జాతీయం

Tirupati Laddu Controversy: దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవాలా జగన్ ఫైర్, ప్రపంచ చరిత్రలో ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు

Arun Charagonda

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు మాజీ సీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ఒకరేనని ఇంకెవ్వరూ ఉండరు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి..ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారా అని మండిపడ్డారు.

Jr NTR Devara: థియేటర్లలో దేవర హంగామా, పాలాభిషేకం- రక్తాభిషేకం చేసిన అభిమానులు..వీడియో ఇదిగో

Arun Charagonda

దేవర సినిమా హంగామా మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా విడుదల కానుండగా అనంతపురంలో తారక్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు అభిమానులు.

T. Subbarami Reddy: చాలా రోజుల తరువాత మీడియా ముందుకు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బరామిరెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Jani Master Case: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!

Arun Charagonda

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు జానీ మాస్టర్. గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను నిన్న హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Jani Master on Rape Allegations: వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..

Hazarath Reddy

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చంచలగూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ పోలీసుల విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hyderabad Horror: మేడ్చల్‌లో దారుణం, వృద్ధురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం, నొప్పి అంటూ ఏడుస్తున్నా కనికరించని కామాంధులు

Hazarath Reddy

మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

PM Vishwakarma Programme: వీడియో ఇదిగో, యూపీఐ యాప్ ఉపయోగించి జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

వార్ధాలో జరిగిన జాతీయ "PM విశ్వకర్మ" కార్యక్రమ ప్రదర్శనలో PM నరేంద్ర మోడీ జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసినట్లు చూపిస్తుంది. వైరల్ క్లిప్ కూడా భారత ప్రధాని UPI యాప్‌ని ఉపయోగించి జగన్నాథుని విగ్రహానికి డబ్బును డిజిటల్‌గా చెల్లిస్తున్నట్లు చూపిస్తుంది.

'Attack on Sanatana Dharma': ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, తిరుపతి లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.తాజాగా ఈ లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ (Chief Priest of Ram Janmabhoomi) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.

Advertisement

NEET Counselling: నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట, స్థానికత వ్యవహారంలో రిలీఫ్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం

Arun Charagonda

నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

Supreme Court On Note For Vote Case: సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి రిలీఫ్, ఓటుకు నోటు కేసును బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ

Arun Charagonda

ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Star Health's Data Leak: స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్, టెలిగ్రామ్‌ ద్వారా అమ్మకానికి పెట్టిన హ్యాకర్, స్పందించిన ఇన్స్యూరెన్స్‌ కంపెనీ

Hazarath Reddy

భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్’ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్‌ (data leaked) కావడం ఆందోళన కలిగిస్తోంది.ఇందులో కస్టమర్ల మెడికల్‌ రిపోర్టులు, సున్నితమైన సమాచారం కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Vedma Bojju On Union Minister Ravneet Bittu: కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద కామెంట్స్, కేంద్రమంత్రి నవ్‌నీత్ తల తెగ్గోసి ఇస్తే 1.38 ఎకరాల భూమి ఇస్తానని కామెంట్‌, మండిపడుతున్న బీజేపీ శ్రేణులు

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెగ్గోసి తెచ్చిన వారికి 1.38 ఎకరాల భూమి ఇస్తానని ప్రకటించారు. రాహుల్‌గాంధీ.. నంబర్ వన్ ఉగ్రవాది అని బిట్టు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రవ్‌నీత్‌సింగ్ బిట్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Vijaysai Reddy on Chandrababu: ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి, నారాయణ అంటూ చంద్రబాబుపై సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!. ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Fire Accident At Running Car : రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు, అద్దాలు పగలగొట్టి డ్రైవర్‌ని బయటకు తీసిన స్థానికులు..వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ - మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు రన్నింగ్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించగా దట్టమైన పొగకు డ్రైవర్ స్పృహ కోల్పోయాడు.

VHP on Tirupati Laddu Dispute: చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్, వ్యాఖ్యలకు కట్టుబడి ఆ ఆరోపణలను నిరూపణ చేయాలని డిమాండ్

Hazarath Reddy

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది మరియు గత హయాంలో జంతు కొవ్వును దాని తయారీలో ఉపయోగించినట్లు వచ్చిన నివేదికలపై హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.

iPhone 16 Sale: ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం, ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ...వీడియో ఇదిగో

Arun Charagonda

ఐఫోన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. స్టేటస్ సింబల్‌గా ఐ ఫోన్‌ని వాడే వారున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఇవాళ్టి నుండి ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభం కాగా ఈ ఫోన్ కోసం జనం ఎగబడ్డారు. ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ కట్టారు. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Advertisement

Cyclone To Hit Andhra Pradesh? ఏపీని తాకనున్న మరో తుఫాను, ఈ నెలాఖరులో రాష్ట్రానికి సైక్లోన్ ముప్పు ఉందని హెచ్చరిక

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నెల ప్రారంభంలొ వరదలు ముంచెత్తిన సంగతి విదితమే.దాని నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అయితే ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబు­తున్నారు.

Tirupati Laddu Controversy: దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు, చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

Hazarath Reddy

లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు.

KTR Slams CM Revanth Reddy: కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?..కేటీఆర్ ఫైర్, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

Tirupati Laddu Controversy: సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ, వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ పిటిషన్

Hazarath Reddy

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉందనే టీడీపీ బయటపెట్టిన రిపోర్ట్ కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ.. హైకోర్టును ఆశ్రయించింది.

Advertisement
Advertisement