జాతీయం
Aadhar Card Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా, సెప్టెంబర్ 14 దాటితే రూ. 50 చెల్లించాల్సిందే, ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ కోసం మీరు ఇలా చేయండి
Vikas Mసెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాలి. గతంలో దీని గడువు చాలాసార్లు పొడిగించబడింది. దీంతో ఈసారి సెప్టెంబర్ 14 తర్వాత గడువు పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉంది
Ford Returns to Chennai: చెన్నై కేంద్రంగా భారత్‌లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్, వచ్చే మూడేండ్లలో 3 వేల మందికి ఉద్యోగాలు
Vikas Mఫోర్డ్ నాయకత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఇటీవల జరిగిన సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి TRB రాజా, ముఖ్యమంత్రి MK స్టాలిన్ నేతృత్వంలోని ఒక సంవత్సరం ప్రయత్నాల తర్వాత ఫోర్డ్ తమిళనాడుకు తిరిగి రావడం గురించి Xలో పోస్ట్ చేసారు.
Realme P2 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ పీ2 ప్రో 5జీ విడుదల, ధర ఎంతంటే..
Vikas Mచైనా దిగ్గజం రియల్‌మీ (Realme) తన రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మీ పాడ్ 2 లైట్ (Realme Pad 2 Lite) కూడా తీసుకొచ్చింది.
Satyam Sundaram Teaser Out: సత్యం సుందరం టీజర్ విడుదల, స్నేహితులుగా నటిస్తున్న కార్తీ,అరవింద స్వామి
Vikas Mఈ మూవీ నుంచి తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా తెలుగు టీజర్‌ను వదిలారు.ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024, తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైన భారత్ డి, మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్
Vikas Mఇండియా ఎ వర్సెస్ ఇండియా డి దులీప్ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో 2వ రోజు జరిగిన మ్యాచ్‌లో, ఇండియా ఎ బౌలర్లు ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్ మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇండియా డిని 52/4 స్కోరుకు పరిమితం చేశారు.
Shreyas Iyer Duck Video: శ్రేయస్ అయ్యర్ డకౌట్ వీడియో ఇదిగో, సన్‌గ్లాసెస్ పెట్టుకుని మరీ గోల్డన్ డక్, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Vikas Mదులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జట్టు తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ తాజాగా డకౌట్ అయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 7 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన అయ్యర్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయడం గమనార్హం.
Kadambari Jethwani: వీడియో ఇదిగో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీ, అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్ జెత్వానీ వేధింపుల కేసులో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై సినీ నటి జత్వనీ ఫిర్యాదు చేసింది.తనను అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.
Video: వీడియో ఇదిగో, కువైట్‌లో అమ్మేస్తామని బెదిరిస్తున్నారు, నన్ను కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న ఆంధ్రప్రదేశ్ యువతి
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కవితా అనే మహిళ బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లానని, కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
Arvind Kejriwal Released From Tihar Jail: వీడియో ఇదిగో, తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, వర్షంలో తడుస్తూ కార్యకర్తలకు అభివాదం
Hazarath Reddyఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.
Andhra Pradesh Rains: రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, వచ్చే రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు
Hazarath Reddyఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
YS Jagan: వీడియో ఇదిగో, పాపా నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ సెటైర్ వేసిన జగన్, పిఠాపురం పర్యటనలో ఆసక్తికర వీడియో వైరల్
Hazarath Reddyచంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.
Port Blair As Sri Vijaya Puram: పోర్టు బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం, శ్రీ విజయ పురంగా మారుస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Arun Charagondaఅండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
Astrologer Venuswamy: వేణుస్వామికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు, వేణుస్వామిపై కేసు నమోదుచేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు
Arun Charagondaవేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొనగా పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది కోర్టు
YS Jagan Slams CM Chandrababu: ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమంటారు, చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ జగన్, ఇకనైనా జగన్నామం ఆపు అంటూ ఎద్దేవా
Hazarath Reddyపిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.
Telangana: నీళ్ల సంపులో యువకుడి మృతదేహం...నవీన్ శరీరంపై గాయాలు..హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు!
Arun Charagondaమేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న నీళ్ల సంపులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు శాంతి నగర్ కు చెందిన నవీన్ ( 21 ) గా గుర్తించగా నవీన్ శరీరంపై గాయాలు ఉండటంతో హత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Andhra Pradesh Shocker: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ - బస్సు ఢీ..8 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Arun Charagondaచిత్తూరు జిల్లాలో చిత్తూరు - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద కంటైనర్ లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Donations To Telangana CMRF: రెడ్డీస్ ల్యాబ్ రూ.5 కోట్లు, బాలయ్య కూతురు రూ.50 లక్షలు..ఇంకా ఎవరెవరూ ఎంత ఇచ్చారంటే!
Arun Charagondaతెలంగాణ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని అందివ్వగా తాజాగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ.
Andhra Pradesh: సీబీఎస్‌ఈ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
TCS Employees Get Tax Notices: 40 వేల మంది టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ షాక్, రూ.1 లక్ష వరకు పన్నుచెల్లించాలంటూ నోటీసులు, కంపెనీ స్పందన ఏంటంటే..
Hazarath Reddyటీసీఎస్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాకిచ్చింది. 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులను పంపించింది ఐటీ డిపార్ట్ మెంట్. టీడీఎస్ విషయంలో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు పంపింది.
Eid Milad Un Nabi 2024: మిలాద్ ఉన్ నబీ ఎందుకు జరుపుకుంటారు? ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఏమిటీ, అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నారా..
Hazarath Reddyమౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.