Teacher Arrested For Raping Student Representative image

Palghar, June 14: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్గర్ జిల్లా (Palghar) నలాసోపరా ప్రాంతంలో 29 ఏళ్ల మహిళను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి (raped multiple times) పాల్పడ్డాడు ఓ యువకుడు. గత కొంతకాలంగా మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధిత మహిళ ఇంటి పక్కనే ఉండే అకాశ్ విఠల్ (Akash Vithal Sankpal) అనే వ్యక్తి....తను ఇళ్లు చూపిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమెను అసభ్యకరంగా ఫోటోలు తీసి బెదిరించసాగాడు. ఫోటోలు చూపించి అప్పటి నుంచి పలుమార్లు రేప్ చేశాడు.

అంతేకాదు ఈ విషయాన్ని బయటచెప్తే బాధిత మహిళ భర్తను హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పకుండా లోపలే బాధపడింది మహిళ. అయితే ఈ విషయం మహిళ కుటంబ సభ్యులకు తెలియడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కస్టడీకి తరలించారు.