Income Tax (Photo-IANS)

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు.

ఐటీఆర్‌ ఫైలింగ్ దాఖలు చేసేందుకు చివరి తేదీ నేడే, చేయకపోతే మీరు ఏం లాస్ అవుతారో ఓ సారి చెక్ చేసుకోండి

ఫైలింగ్‌ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్‌ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్‌ పోర్టల్‌ పనితీరు బాగుంది. ఫైలింగ్‌ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చని ట్వీట్‌ చేసింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్‌, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్‌ జులై 31లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే లేట్‌ ఫీ రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.

Here's Tweet

ఆడిట్ అవసరం లేని ట్యాక్స్‌ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000.