Aam Aadmi Party (File Photo)

New Delhi, July 16: భారతీయ జనతా పార్టీకి (Opposition Meet) వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే ఈ కూటమిలో చేరేందుకు ముందు నుంచి సముఖత వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ కేండ్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుపై కాంగ్రెస్ వైఖరి చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్షాల కూటమిలో చేరేది లేదని స్పష్టం చేసింది. అయితే దీనిపై చాలా రోజులుగా నాన్చుడు ధోరణి ప్రదర్శించిన కాంగ్రెస్ (Congress).. తాజాగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీలన్నీ దాదాపుగా హాజరయ్యాయి. అయితే ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలో కూడా కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండడంపై ఆప్ (AAP) విమర్శలు గుప్పించింది.

ఇక రెండవ విపక్షాల సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో రేపు ప్రారంభం (Oppositon Meet) కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మలుపు తీసుకుంది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డెనెన్సుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

 

ఇంతకాలం నాన్చుడు ధోరణితో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. సరిగ్గా విపక్షాల సమావేశానికి ముందు రోజే ఈ స్టాండ్ తీసుకోవడం పూర్తిగా రాజకీయ ఎత్తుగడ అని విమర్శకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఆర్డినెన్స్ మీద కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయడంతో.. విపక్షాల రెండవ సమావేశానికి హాజరు అవుతున్నట్లు ఆప్ ప్రకటించింది.