TRF Banned: టీఆర్ఎఫ్ పై కేంద్రం నిషేధం.. ఉగ్రవాద సంస్థగా ప్రకటన

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది.

TRF Banned: టీఆర్ఎఫ్ పై కేంద్రం నిషేధం.. ఉగ్రవాద సంస్థగా ప్రకటన
Representational (Google Credits)

Newdelhi, Jan 6: పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు (LeT) అనుబంధంగా పని చేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్-TRF)’ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం (Indian Government) దానిపై నిషేధం విధించింది. జమ్మూ కాశ్మీర్‌కు (Jammu Kashmir) చెందిన, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న లష్కరేటర్ కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

బట్టల దుకాణానికి షాపింగ్ కి వెళ్లిన ఆవు.. వీడియో వైరల్‌

టీఆర్ ఎఫ్ తీవ్రవాద సంస్థ 2019లో ఏర్పడింది. హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సంస్థ ఆన్‌లైన్‌లో యువకులను రిక్రూట్ చేస్తూ, వారిని ఉగ్రవాద కార్యకలాపాల్లోకి తీసుకువెళుతోంది. టీఆర్ ఎఫ్  సరిహద్దు చొరబాట్లు, ఆయుధాలు,మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటుంది. ఈ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని హోంశాఖ తెలిపింది.

ఇవేం దంతాలు రా బాబూ.. 15,730 కిలోల ట్రక్కును లాగేసి రికార్డ్.. వీడియో

హోం శాఖ ప్రకారం భద్రతా దళాలు, పౌరులను చంపడానికి ప్లాన్ చేసినందుకు టీఆర్ ఎఫ్ సభ్యులు, వారి సహచరులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. భద్రతా బలగాలు, పౌరులపై దాడులకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయి. టీఆర్ ఎఫ్ మన దేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు అని హోంశాఖ తన నివేదికలో పేర్కొంది.

వివాహమైన గంటకే భార్యకు విడాకులు.. ఆపై తమ్ముడికిచ్చి వివాహం.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘటన

(The above story first appeared on LatestLY on Jan 06, 2023 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).