India

Health Tips: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే.

sajaya

కొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Andhra Pradesh: వైసీపీ నేతపై హత్యాయత్నం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, కర్రలతో దాడి, కారు ధ్వంసం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. కర్రలతో ప్రత్యర్ధులు దాడి చేశారు.కారును ధ్వంసం చేశారు.వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.

sajaya

పెసలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థం. ఇందులో ప్రోటీన్ తో పాటు అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మొలకెత్తి ఈ పెసలను గింజలు తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. పెసలలో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.

Nizamabad: గొడ్డుకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రిన్సిపాల్‌పై మండిపాటు ,ఎంఈవోకు ఫిర్యాదు

Arun Charagonda

గొడ్డు కారంతో మధ్యాహ్న భోజనం వండించిన సంఘటన నిజామాబాద్ కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో చోటు చేసుకుంది. కారంలేని పప్పు వడ్డించారని పిల్లలు తినడానికి ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు కారం,నూనె పోసి ఇవ్వగా దాంతోనే తిన్నారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై మండిపడి, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Vishakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం, ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు, పూర్తిగా దగ్దమయిన బోగిలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగి.. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో.. బీ 6, బీ7, ఎం1లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

AP Volunteer System: వలంటీర్‌ వ్యవస్థలో మార్పులు, శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు, కొంతమందితోనే వలంటీర్ సిస్టమ్, చంద్రబాబు కీలక నిర్ణయం?

Arun Charagonda

ఏపీలో వలంటీర్ వ్యవస్థపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వలంటీర్ల సేవలను వాడుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం వలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు.

Uttar pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు - కారు ఢీ, 7 మంది మృతి..వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్ ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు మరియు కారు ఢీకొన్న ప్రమాదంలో 7 మంది మృతి చెందారు.

Bihar: బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆల్‌ఖైదా పేరుతో బెదిరింపులు, అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

Arun Charagonda

బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాట్నాలోని సీఎం కార్యాలయానికి బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Telangana Shocker: చాక్లెట్ ఇప్పిస్తానని 6 ఏళ్ల పాప కిడ్నాప్, హైదరాబాద్ ఆబిడ్స్‌లో కలకలం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆగంతకుడి కోసం పోలీసుల గాలింపు

Arun Charagonda

హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెలమండికి చెందిన 6 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేశారు. చాక్‌లేట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు ఆగంతకుడు.

CM Revanth Reddy America Tour: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఘన స్వాగతం, పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. శనివారం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్ ఉండనుంది.

Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు విషెస్ తెలపాలని అనుకుంటున్నారా..అయితే Photo Greetings ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపండిలా..

sajaya

స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు కొన్ని ఫోటో గ్రీటింగ్స్ పంపవచ్చు. ఫ్రెండ్‌షిప్ డే ప్రత్యేక సందర్భంగా మీరు మీ స్నేహితులకు ఎలాంటి విషెస్ పంపవచ్చో తెలుసుకుందాం.

BSNL 4G Network Ready: బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వ‌ర్క్ సిద్ధం, త్వ‌ర‌లోనే ల‌క్ష 4జీ ట‌వర్లు నిర్మిస్తామ‌న్న కేంద్ర‌మంత్రి, అక్టోబ‌ర్ వ‌ర‌కు 80వేల ట‌వ‌ర్ల నిర్మాణం పూర్తి

VNS

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్‌స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ (BSNL 4G) సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు.

Advertisement

SBI Reward Scam: ఎస్ బీఐ కస్ట‌మ‌ర్ల‌కు బీ అల‌ర్ట్! రివార్డు పాయింట్లు రిడీమ్ చేసుకునేందుకు బంపర్ ఆఫ‌ర్ అంటూ మెసేజ్ లు..ఆ లింక్ క్లిక్ చేస్తే ఖ‌త‌మే!

