News

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఓవైసీ, కాల్పుల ఘటనలో విచారణకు హాజరైన ఓవైసీ...వీడియో ఇదిగో

Arun Charagonda

యూపీలో కోర్టు విచారణకు హాజరయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఫిబ్రవరి 3 2022న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై, హాపూర్ కోర్టులో విచారణకు హాజరయ్యారు ఓవైసీ.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా. అయితే ఈ రోజే మీ ఆహారంలో జీరో క్యాలరీలు ఉన్న ఈ ఆహారాలను చేర్చుకోండి.

sajaya

బిజీ లైఫ్ వల్ల చాలామంది అధిక బరువుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం తక్కువ వ్యాయామం చేయడం జీవనశైలిలో మార్పు స్ట్రెస్ నిద్రలేకపోవడం వంటి వాటి వల్ల కూడా ఉబకాయం వస్తుంది.

UP Fan Meet Allu Arjun: వీడియో ఇదిగో, అల్లు అర్జున్‌ కోసం యూపీ నుంచి 1500 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని, ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్

Hazarath Reddy

యూపీలోని ‍అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్‌ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.

APSRTC Driver Dies of Heart Attack: చీరాలలో తీవ్ర విషాదం, బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు, పొలాలలోకి దూసుకెళ్లిన బస్సు, డ్రైవర్ మృతి

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లాలో డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా కర్లపాలెం వద్ద డ్రైవర్‌ సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. బస్సు వేగాన్ని తగ్గించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Health Tips: నిమ్మరసంలో లవంగాల పొడిని కలుపుకొని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

Tirupati: శవాన్ని దహనం చేయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా, తిరుపతి జిల్లాలో ఆ ఊరి ప్రజలకు ఇన్ని ఇబ్బందులా...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుపతి జిల్లా సత్యవేడు :ప్రాణాలకు తెగించినా పట్టించుకోవడం లేదు అధికార యంత్రాంగం. వర్షా కాలంలో చని పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు...స్మశానానికి వెళ్లాలంటే అరునానది సమీపంలోనీ కాలువలో ఈదుకుంటూ శవాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైనా ఆ గ్రామ ప్రజల కష్టాలు మాత్రం తీర్చే నాయకుడే లేకుండా పోయాడని వాపోతున్నారు ప్రజలు.

Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అత్యవసరమైనవి ఇవి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, నెల్లూరును ముంచెత్తిన వానలు

Hazarath Reddy

ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Advertisement

Hydra: హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నారా..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో  స్థలం ఉందని భయపడుతున్నారా?, అయితే మీరు కొనాలనుకునే లేదా ఉన్న స్థలం ఎఫ్‌టీఎల్‌-బఫర్‌జోన్‌లో ఉందా ఇలా తెలుసుకోండి!

Arun Charagonda

హైడ్రా..ఈ పేరు వింటేనే అక్రమార్కులు భయపడే స్థితికి వచ్చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది.

Devisri Prasad Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్, 19న జరిగే సంగీత కార్యక్రమానికి ఆహ్వానం.వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను మర్యాదపూర్వకంగా కలిశారు సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు దేవిశ్రీ ప్రసాద్.

Jagtial: మంత్రగాళ్లను చంపేస్తాం..జగిత్యాలలోని గ్రామంలో వెలసిన పోస్టర్లు,భయాందోళనలో గ్రామస్థులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల - మేడిపెల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను చంపబోతున్నామని వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వెలిశాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం అంటూ పోస్టర్ వేశారు. భయాందోళనలో గ్రామస్థులు, విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Russell's Viper Snake: బీహర్‌లో షాకింగ్ సంఘటన, ప్రమాదకరమైన రస్సైల్ వైపర్ కాటు, ఆ పాముతోనే ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి...వీడియో ఇదిగో

Arun Charagonda

బీహార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపు కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఓ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాదడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

Omar Abdullah Takes Oath as J&K CM: జ‌మ్మూకశ్మీర్ ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం, కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్

Hazarath Reddy

జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర‌నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జ‌మ్మూకశ్మీర్ కు తొలి ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా చ‌రిత్ర‌కెక్కారు.

Chennai Rains: వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో చొక్కాలు విప్పి విద్యార్థులు అవస్థలు, చెన్నై నగరాన్ని అస్తవ్యస్తం చేసిన వరదలు

Hazarath Reddy

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్‌పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా (Chennai Rain) నీట మునిగింది.

Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరు వరదలు, రోడ్డు మీద ఇరుక్కుపోయిన వందలాది వాహనాలు, నరకం చూసిన ప్రయాణికులు

Hazarath Reddy

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది

Bengaluru Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నయగారా జలపాతాన్ని తలపిస్తున్న బెంగుళూరు సిలికాన్ వ్యాలీ, రోడ్డు మీద కార్లు ఎలా ఇరుక్కుపోయాయంటే..

Hazarath Reddy

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో, నగరంలోని పలు ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బెంగళూరు రోడ్లపైనే కాకుండా భారతదేశంలోని అతిపెద్ద కార్యాలయ స్థలం మాన్యతా టెక్ పార్క్‌పై కూడా ప్రభావం చూపుతుంది.

Advertisement

Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరులో వరదలకు బైకుతో సహా కొట్టుకుపోతున్న టెకీ, నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు, స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్

Hazarath Reddy

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

Chennai Rains: 30 సెంటీమీటర్ల భారీ వర్షం, చెన్నై సిటీ అంతా అల్లకల్లోలం ,వేలచేరిలో భారీ వర్షానికి నీటమునిగిన రోడ్లు, వేలాది ఇళ్లు..వీడియో ఇదిగో

Arun Charagonda

భారీ వర్షం చెన్నై నగరాన్ని ముంచెత్తింది. ఏకదాటిగా వర్షం కురియడంతో 30 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. దీంతో చెన్నై సిటీ అంతా అల్లకల్లోలంగా మారింది. వేలచేరిలో భారీ వర్షానికి రోడ్లు, వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Chennai Rains: భారీ వర్షాలు, నీటి ప్రవాహం కారణంగా ఫ్లై ఓవర్లలో నిలిచిపోయిన వాహనాలు, కిలోమీటర్ల మేర పార్కింగ్‌లను తలపిస్తున్న ఫ్లైఓవర్లు..వీడియో

Arun Charagonda

భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై పట్టణాన్ని వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీటి ప్రవాహం కారణంగా అనేక ఫ్లై ఓవర్లలో వాహనాలను నిలిపివేశారు. దీంతో పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి ఫ్లై ఓవర్లు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Hyderabad Rains: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.

Advertisement
Advertisement