News
Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్ లోని సూరత్ లో ఘటన (వీడియో)
Rudraగుజరాత్ లోని సూరత్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.
Car Overturns in Mancherial: మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా.. మంచిర్యాలలో ఘటన (వీడియో)
Rudraమంచిర్యాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి కారు నడుపుతుండగా.. ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కారును పైకి లేపి అందులో ఉన్న వ్యక్తిని కాపాడారు.
Cockroaches in Pub’s Kitchen: హైదరాబాద్ లోని ఫేమస్ పబ్బుల్లోని కిచెన్ లో బొద్దింకలు.. కాలం చెల్లిన ఉత్పత్తులు..
Rudraహైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిపారు. ఆయా పబ్స్ లోని కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ రెండు పబ్బులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Bigg Boss Season 8: నేడు బిగ్ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.
Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి
Rudraదేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు
Rudraఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం పాలయ్యారు.
Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్
Rudraనిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.
Free Aadhaar Update Last Date: ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చంటే?
VNSఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసిపోతున్నది. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UADAI) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆధార్‌లో అడ్రస్‌లో (Aadhar Update) మార్పులు చేసుకోవాలంటే వెంటనే ఆన్ లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.
Toyota Urban Cruiser EV: మారుతీ సుజుకీ టెక్నాలజీతో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, వచ్చే నెల మార్కెట్లోకి రానున్న సరికొత్త కార్
VNSసుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకున్నదే టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ. గుజరాత్ లోని మారుతి సుజుకి ప్లాంట్ లో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ / సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara) తయారవుతాయి.
KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫర్ ను తిరస్కరించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మరీ అభినందించిన కేటీఆర్
VNSతెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని (Nandini Sidda Reddy) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
UPI Achieves Historic Milestone: యూపీఐ పేమెంట్స్ లో భారత్ సరికొత్త చరిత్ర, ఏకంగా రూ. 223 లక్షల కోట్ల చెల్లింపులు
VNSయూపీఐ లావాదేవీల్లో (UPI Payments) కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ (Finance Ministry) శనివారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ (Digital Payments) విప్లవం దిశగా ప్రయాణిస్తోంది.
Special Darshan Cancelled in Tirumala: వైకుంఠద్వార దర్శనానికి తిరుమల వెళ్తున్నారా? టీటీడీ కొత్త నిబంధనలు ఇవే! పలు దర్శనాలు రద్దు
VNSజనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు (Vaikuntha Dwara Darshan) టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది
Chandrababu Phone Call To Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు...అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆరా తీశారు. మరోవైపు బన్నీ సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు అల్లు అర్జున్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Kane Williamson: సీనియర్ ఆటగాడు..ఔటైన విధానం చూస్తే షాకే..ఇంగ్లాండ్‌తో టెస్టులో కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్...వీడియో ఇదిగో
Arun Charagondaహామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అర్ధసెంచరీకి ఆరు పరుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. 59వ ఓవర్ లోని చివరి బంతిని విలియమ్సన్ డిఫెన్స్ ఆడాడు.
Sree Leela On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు.
Telangana: గులాబీ బాస్‌కు షాక్...కేసీఆర్ వియ్యంకుడు కిషన్‌రావుపై ఎస్సీ,ఎస్టీ కేసు, భూకబ్జా నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaకేసీఆర్ వియ్యంకుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కల్వకుంట్ల కవిత మామ బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viral Video: అరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి...తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో...మీరూ చూడండి
Arun Charagondaఅరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి వెలిగించగానే కొండ కింద వున్న తిరువన్నామలై పట్టణంలో ప్రతి ఇంటిపైన పటాసులు పేల్చడం ఆనవాయితీ... ఇలా పటాసుల శబ్దాలతోహోరెత్తి ఆ వెలుగుల్లో ధగధగలాడుతున్న తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో.
MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు, గతంలో పవన్‌కు చెప్పు చూపించిన శ్రీనివాస్..ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదన్న దువ్వాడ
Arun Charagondaవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు షాక్ తగిలింది. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని తెలిపారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడారు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని చెప్పారు.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీ....పలువురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ఈపూరు- కూచినపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టగా అంతే వేగంగా వెనక్కి వెళ్లాయి రెండు కార్లు. ప్రమాదంలో రెండు కార్లలోని వారికి గాయాలు కాగా ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన
Arun Charagondaగురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శ్రీమంతుడికైనా, పేదవాడికైనా వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని స్పష్టం చేశారు. చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం...విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.