VNS

పీఐబీ (PIB) ఫ్యాక్ట్‌ చెక్‌ అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్‌ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్‌ పాయింట్ల రిడీమ్‌ చేసుకునేందుకు లింక్‌ని (SBI Fake Link) ఓపెన్‌ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌ను ఓపెన్‌ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్‌ చేయొద్దని సూచించింది.

Nissan X Trail: ట‌యోటా ఫార్చున‌ర్ కు గ‌ట్టి పోటీ ఇచ్చే వెహికిల్ ను మార్కెట్లోకి దించిన నిస్సాన్, ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవిగో..

VNS

గ్లోబల్ మార్కెట్లలో నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) కారు 150కి పైగా దేశాల్లో లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షల యూనిట్ల కార్లు విక్రయించిన నిసాన్ ఎక్స్-ట్రయల్.. 2023 గ్లోబల్ ఎస్‌యూవీ టాప్-5 కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే వారియబుల్ కంప్రెషన్ ఇంజిన్‌తో వస్తున్న తొలి కారు నిసాన్ ఎక్స్-ట్రయల్. 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది.

Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే విషెస్ Photo Greetings రూపంలో మీ స్నేహితులకు తెలియజేయండిలా..

sajaya

ఫ్రెండ్‌షిప్ డేని ఆగస్టు మొదటి ఆదివారం అంటే ఆగస్టు 4న జరుపుకుంటున్నారు. ఈ రోజు స్నేహ సంబంధాన్ని జరుపుకునే పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక స్నేహితుడు ఉండటం ముఖ్యం.

Sravana Masam Celebrations: శ్రావ‌ణ‌మాసంలో శ్రీ‌శైలానికి వెళ్తున్నారా? ఈ రోజుల్లో స్ప‌ర్శ‌ ద‌ర్శ‌నాలు బంద్, ప‌లు సేవ‌ల‌కు ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి

VNS

ఈ నెల 5 నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు (Sravana Masam) జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో (Srisailam Devasthanam) ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Advertisement

Boy Climbed Up The Engine Of The Train: రైల్ ఇంజిన్ పై భాగంలోకి ఎక్కిన బాలుడు, ప్ర‌యాణికుల‌తో పాటూ పోలీసుల‌కు ముచ్చెముట‌లు పెట్టించిన వ్య‌క్తి, బాప‌ట్ల‌లో ఘ‌ట‌న‌

VNS

గూడురు (Gudur)నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు(express train ) శనివారం బాపట్ల రైల్వే స్టేషన్‌ (Bapatla Railway Station ) కు చేరుకుంది. అప్పటికే ప్లాట్‌ఫాం వద్ద ఉన్న మతిస్థిమితం లేని బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజిన్‌పైకి ఎక్కాడు. విద్యుత్‌ లైన్లు తగిలి ప్రమాదం జరుగవచ్చన భయంతో రైలు సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

Yamini Krishnamurthy: భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి ఇకలేరు, అనారోగ్యంతో ఢిల్లీలో మృతి,తిరుమల ఆస్థాన నర్తకీగా సేవలు

Arun Charagonda

ప్రముఖ నర్తకి ,పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Sharad Pawar Meets CM Eknath Shinde: మహారాష్ట్రలో కీలక పరిణామం, సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ, ఎన్నికల వేళ భేటీకి ప్రాధాన్యత

Arun Charagonda

మహారాష్ట్ర ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఏక్‌నాథ్‌ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని మలబార్ హిల్ సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.

Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ గణనాథుడికి 70 ఏళ్ళు, ఈ ఏడాది ప్రత్యేకతలివే, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు

Arun Charagonda

భారతీయ పండగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఏ పండగైన, ఏ పూజ చేసిన తొలుత నమస్కరించేంది వినాయకుడికే. అందుకే విఘ్నాలు తొలగించే లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా మూషిక వాహనుడి కృపను పొందేందుకు 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక ఈ ఏడాది కూడా గణనాథుడికి పూజలు చేసేందుకు విగ్రహాలు రెడీ అవుతున్నాయి.

Advertisement
Advertisement