సమాచారం
Weather Forecast: రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, ఐఎండీ చల్లటి కబురు ఇదిగో..
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది
EPFO Higher Pension Date Extended: ఇదే చివరి అవకాశం, అధిక EPS పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన ఈపీఎఫ్‌వో, ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువును ఈపీఎఫ్‌వో మరోసారి పొడిగించింది. తొలుత మే 3వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్‌ 26 వరకూ పొడిగించింది. తాజాగా ఆ గడువూ తీరిపోవడంతో మరోసారి జులై 11వ తేదీ వరకూ పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది
Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. టమాటా మంట.. దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 ఆపైనే.. వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల
Rudraదేశంలో టమాటా మంట పెడుతున్నది. కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటి కన్నీళ్లు తెప్పిస్తున్నది.
TSRTC: ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
HC on Husband Property: భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకూ సమాన వాటా ఇవ్వాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన మద్రాసు హైకోర్టు
Hazarath Reddyఓ గృహిణిగా ఆమె కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలనే ఇంటి బెంగ లేకుండా భర్త స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా సంతృప్తికరంగా బయట పనిచేయడానికి వీలవుతోందని, తద్వారా ఆస్తులు సంపాదన జరుగుతోందని పేర్కొంది. కాబట్టి భర్త తన పేరున సంపాదించిన ఆస్తులన్నింటిలోనూ భార్య సమాన హక్కుదారు అని తెలిపింది.
Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Rudraఏపీలో పాఠశాలలు సోమవారం నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
TS EAMCET 2023 Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. .. 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
Rudraతెలంగాణలో ఎంసెట్‌-2023 ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నేటి నుంచి జులై 5 వరకు రుసుము చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు.
Rains Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన... రాగల 5 రోజుల్లో విస్తారంగా వర్షాలు.. హైదరాబాదుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rudraఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు చొచ్చుకుని పోతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.
Trains Cancelled: 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు.. ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే
Rudraదక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ
Rudraఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది.
AP SSC Supplementary Result 2023: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ డైరెక్ట్ లింకుల ద్వారా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్‌ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను విడుదల చేశారు.
TS CPGET Exam Date 2023: తెలంగాణ సీపీగెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు ఎగ్జామ్స్, ప్రతిరోజు మూడు సెషన్లలో పరీక్షలు
Hazarath Reddyతెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CPGET) షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని కబురు, రాగల మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. మంగళవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
Pink WhatsApp Scam: కొత్తగా పింక్ వాట్సాప్ స్కామ్‌, వాట్సాప్ కొత్త లుక్ అంటూ నకిలీ లింకులు పంపి రూ. కోట్లు కాజేస్తున్న కేటుగాళ్లు, ముంబై పోలీసులు అడ్వైజరీ ఇదిగో..
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ హెచ్చరిక ఆధారంగా కొనసాగుతున్న పింక్ వాట్సాప్ స్కామ్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. "న్యూ పింక్ లుక్ వాట్సాప్ విత్ ఎక్స్‌ట్రా ఫీచర్స్" వంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్‌మెంట్ వినియోగదారులను కోరింది
Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi US Visit: అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తానని, అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అవుతానని పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ప్రారంభమైంది. నేడు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో అమెరికాకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.
Heatwave Alert: తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు తీవ్ర వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరిక
Rudraవచ్చే మూడు రోజులపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం
Rudraతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది.
TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..
Rudraతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.
Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కల్యాణం సందర్భంగా ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.