News

Rashmika Mandanna: అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో గుండె పగిలింది...సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం కానీ ఈ ఘటనలో ఒకే వ్యక్తిని నిందించడం సరికాదన్న రష్మికా మందన్నా

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్టుపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్స్ వేదికగా స్పందించింది. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని...ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఓ వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని తెలిపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నానని, గుండె పగిలే వార్త ఇదన్నారు.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డ దాఖలాలు లేవని వెల్లడి

Hazarath Reddy

అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, యాక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు, నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు.

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్, కీలకంగా మారిన సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేఖ ఇదే..

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది

Advertisement

YS Jagan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన జగన్, ఈ ఘటనకు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్న వైసీపీ అధినేత

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్..హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది అన్నారు.

Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది.

Varun Dhawan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదన్న ధావన్

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం అని...నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరని చెప్పారు. కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్నారు.

Mohan Babu: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం...మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం?

Arun Charagonda

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కదురు అయింది. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. దీంతో మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? చేశారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు అరెస్ట్‌ పై ప్రభుత్వంపై జర్నలిస్టులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Advertisement

Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు, కేసు విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన మృతురాలు రేవతి భర్త, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని వెల్లడి

Hazarath Reddy

అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు

Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, చంచల్‌గూడ జైలుకు తరలించనున్న పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Bandi Sanjay On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపాటు

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను తప్పుబట్టారు కేంద్రమంత్రి బండి సంజయ్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరం అని..ఈ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు.

Allu Arjun With Allu Aravind: నన్ను సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు..అరెస్ట్ చేశారు, అల్లు అరవింద్‌తో బన్నీ మాటలు వైరల్..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ బన్నీని అరెస్ట్ చేయగా అరెస్ట్ చేసే ముందు అల్లు అరవింద్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనని సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు.. అరెస్ట్ చేశారని చెప్పారు బన్నీ.

Advertisement

Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్‌ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్

Arun Charagonda

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

Allu Arjun Arrest Live Updates: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, రిమాండా లేదా క్వాష్ పిటిషన్‌పై విచారణా? అనే ఉత్కంఠ

Arun Charagonda

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. అక్కడి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వెల్లడి

Hazarath Reddy

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు

CM Revanth Reddy On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్య తీసుకున్నారని ఇందులో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

Advertisement

Allu Arjun Arrest: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సాయంత్రం నాలుగు గంటలకు విచారణ, ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం కానున్నాయా..

Hazarath Reddy

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు.

Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేఏ పాల్, లక్ష్మీ పార్వతి...గతంలో చంద్రబాబు వెళ్లిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు..చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్న?

Arun Charagonda

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. బన్నీ అరెస్ట్‌ను ఖండించారు కేఏపాల్, లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? చెప్పాలని డిమాండ్ చేశారు.

Allu Arjun Arrest: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ, మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బన్ని మండిపాటు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు.

Allu Arjun Emotional: అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్, భార్య స్నేహకు ధైర్యం చెప్పి పోలీస్ వాహనం ఎక్కిన బన్నీ...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.

Advertisement
Advertisement