Information

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో వరదలు, ముగ్గురు మృతి..పదకొండు మంది గల్లంతు, అసోంలో 79కు చేరిన మృతుల సంఖ్య, అస్సాం సీఎంకు ప్రధాని మోదీ ఫోన్

Hazarath Reddy

ఉత్తర, ఈశాన్యభారతదేశంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు (Uttarakhand Cloudburst) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథోరాగ్‌ జిల్లాలోని ( Cloudburst in Pithoragarh) మడ్‌కట్‌ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు.

International Flights: నేటి నుండి అమెరికా, ఫ్రాన్స్‌కు విమాన సర్వీసులు, తొలి దశలో మొత్తం 46 విమాన సర్వీసులు, వెల్లడించిన పౌర విమానయాన శాఖ

Hazarath Reddy

కోవిడ్-19 కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు (India resumes some international travel) నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి నేటి నుంచి పాక్షికంగా విమానాలు (International Flights) నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఢిల్లీ-న్యూయార్క్‌ (Delhi- New york) మధ్య ప్రతి రోజూ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep singh puri) తెలిపారు.

India-China LAC Standoff: భారత్‌-చైనా సరిహద్దు వివాదం, లడఖ్‌లో రాజ్‌నాథ్ సింగ్, ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితులను సమీక్షిచేందుకు పర్యటన, రక్షణ మంత్రి వెంట బిపిన్ రావ‌త్, ముకుంద్‌ నరవణే

Hazarath Reddy

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Defence minister Rajnath Singh) శుక్రవారం ఉదయం‌ లడఖ్‌ చేరుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన (India-China LAC Standoff) కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. ల‌డ‌ఖ్‌లో (Ladakh) స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనాతో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన నేప‌థ్యంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లోని స్త‌క్నా ఫార్వ‌ర్డ్ ఏరియాను సంద‌ర్శించారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావ‌త్ (CDS Bipin Rawat), ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే (Army Chief Mukund Naravane) కూడా ఉన్నారు.‌

Coronavirus in india: సెప్టెంబర్ 1నాటికి 35 లక్షలకు కరోనా కేసులు, అంచనా వేసిన ఐఐఎస్సీ, దేశంలో 10 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు..25 వేల మరణాలు, ఒక్క రోజులో 34,956 మందికి కొత్తగా కోవిడ్ 19 పాజిటివ్

Hazarath Reddy

భారతదేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in india) మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. మొత్తం కరోనావైరస్ కేసులు (Coronavirus Cases in India) 10,03,832 కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ( Coronavirus Deaths in india) 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే రికవరీ రికార్డు స్థాయిలో పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవెల్లడించింది. 24 గంటల్లో 22,942 బాధితులు కోలుకున్నట్టు ప్రకటించింది. కాగా దేశంలో తొలి కోవిడ్‌-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనేబాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది.

Advertisement

International Flights: జూలై 17 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి

Hazarath Reddy

అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినున్నట్లు (International Flights to Begin in India) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి మధ్య అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముందుగా జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఫ్రాన్స్ నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పారిస్ మధ్య 28 విమానాలను నడుపుతామని తెలిపారు.

Coronavirus lockdown: దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తప్పదా? మరోసారి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్న పలు రాష్ట్రాలు, కొవిడ్‌-19 కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానానికి భారత్

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు (Coronavirus Cases in India) పెరిగిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కల్లోలాన్ని రేపుతోంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ల జాబితాలో ప్రపంచంలోనే భారత్‌ ( India Coronavirus) మూడోస్థానానికి చేరింది. దేశంలో 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) విధిస్తే కాని పరిస్థితులు అదుపులోకి వచ్చేలా కనబడటం లేదు.

RIL AGM 2020: తక్కువ ధరకే జియో నుంచి 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఏజీఎంలో వెల్లడించిన ముఖేష్ అంబానీ, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం

Hazarath Reddy

నేడు జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (AGM)లో ముఖేష్ అంబానీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ( mukesh ambani) తెలిపారు.

