Information

Cyclone Maha Update: కొనసాగుతున్న మహా తుఫాను, తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం, హైదరాబాద్ వాతావరణంలో రోజురోజుకు అనూహ్య మార్పులు

Hazarath Reddy

మహా తుఫాన్ తీవ్రత తగ్గడం లేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్‌ (cyclonic storm Maha) వాయవ్య దిశగా పయనిస్తోంది.

Jio Discount Offers: జియో మరో బంపరాఫర్, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.50 తగ్గింపు, రూ.444, రూ.555 ప్యాక్‌లపై మాత్రమే, కోడ్ వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఐయూసీ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత రీఛార్జ్ ప్యాక్ రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీఛార్జ్ కు 1.5 జిబి డేటాను అందిస్తున్న జియో దానికి అదనంగా ఐయూసీ ఛార్జీలను తీసుకుంటోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ ల పేరుతో రూ.444, రూ.555 ఆఫర్లను ప్రవేశపెట్టింది.

ISRO Aditya-L1 Coming Soon: చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం, విక్రమ్‌ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ వైఫల్యంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, సాఫ్ట్ లాండింగ్ ని నిజం చేసి చూపుతామన్న ఇస్రో ఛైర్మెన్ కె శివన్

Hazarath Reddy

చంద్రయాన్-2 ప్రయోగంతో సాంకేతికతపరంగా ఇస్రో ముందుకు వెళ్లిందని ఇస్రో చైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కాలంలో అత్యాధునిక శాటిలైట్ లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఐఐటీ ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.

Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం, విమానాలపైన ఎఫెక్ట్, 32 విమానాలు దారి మళ్లింపు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఐజీఐ-జీఎంఆర్ అధికారులు, రోజురొజుకు తీవ్ర రూపం దాలుస్తున్న వాయు కాలుష్యం

Hazarath Reddy

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. ఫలితంగా పలు విమానాలు దారి మళ్లాయి. మొత్తం 32 విమానాలను దారి మళ్లించినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-జీఎంఆర్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Car Accident In krishna : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, మరికొందరికీ గాయాలు, అతివేగమే ప్రమాదానికి కారణం, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న సమయంలో ప్రమాదం

Hazarath Reddy

కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం, గరికపాడు దగ్గర ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు.

Heavy Rain Alert For Hyderabad: బంగాళాఖాతంలో వాయుగుండం, తీవ్ర తుఫానుగా మారనున్న ‘మహా’, హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన, తెంగాణాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 4న ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

PM Modi Speech On Terrorism: ఉగ్రవాద మూలాలను ఏరిపారేశాం, ఆర్టికల్ 370 రద్దు ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తాయి, అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేసుకుంటూ వెళుతున్నాం, బ్యాంకాక్‌లో ప్రధాని మోడీ స్పీచ్ హైలెట్స్

Hazarath Reddy

కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ఆయన తెలిపారు.

MAHA and KYARR Alert: ఒకేసారి రెండు తుఫానులు, క్యార్ గాయం మానక ముందే దూసుకొస్తున్న మహా తుఫాన్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు, అల్లకల్లోలంగా మారిన అరేబియా సముద్రం

Hazarath Reddy

దాదాపు 120 యేళ్ల చరిత్రలో అరేబియా సముద్రంలో మొదటిసారిగా రెండు తుపానులు ఒకే సమయంలో కేంద్రీకృతమై ఉన్నాయి. క్యార్ భీకర రూపం దాల్చిన సమయంలో ‘మహా’ అనే రెండవ తుఫాను కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా పయనిస్తోందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది.

Advertisement

LPG Cylinder Price Hike Again: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.76 పెంపు, ప్రస్తుత ధర రూ.733.50, సబ్సిడీ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు

Hazarath Reddy

మధ్యతరగతి ప్రజలకు నవంబర్ 1వ తేదీ షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరుగుదల నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇదిలా ఉంటే నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తోంది.

DEET App: ఉద్యోగ అణ్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్, డీఈఈటీ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం మరింత సులభం, మోసపూరిత ఉద్యోగ ప్రకటనల బారి నుంచీ రక్షణ

Vikas Manda

ఉద్యోగార్థులు తమ స్మార్ట్ ఫోన్ లో DEET APP ను ఇన్ స్టాల్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాలి. ఏ సెక్టార్ లో ఉద్యోగాన్ని అణ్వేషిస్తున్నారు, గతంలో ఏమైనా ఎక్స్ పీరియన్స్ ఉందా, సాలరీ ఎంతవరకు ఆశిస్తున్నారు అనే ఆప్షన్స్...

Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ

Hazarath Reddy

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

WhatsApp Hacking: వాట్సప్ హ్యాకింగ్‌పై దిమ్మతిరిగే నిజాలు, ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా హ్యాకింగ్, బాధితుల్లో ప్రముఖ ఇండియా జర్నలిస్టులు, ఫిర్యాదు చేసిన వాట్సప్, ఆగ్రహం వ్యకం చేసిన భారత్

Hazarath Reddy

భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్‌’అనే స్పైవేర్‌ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సప్‌ చేసిన ప్రకటన సంచలనం రేపింది.

