జాతీయం

Ind Vs Ban: ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్...బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన ఆకాశ్...వీడియో ఇదిగో

Arun Charagonda

చెన్నై వేదికగా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ ఆకాశ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భోజ‌న విరామ స‌మ‌యానికి మూడు వికెట్ల న‌ష్టానికి 26 ర‌న్స్ చేసింది. బౌల‌ర్ ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

Kethireddy Venkatarami Reddy: చివరి వరకు వైఎస్ ఫ్యామిలీతోనే..జగన్ వెంటే నడుస్తా, వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

Arun Charagonda

వైసీపీ నుంచి వైదొలుగుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని ...35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం.

Israel Strikes Hezbollah Targets: వీడియో ఇదిగో, హిజ్బొల్లా స్థావరాలపై మిలిటరీ రాకెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, పెద్ద ఎత్తున తగలబడుతున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

లెబనాన్ లోని హిజ్బొల్లా లక్ష్యంగా గురువారం ఇజ్రాయెల్ మిలటరీ రాకెట్లతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బొల్లాకు చెందిన పలు స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 150 లాంచర్ బ్యారెల్స్, మిలటరీ మౌలిక సదుపాయాలు, భవనాలు, ఆయుధ గోడౌన్లను నాశనం చేసింది.

Ramana Deekshitulu On TTD Laddu: నెయ్యి కల్తీ బాధాకరమన్న రమణ దీక్షితులు, నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలని డిమాండ్, ఆగమ శాస్త్రం ప్రకారం పరిహారం చేయాలని సూచన

Arun Charagonda

కళియుగ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారన్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీవారి దర్శనమే కాదు లడ్డూ కూడా ఫేమస్. శ్రీవారి లడ్డూ కోసం ఎగబడతారు కూడా. అయితే అలాంటి శ్రీవారి లడ్డూ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

Andhra Pradesh: మద్యం మత్తులో మందుబాబుల హల్‌చల్, హోటల్‌లో ఓ వ్యక్తిపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకులు

Arun Charagonda

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మినర్వా హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. మందుబాబులను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గంటపాటు శ్రమించి ఎట్టకేలకు వారిని పీఎస్ కు తరలించారు.

Jony Master Row: జానీ మాస్టర్‌ ఎలాంటి తప్పు చేయడు, ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న రాము మాస్టర్, న్యాయమే గెలుస్తుందని కామెంట్

Arun Charagonda

జానీ మాస్టర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు డ్యాన్స్ మాస్టర్ రాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన.. జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ ను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అసలు నిజం బయటికి వచ్చిన తర్వాత న్యాయం పక్షాన పోరాడతామన్నారు కొరియోగ్రాఫర్ రాము.

Pawan Kalyan on Tirupati Laddu Row: బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. తిరుమ‌ల ల‌డ్దూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు డిమాండ్‌

Rudra

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌పారన్న వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Reels in Uppal PS: ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో యువకుల రీల్స్.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

Rudra

సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొందరు ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. రీల్స్ కోసం లా అండ్ ఆర్డర్ ని రక్షించే పోలీస్ స్టేషన్ లను కూడా వదలట్లేదు.

Advertisement

Anna Canteens: అన్న క్యాంటీన్ ఓపెనింగ్..కొట్టుకున్న టీడీపీ నేతలు, రాజంపేటలో ఉద్రిక్తత, రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న తెలుగు దేశం నేతలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇంఛార్జి తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకొని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు.

iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ఎగబడిన జనం.. 21 గంటలపాటు లైన్ లో పడిగాపులు (వీడియోలు)

Rudra

దేశ వ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్ర‌వారం తెల్ల‌వారుజాము ప్రారంభ‌మైంది. ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముంబై, ఢిల్లీతో స‌హా ప‌లు యాపిల్ స్టోర్‌ల బ‌య‌ట క్యూ క‌ట్టారు.

Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

Rudra

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Air Pollution-Brain Stroke Link: గాలి కాలుష్యంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.. ఉష్ణోగ్రతలు పెరుగడం కూడా కారణమే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

‘బ్రెయిన్‌ స్ట్రోక్‌’ మరణాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. జీవన శైలి వ్యాధులు దీనికి ప్రధాన కారణంగా ఇప్పటివరకూ అనుకొన్నాం. అయితే, గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్‌ న్యూరాలజీ జర్నల్‌’ తాజా కథనం పేర్కొన్నది.

Advertisement

Packaging Chemicals in Human Bodies: మనుషుల శరీరంలో 3,600కు పైగా ఫుడ్‌ ప్యాకేజింగ్‌ రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ప్లాస్టిక్ రక్కసి మానవ శరీరాన్ని చిద్రం చేస్తున్నది. ఆహార ప్యాకేజింగ్ లో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Bengal Doctors End Cease-Work: 41 రోజుల త‌ర్వాత ఆందోళనను విరమించిన కోల్‌ క‌తా వైద్య విద్యార్థులు.. శ‌నివారం నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటామ‌ని ప్ర‌క‌ట‌న‌

Rudra

కోల్‌ క‌తా ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌లో బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన ఆర్‌ జీ క‌ర్ వైద్య విద్యార్థులు 41 రోజుల త‌ర్వాత ఆందోళ‌న విర‌మించారు.

One Nation One Election: ఏమిటీ ఈ జమిలి ఎన్నికలు, దేశంలో ఇంతకుముందు జరిగాయా ? ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం ఇదిగో..

Hazarath Reddy

ఈ ఎన్నికలు జరుగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2), ఆర్టికల్‌ 172(1), ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమవుతాయి.

Google New Policy: జీమెయిల్‌ అకౌంట్ ఉందా! వెంట‌నే ఈ ప‌నిచేయ‌క‌పోతే మెయిల్ పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోతుంది, సెప్టెంబ‌ర్ 20 లాస్ట్ డేట్

VNS

జీమెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జనం జీమెయిల్‌ని (Gmail) వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీమెయిల్‌ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థుల నుంచి బడా వ్యాపారవేత్తలకు తప్పనిసరిగా జీమెయిల్‌ అకౌంట్‌ ఉన్నది.

Advertisement

Atishi’s Delhi Cabinet: ఐదుగురు మంత్రుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న అతిషి, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్, గోపాల్ రాయ్ స‌హా సీనియ‌ర్లు, కొత్త‌గా ముఖేష్‌ అహ్లావత్ కు స్థానం

VNS

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి (Delhi CM) ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం ( Atishi Swearing In Ceremony) చేయనున్నారు. ఇందులో గోపాల్‌ రాయ్‌, కైలాష్‌ గెహ్లాట్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు

Train Accident Averted: మొన్న సిమెంట్ దిమ్మెలు! ఇవాళ ఐర‌న్ పోల్! ట్రైన్ ప‌ట్టాలు త‌ప్పించేందుకు దుండ‌గుల దుశ్చ‌ర్య‌, ట్రాక్ పై 6 మీట‌ర్ల పొడ‌వైన ఇనుప స్తంభం పెట్టిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు

VNS

రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. (long iron pole on railway tracks) గమనించిన లోకో పైలట్‌ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐరన్‌ పోల్‌ను తొలగించాడు

Kolkata Doctor Case: కోల్ క‌తా డాక్ట‌ర్ హత్యాచారం కేసులో కీల‌క ప‌రిణామం, ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రి మాజీ ప్రిన్సిపాల్ మెడిక‌ల్ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు

VNS

పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసింది

Gold Prices: మ‌రోసారి పెరిగిన గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు, జీవిత‌కాల గ‌రిష్టానికి చేరిన వెండి ధ‌ర‌, అమెరికా ఫెడ్ వ‌డ్డీరేట్ల ప్ర‌భావంతో మ‌రింత పెరిగే అవ‌కాశం

VNS

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు (US Fed) తగ్గించడం, పెండ్లిండ్లతోపాటు ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరలు (Gold Price) తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 వృద్ధితో రూ.75,650లకు చేరుకున్నది.

Advertisement
Advertisement