India
Suman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదంపై హీరో సుమన్, లడ్డూ కల్తీ నిజమని తేలితే ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. తిరుమల లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే.. వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని సుమన్ సంచలన కామెంట్స్ చేశారు.
BJP MLA Rajasingh: తన ఇంటివద్ద రెక్కీ నిర్వహించడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తన ఫోటోలు ముంబైకి పంపినట్లు వెల్లడి, ఇద్దరిని పట్టుకున్న స్థానికులు
Arun Charagondaనా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై స్పందించిన రాజాసింగ్..నిన్న రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారు అన్నారు. అందులో ఇద్దరు పారిపోగా.. మరో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారని..అనుమానితుల సెల్ ఫోన్ లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లు గుర్తించారన్నారు
Ram Charan Wax Statue: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం,సింగపూర్ మ్యూజియంలో రామ్ చరణ్‌తో పాటు రైమీ విగ్రహం ఏర్పాటు..వీడియో
Arun Charagondaమెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే ఫోటో షూట్ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు రామ్ చరణ్.
IIFA Utsavam 2024: కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్..ఎందుకో తెలుసా!
Arun Charagondaఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్,మాలీవుడ్ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.
Health Tips: షుగర్ సమస్య ఉన్నవారు బీన్స్ తీసుకోవడం ద్వారా మీకు వీరికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.క్యాన్సర్లను గుండె జబ్బులను దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.
sajayaబీన్స్ ప్రతిరోజు మనము తీసుకునే ఆహార పదార్థాలలో ఒకటిగా ఉంటుంది. బీన్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉంటాయి.
CJI DY Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్, గర్బాలయంలో ప్రత్యేక పూజలు చేస చంద్రచూడ్..వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు జస్టిస్ చంద్రచూడ్. రంగనాయకుల మండపంలో జస్టిస్ కు ఆశీర్వచనం అందించారు పండితులు.
Health Tips: ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనే సమస్య సర్వసాధారణమైంది. వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఫ్యాటీ లివర్ సమస్య ప్రధానంగా అధిక బరువు, కొలెస్ట్రాల్, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
MLA Danam Nagender On Hydra: పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, జలవిహార్- ఐమ్యాక్స్‌లను కూల్చాలని డిమాండ్
Arun Charagondaహైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పాను అన్న దానం.. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూల్చుకొండన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు అని తెలిపారు.
CM Revanth Reddy On Familey Digital Cards: మహిళనే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Arun Charagondaరాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (#FDC) రూపకల్పనపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Astrology: అక్టోబర్ 10వ తేదీన గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 10న గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన
Arun Charagondaతెలంగాణలోని పటాన్‌చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.
Gold Saree: సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ..
Arun Charagondaసిరిసిల్ల చేనేత కార్మికుడు అద్భుతం సృష్టించాడు. ఓ వ్యాపారి కుమార్తె వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేశారు విజయ్ కుమార్. 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీర తయారు చేయగా ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అయినట్లు విజయ్ కుమార్ తెలిపారు.
Surya Grahanam 2024: సూర్యగ్రహణం అక్టోబర్ 2 న కన్య రాశిలోకి సూర్యుడు కేతువు కలయికతో బుధాదిత్య యోగం ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:13 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3:17 నిమిషాలకు ముగుస్తుంది. ఈసారి సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది
Udhayanidhi Stalin: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం... పూర్తి వివరాలివే
Arun Charagondaతమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం స్టాలిన్ తన తనయుడు ఉదయనిధికి కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధిని నియమించారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉడనుంది.
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం, సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
Arun Charagondaమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
New Electric Super Luxury Buses: తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు.. నేటి నుంచి ప్రారంభం
Rudraతెలంగాణలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు.
BRS MLAs Visits Musi Catchment Areas: మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బాధితులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ బృందం..వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసి భాదితుల ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే పార్టీ తరుపున న్యాయ పరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే.
Rape Case Against Youtuber Mallik Tej: మరో యూట్యూబర్ పై రేప్ కేసు.. జగిత్యాల యూ ట్యూబ్ ఫేం మల్లిక్ తేజపై యువతి కేసు.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు (వీడియోతో)
Rudraజగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. కొన్నేళ్ళ క్రితం తమ ఇద్దరి మధ్య పరిచయం మొదలై అదికాస్తా చనువుగా మారిందని యువతి పేర్కొంది.
Pink Power Run: పింక్ పవర్ రన్ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం (వీడియో)
Rudraప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి.
Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.