Advertisement

Jammu Kashmir UT Formation: భారతదేశంలో మరో చారిత్మాత్మక ఘట్టం ఆవిషృతం, కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్, నేటి నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అధికారికంగా గుర్తింపు

Vikas Manda

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తుఫానుకు ముందు కనిపించే నిశబ్దంలా పరిస్థితి కనిపిస్తుంది. కాశ్మీర్ లోని నాయకులు ఇప్పటికే ఇదొక నిర్బంధమైన, నిరంకుశమైన అవతరణ దినోత్సవంగా అభివర్ణిస్తున్నారు....

Moto G8 Plus Launched: మోటో జీ8 ప్లస్ ఇండియాలో విడుదల, అక్టోబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు, ప్రత్యేక ఆకర్షణగా అడ్రినో 610 GPU గ్రాఫిక్స్, ధర రూ. 13,999

Hazarath Reddy

చైనా దిగ్గజం లెనోవో కంపెనీకి చెందిన మోటోరోలా బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో విడుదల అయింది. మోటో జీ8 ప్లస్ (Moto G8 Plus) పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Adventurer CM Pema Khandu: 15వేల 600అడుగుల ఎత్తులో సీఎం రైడ్‌, వైరల్ అవుతున్న అరుణాచల ప్రదేశ్ సీఎం సాహస రైడ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు సాహసం, జవాన్లతో కలిసి దివాళీ వేడుకలు జరుపుకున్న సీఎం పెమా ఖండు

Hazarath Reddy

అపురూపమైన పర్యాటక ప్రదేశాలకు పేరుపొందిన ఈశాన్యరాష్టం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఇదే ఘాట్‌ రోడ్డులో బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సీఎం తాజాగా మరో సాహసం చేశారు. 15,600 అడుగుల ఎత్తులో, మంచు కొండల్లో 107 కిలోమీటర్లు స్వయంగా ఏటీవీ(ఆల్‌ టెరైన్‌ వెహికల్‌) రైడ్‌ చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉన్నారు

Case Filed Against Varma KRKR: కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్‌‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు, కులాల మధ్య గొడవలు, చిచ్చు పెట్టేలా సినిమా, వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు

Hazarath Reddy

కాంట్రవర్సీ కింగ్, వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (kamma rajyamlo kadapa redlu)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక ఈ వివాదం మరింత ముదిరింది.

Advertisement

Mla Vamsi Resign Reactions: వంశీ రాజీనామా లేఖతో వేడెక్కిన ఏపీ రాజకీయం, అండగా ఉంటామంటున్న టీడీపీ నేతలు, మరొకరు మాతో టచ్‌లో ఉన్నారంటున్న బిజెపి నేత, ఎంత దూరమైనా వెళ్తా అంటున్న చింతమనేని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వంశీ అధికార పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని అందుకే టీడీపీ పార్టీని వీడుతున్నానని లేఖ రాయడంతో రాజకీయాల్లో కలకలం మొదలైంది.

SMS App New Version: వాట్సప్‌ని సవాల్ చేయనున్న ఎసెమ్మెస్ యాప్, సరికొత్త హంగులతో ముందుకు, సెక్యూరిటీకి అత్యంత పెద్ద పీఠ, రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆధారిత మెసేజింగ్ వ్యవస్థకు శ్రీకారం

Hazarath Reddy

స్తుతం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు త్వరలో చెక్ పెట్టడానికి ఎసెమ్మెస్ మెసేజింగ్ యాప్ (SMS app) రెడీ అవుతోంది. SMS యాప్ లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాట్సప్ కు చెక్ పెడుతూ మెసేజింగ్ యాప్ కు పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు తెర వెనుక ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది.

Goodwin Jewellers Fraud Case: ముంబైలో మరో భారీ మోసం, గోల్డ్ స్కీమ్ పేరుతో జనాలకు టోకరా పెట్టిన గుడ్‌విన్ జ్యూయెలరీ సంస్థ, పరారీలో నిందితులు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

మహారాష్ట్రలో మరో ఫ్రాడ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్ ను ప్రజలకు ఆశగా చూపిన గుడ్‌విన్ జ్యూయెలరీ సంస్థ (Goodwin Jewellers), తమను నమ్మిన వారిని నట్టేట ముంచేస్తూ, బోర్డు తిప్పేసింది. దీంతో లక్షల రూపాయలు మోసపోయామంటూ పండుగ వేళ పెట్టుబడిదారులు రోడ్డెక్కారు.

PM Modi Saudi Arabia Tour: చమురు దేశంలో ప్రధాని టూర్, సౌదీ అరేబియాతో డజను ఒప్పందాలపై చర్చలు, మరోసారి వక్రబుద్ధి చూపిన పాక్, మోడీ విమానం పాక్ గగనతలం మీదకు నో ఛాన్స్, రూపే కార్డు విడుదల

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు సౌదీ వెళ్తున్నమోడీ వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, వలసలు, చమురు వంటి కీలక అంశాలపై సౌదీ రాజుతో చర్చలు జరపనున్నారు.

Advertisement
Advertisement