సమాచారం

Suzuki Chairman Osamu Suzuki Dies: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒసాము సుజుకి కన్నుమూత, కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒసాము..పలువురి సంతాపం

Arun Charagonda

సుజుకీ మోటార్స్‌ మాజీ ఛైర్మన్‌ ఒసాము సుజుకి కన్నుమూశారు. ఆయన వయస్సు 94. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారని సుజుకి మోటార్స్‌ కంపెనీ వెల్లడించింది.

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Arun Charagonda

హైదరాబాద్‌ నాచారంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది పీహెచ్‌డీ విద్యార్థిని. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి.

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Rudra

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించింది.

Advertisement

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Hazarath Reddy

2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే

Arun Charagonda

సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది.

Telangana: హెర్బల్ మందుల వాడకం..ప్రాణాల మీదకు తెచ్చింది, కిడ్నీ- లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు...వరంగల్ జిల్లాలో ఘటన

Arun Charagonda

హెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ

IRCTC Down? ఐఆర్‌సిటిసి డౌన్, ఈ నెలలో ఇది రెండవ సారి, భారత్ చంద్రుడ్ని చేరుకున్నా ఈ యాప్ క్రాష్ ఆపలేకపోతుందని నెటిజన్లు గగ్గోలు

Hazarath Reddy

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) అప్లికేషన్, వెబ్‌సైట్ గురువారం పనిచేయడం లేదు. టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ నివేదికలలో స్పైక్ చూపింది.

Advertisement

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Arun Charagonda

కామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.

Indian Rupee Slips All Time Low: రూపాయి విలువ భారీగా పతనం, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు కలిసొస్తున్న రూపాయి పతనం..వివరాలివే

Arun Charagonda

రూపాయి విలువ భారీగా పతనమైంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 10 పైసలు తగ్గి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 85.25 వద్ద కొత్త ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.

Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!

Arun Charagonda

కామారెడ్డి మిస్టరీ డెత్స్ కలకలం రేపింది. చెరువులో మహిళా కానిస్టేబుల్ శవం.. ఆమెతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ శవం లభించింది. ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు గజ ఈతగాళ్లు.

Pushpa 2 stampede: సంధ్య థియేటర్ విషాదం...రేవతికి 11వ రోజు కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు, కోలుకుంటున్న చిన్నారి శ్రీ తేజ్

Arun Charagonda

డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో మరణించిన 39 ఏళ్ల మహిళ రేవతి కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆమె అకాల మరణం యొక్క విషాదంతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రేవతికి కుటుంబం 11వ రోజు కర్మను నిర్వహించింది.

Advertisement

TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి

Arun Charagonda

తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.

HC on Loan Recovery: తీసుకున్న రుణం చెల్లించని వారి ఫోటోలను బ్యాంకులు బహిర్గతం చేయకూడదు, కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ హైకోర్టు

Hazarath Reddy

రుణాలు తిరిగి చెల్లించమని వారిని బలవంతం చేసేందుకు డిఫాల్ట్ చేసిన రుణగ్రహీతల ఫోటో, వివరాలను ఒక బ్యాంకు ప్రచురించరాదని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది. ఇలాంటి చర్యలు వ్యక్తి గౌరవంగా, ప్రతిష్టతో జీవించే హక్కును హరించివేస్తాయని జస్టిస్ మురళీ పురుషోత్తమన్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Centre Scraps 'No-Detention' Policy: ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై 5, 8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి

Rudra

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్ధులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే.

Advertisement

AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్ప‌పీడ‌నం.. కోస్తా జిల్లాల‌కు భారీ వ‌ర్షాల ముప్పు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న‌ తీవ్ర అల్ప‌పీడ‌నం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల‌కు భారీ వ‌ర్షాల ముంపు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఏపీ, ఉత్త‌ర త‌మిళ‌నాడు తీరాల వైపు అల్ప‌పీడ‌నం ప‌య‌నిస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది.

Pushpa 2 Leaked Online: ఆన్‌లైన్‌లో పుష్ప 2 హెచ్‌డీ వెర్షన్, సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం

Arun Charagonda

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. విడుదలై 17 రోజులు గడుస్తున్న వసూళ్ల జోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా తాజాగా పుష్ప 2 అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది.

Jeff Bezos To Marry Lauren Sanchez: రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం , లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్న జెఫ్ బెజోస్

Arun Charagonda

రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2023, మేలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్‌ పద్దతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోండగా జెఫ్‌ బెజోస్‌కి ఇది రెండో పెళ్లి.

PV Sindhu Weds Venkata Datta Sai: ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు

Arun Charagonda

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం వెంకట దత్తసాయితో జరగనుండగా ఇందుకు సంబంధించిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వివాహ వేడుక పూర్తయిన అనంతరం మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement