election Stunt With Garbage Truck: డోనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ స్టంట్! చెత్త వాహనంలో ప్రచారానికి వచ్చిన ట్రంప్, తారా స్థాయికి చేరిన మాటలయుద్ధం, జో బైడెన్ కు కౌంటర్ గానే చెత్త ట్రక్కుతో క్యాంపెయిన్
VNSరిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెత్త ట్రక్కును నడుపుతూ కనిపించాడు. విస్కాన్సిస్ విమానాశ్రయంలో ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని రాసిఉన్న ‘చెత్త’ ట్రక్కును (Donald Trump Election Stunt With Garbage) నడుపుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు.
Deepotsav 2024: 500 ఏళ్లుగా రామభక్తులు చేసిన త్యాగాలు, తపస్సులతో ఇది సాధ్యమైంది, అయోధ్య దీపోత్సవ్ పై ప్రధాని మోదీ స్పందన
VNSప్రధాని మోదీ (Narendra Modi Wishes) సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు.
Muhurat Trading: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ ముహురత్ ట్రేడింగ్, కేవలం గంట సేపు మాత్రమే ఓపెన్, ఇంతకీ ముహురత్ ట్రేడింగ్ అంటే ఏమిటి?
VNSస్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి (Deepawali) అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ (Muhurat Trading) నిర్వహించే ఏకైక దేశం మనదే.
Ukraine Warning To North Korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు జెలెన్ స్కీ వార్నింగ్, యుద్ధంలో కలుగజేసుకోవద్దంటూ హితవు
VNSయుక్రెయిన్ కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల దళాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా సైతం ప్రత్యర్థులు ఎలాంటి దాడులు చేసినా తట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
Mayonnaise Banned in Telangana: తెలంగాణలో మయోనైజ్ బ్యాన్, మోమోస్ తిని మహిళ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
Vikas Mరాష్ట్రంలో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది రోగాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, అన్నమయ్య జిల్లాలో 1000 లీటర్లకు సారా ఊటని ధ్వంసం చేసిన పోలీసులు, నాటు సారా తయారు చేసి అమ్మితే కేసులు తప్పవని హెచ్చరిక
Vikas Mఅన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నారమాకులపల్లి తండాలో సీఐ కళా వెంకట్రావు, ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు చేసిన ఆకస్మిక దాడులలో 1000 లీటర్లకు సారా ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, అమ్మడం నేరమని, పోలీసు నియమాలు పాటించని వారిపై పోలీసు కేసులు తప్పవని హెచ్చరించారు.
ICC Test Rankings: ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా కగిసో రబాడ, నంబర్ వన్ ర్యాంకు నుంచి 3వ స్థానానికి పడిపోయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా
Vikas Mఐసీసీ తాజాగా టెస్ట్ బౌలింగ్ ర్యాంకులను బుధవారం విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. పూణే టెస్టులో న్యూజిలాండ్‌పై ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నంబర్ వన్ ర్యాంకు నుంచి 3వ స్థానానికి దిగజారాడు.