News
AAP Fourth List: ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనల్ లిస్ట్ రిలీజ్, న్యూఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్..కల్కజీ నుండి సీఎం అతిషి పోటీ..పూర్తి లిస్ట్ ఇదే
Arun Charagondaఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవగా కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. 38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది ఆప్. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్ చేసింది.
America: అమెరికాలో రోడ్డు ప్రమాదం..కారును ఢీకొట్టిన ట్రక్కు...ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి మృతి..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Arun Charagondaఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి యువతి మృతి చెందారు. వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కూతురు పరిమళ(26) MS చేయడానికి 2022లో US వెళ్లింది.. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టడంతో మృతి చెందింది. ఈ ప్రమాదంలో నికిత్, పవన్ అనే మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది
Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకండి లేకపోతే చాలా ప్రమాదం..
sajayaతల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కలగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు చేయడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే గుమ్మడికాయ రసాన్ని పరగడుపున తాగితే చక్కటి ఫలితాలు.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా బరువు పెరిగే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వారి బరువును తగ్గించుకోవడం కష్టంగా మారింది.
Health Tips: ప్రతిరోజు తామర గింజలను తీసుకోవడం ద్వారా మీ మధుమేహం అదుపులో ఉంటుంది..
sajayaతామర గింజల్ని ఫుల్ మఖాన అని అంటారు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్ , పొటాషియం, మెగ్నీషియం ,విటమిన్ బి 12, విటమిన్ b6 వంటివి పుష్కలంగా ఉంటాయి.
Astrology: 2025 వ సంవత్సరంలో బుధుని అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
sajayaజ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. అనేక ప్రధాన గ్రహాలు తమ రాక్ష చక్రాలను తరచుగా మార్చుకుంటూ ఉంటాయి.
Astrology: డిసెంబర్ 16 గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి చాలా మేలు..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలో ఒక గ్రహం సంచరిస్తూనే ఉంటుంది. ఇది అన్ని రాష్ట్రాల వారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు చంద్రుడు వృషభ రాశిలోకి సంచరించబోతున్నాడు.
Astrology: డిసెంబర్ 20వ తేదీన గురు గ్రహ, శుక్ర గ్రహం నవ పంచయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాలు నక్షత్రాలకు కదలిక వల్ల మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 20వ తేదీన గురు శుక్ర నవ పంచ యోగం ఏర్పడుతుంది.
MLC Kavitha: పైసల కోసం పార్టీ మారిన సంజయ్...జగిత్యాలలో ఏం అభివృద్ధి జరగలేదు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత
Arun Charagondaతెలంగాణ ప్రభుత్వ జీవో లెక్క చేయకుండా జగిత్యాలలో బతుకమ్మతో ఉండే 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయాడు...కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం అన్నారు.
Andhra Pradesh: కూడా ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అపశృతి..ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్...కిందపడ్డ ప్రజాప్రతినిధులు, వీడియో ఇదిగో
Arun Charagondaకాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్ రోడ్డు కూడా కార్యాలయం లో కూడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే తుమ్మల రామస్వామి (బాబు) కార్యక్రమంలో అపశృతి నెలకొంది. ఒక్క సారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్ పైన ఉన్న టిడిపి సీనియర్ నాయకులు యనమల , శాసనసభ్యులు చిన్న రాజప్ప, పంతం నానాజీ, తుమ్మల రామ స్వామి..కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్...స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన బన్నీ...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్, చంచల్‌గూడ జైలుకు తరలింపు, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో బన్నీ జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వచ్చారు అల్లు అర్జున్.
Australia vs India: స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు..5 వికెట్లు తీసిన బుమ్రా...భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
Arun Charagondaబోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ లోని గర్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరు సెంచరీలతో రాణించగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. మరోసారి 5 వికెట్లు తీసి సత్తాచాటాడు బుమ్రా.
Andhra Pradesh: ఏపీలో గంజాయి సాగు...15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టిన రైతులు...వీడియో ఇదిగో
Arun Charagondaఅల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో స్వచ్ఛందంగా గంజాయి పంటలు ధ్వంసం చేశారు రైతులు. దాదాపు 15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టారు రైతులు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతుల్లో చైతన్యం కల్పించారు.
Telangana: భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్‌ఐ, రూ.20 వేలు డిమాండ్..ఇవ్వక పోవడంతో గిరిజన యువకుడిపై దాడి...వీడియో ఇదిగో
Arun Charagondaభార్య భర్తల గొడవలో తలదూర్చాడు ఓ ఎస్ఐ. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడికి పాల్పడడాడు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో రూ.20 వేలు డిమాండ్ చేశారు ఎస్ఐ క్రాంతి కిరణ్. అంతకు ముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్నాడు యువకుడు. డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడు ఆరోపించగా న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.. రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaశ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించింది చిరుత. రోడ్డు పక్కన గోడపై చిరుత కూర్చొని ఉండగా చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు యాత్రికులు. చిరుత కూర్చొని ఉండగా దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్.. తన పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు.
Burra Venkatesham: గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, రెండు మూడు నెలల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడి
Arun Charagondaగ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రెండు మూడు నెలల్లో పరీక్షల ఫలితాలు అందిస్తామని వెల్లడించారు బుర్రా వెంకటేశం.
SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి
Arun Charagondaవాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్ఐ హరీష్ కేసులో ప్రియురాలు అనసూర్య(29)ను అరెస్ట్ చేశారు పోలీసులు. బానోత్ అనసూర్య, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించారు. గత సంవత్సరం క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు పరిచయమైంది అనసూర్య.
CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaజనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం మేరకు పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందని అన్నారు.