Mumbai Rain Forecast: ముంబైకి భారీ వర్షం ముప్పు, హెచ్చ‌రించిన భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం, కొంక‌ణ్ తీరాన్ని కమ్ముకున్న మేఘాలు

Hazarath Reddy

కోవిడ్-19 తో విలవిలలాడుతున్న మ‌హారాష్ర్ట‌కు భారీ వర్షం రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. మహారాష్ట్రలోని ప‌లు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురువ‌నున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం(IMD) హెచ్చ‌రించింది. కొంక‌ణ్ తీరంతో పాటు ముంబై, థానేలో భారీ వ‌ర్షాలు (High Tide Alert Mumbai) కురుస్తాయ‌ని పేర్కొంది. కొంక‌ణ్ తీరాన్ని తీవ్ర‌మైన మేఘాలు క‌మ్ముకున్న‌ట్లు తెలిపింది. ముంబై, థానేలో 200 మీల్లీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు కానున్న‌ట్లు పేర్కొంది.

Advertisement

CBSE Class 10th Results 2020: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

Hazarath Reddy

నిన్న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ (Central Board of Secondary Education) రేపు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ప్రియతమ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులారా... రేపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10th Results 2020) ప్రకటిస్తున్నారు. విద్యార్థులందరికీ బెస్టాఫ్ లక్" అంటూ రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.

Padmanabhaswamy Temple: ఆరవ నేలమాలళిగను వారు తెరుస్తారా, అనంతపద్మనాభ స్వామి ఆలయ పాలనపై హక్కులు రాజకుటుంబానికి చెందుతాయని సుప్రీం తీర్పు

Hazarath Reddy

తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి (Sree Padmanabhaswamy Temple) ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. స్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టమైన తీర్పు చెప్పింది.

CBSE 12th Result 2020 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, పదో తరగతి ఫలితాలు కూడా త్వరలో విడుదల, ఫలితాలను http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

సీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి పరీక్ష ఫలితాలు (CBSE 12th Result 2020 Declared) విడుదలయ్యాయి. ఈ మేరకు జులై 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD) శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ రోజు ఫలితాలు (CBSE 12th Result 2020) విడుదలయ్యాయి.

Heavy Rains in AP: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న షియర్‌ జోన్‌ ప్రభావం, అలర్ట్ జారీ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

World's 1st Coronavirus Vaccine: కరోనావైరస్‌ని చంపే తొలి వ్యాక్సిన్ రెడీ, రష్యాలో అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌, త్వరలో మార్కెట్లోకి..

Hazarath Reddy

కోవిడ్-19 గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై (COVID-19 Vaccine) జరుగుతున్న ప్రయోగాలు జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం ప్రపంచానికి ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. రష్యాలోని సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగం (World's 1st Coronavirus Vaccine) కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తారాసోవ్‌ వెల్లడించారు.

Rewa Solar Plant: రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, భారత్‌లో ఊపందుకున్న సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు

Hazarath Reddy

జల, థర్మల్ విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ప్రపంచం దృష్టి సౌరశక్తిపై పడింది. భారత్‌లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని మోదీ తెలిపారు.

Cabinet Extends EPF Support: ఈపీఎఫ్‌ మీద కేంద్రం శుభవార్త, కేంద్రమే 3 నెలల పాటు పీఎఫ్‌ చెల్లిస్తుంది, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన మరో 5 నెలలు పొడిగింపు

Hazarath Reddy

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)పై (Cabinet Extends EPF Support) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ (Cabinet)బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా 72లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (Pradhan Mantri Garib Kalyan Yojana), ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఈ జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపీఎఫ్‌ (EPF) కంట్రిబ్యూషన్‌ 24శాతం (12 శాతం ఉద్యోగుల వాటా, 12 శాతం యజమానుల వాటా) పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

Vikas Dubey Arrested: ఎట్టకేలకు యూపీ క్రిమినెల్ గార్డుకు చిక్కాడు, గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను ఉజ్జెయినిలో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పటికే న‌లుగురు క్రిమిన‌ల్స్‌ ఎన్‌కౌంట‌ర్

Hazarath Reddy

యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ వికాశ్ దూబే ఎట్టకేలకు అరెస్టు (Vikas Dubey Arrested) అయ్యాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు (Uttar Pradesh) చెందిన గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే (Vikas Dubey) త‌ల‌పై 5 ల‌క్ష‌ల రివార్డు ఉన్న‌ విషయం విదితమే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జెయినిలో (MP Ujjain) వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జెయినిలో మ‌హాకాళేశ్వ‌రుడికి పూజ‌లు నిర్వ‌హించేందుకు వికాస్ అక్క‌డ‌కు వెళ్లగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.కాగా మ‌హాకాళేశ్వ‌రుడి ఆల‌యంలో ప‌నిచేస్తున్న ఓ గార్డు అత‌న్ని నిర్బంధించి ఉజ్జెయిన్ ఎస్పీ మ‌నోజ్ సింగ్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Advertisement

Kanpur Encounter: వికాస్ దూబే ప్రధాన అనుచరుడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు, మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్న వికాస్‌ దూబే, 200 మంది పోలీసులపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే (Vikas Dubey) ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ రోజు ఉదయం అమర్‌ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. కాన్పూర్‌ ఘటనలో (Kanpur Encounter Case) ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అతనికోసం హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులతో కలిసి యూపీ ప్రత్యేక పోలీసులు గాలింపు చేపట్టాయని తెలిపారు. అమర్‌ దూబేపై రూ.50 వేల రివార్డు ఉన్నదని తెలిపారు.

Corona Fear at Bajaj Plant: బజాజ్‌ను వెంటాడుతున్న కరోనావైరస్, ముంబై వాలూజ్ ప్లాంట్‌లో 400కు పెరిగిన కోవిడ్-19 కేసులు, ప్లాంట్‌‌ను తాత్కాలికంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్న యూనియన్

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. ముంబై నగరంలో కరోనా కేసులు రోజు రొజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కరోనా సెగ కంపెనీలను వదిలిపెట్టడం లేదు. ముంబైలో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో (Corona Fear at Bajaj Plant) తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్‌లో (Mumbai Waluj Plant) కోవిడ్‌ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు (Bajaj Auto Workers) ప్లాంట్‌కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్‌ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ అక్కడ ఊపందుకుంది.

CBSE Syllabus Reduction: సీబీఎస్ఈ సిలబస్ 30 శాతం తగ్గింపు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన హెచ్‌ఆర్‌డి మంత్రి, కరోనా సమయంలో కోల్పోయిన సమయాన్ని తిరిగి భర్తీ చేసేలా నిర్ణయం

Hazarath Reddy

సిబిఎస్‌ఇ వచ్చే విద్యా సంవత్సరానికి 10 మరియు 12 తరగతుల సిలబస్‌ను మూడింట ఒక వంతు (CBSE Syllabus Reduction) తగ్గించింది. ప్రధాన అంశాలను నిలుపుకోవడం ద్వారా సిబిఎస్‌ఇ సిలబస్‌ను 30 శాతం వరకు (CBSE Cuts Syllabus by 30%) హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (Ramesh Pokhriyal) అన్నారు. దేశంలో మరియు ప్రపంచంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిశీలిస్తే, సిబిఎస్‌ఇ పాఠ్యాంశాలను సవరించాలని, 9 వ తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులకు కోర్సు భారాన్ని మరింతగా తగ్గించాలని సూచించారు. విద్యార్థుల కోసం సిలబస్‌ను తగ్గించడంపై ఒక నిర్ణయానికి రావడానికి అన్ని విద్యావేత్తల సలహాలను మంత్రి ఆహ్వానించారు. కాగా 1500 కి పైగా సూచనలు వచ్చాయని చెప్పారు.

India’s Coronavirus: ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు

Hazarath Reddy

భార‌త్‌లో కోవిడ్-19 వైర‌స్ పాజిటివ్ కేసుల (India’s Coronavirus) సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,252 కేసులు న‌మోదు అయ్యాయి. 24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా 467 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య (India's Coronavirus Tally) 7,19,665కి చేరుకున్న‌ది. దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,39,948 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.

Advertisement
Advertisement