News

Hyderabad: గ‌ణేష్ మండ‌పాల్లో మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వారికి జైలు శిక్ష‌, ఏకంగా 200 మందిని జైల్లో వేసిన షీ టీమ్స్

VNS

బాధితులు ధైర్యంగా షీ టీమ్స్‌కు(She teams) ఫిర్యాదు చేయాలని సిటీ మహళా భద్రత డీసీపీ దార కవిత సూచించారు. ఇటీవల గణేష్‌ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేష్‌, ఇతర రద్దీగా ఉండే గణేష్‌ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

BSNL 4G Phone: బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్, చాలా త‌క్కువ ధ‌ర‌లో 4జీ ఫోన్ తీసుకువ‌స్తున్న కంపెనీ, అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్

VNS

దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, కార్బన్ మొబైల్స్ (Karbonn Mobiles) చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి.

Youtube Update: యూట్యూబ్ క్రియేట‌ర్ల‌కు ఇక పండుగే! ఇక‌పై షార్ట్ వీడియోలు 3 నిమిషాల పాటూ అప్ లోడ్ చేయొచ్చు

VNS

కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. షార్ట్స్‌ వీడియోల (YouTube Shorts) నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్‌ వీడియోలు (Youtube Shorts) ఒకటి. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేసుకునే వీలుండేది.

Dantewada Encounter: చ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ ఎన్ కౌంట‌ర్, భ‌ద్ర‌తా బ‌ల‌గాల స్పెష‌ల్ ఆపరేష‌న్, 30 మంది న‌క్స‌ల్స్ మృతి

VNS

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్‌ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. బస్తర్‌ రేంజ్‌లోనిదంతెవాడ, నారాయణ్‌పూర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది.

Advertisement

Supreme Court: జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు, ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

Arun Charagonda

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు.. విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు అని తేల్చిచెప్పింది. అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Nandigam Suresh Gets Bail: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు రిలీఫ్, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Arun Charagonda

వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Thatikonda Rajaiah: తాటికొండ రాజయ్య దోతిపైకి తొండ, భయంతో పక్కకు జరిగిన బీఆర్ఎస్ నేతలు...వీడియో ఇదిగో

Arun Charagonda

తొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది. అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా....ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు.

Tirupati Laddu Row: వీడియో ఇదిగో, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పినా బాబు బుద్ధి మారడం లేదు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని చెప్పింది. స్వయంగా వేసుకున్న సిట్‌ను రద్దు చేసింది

Advertisement

IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

Tirupati Laddu Row: జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేసిన వారిని స్వామివారే శిక్షిస్తారన్న జగన్..సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా? అని ప్రశ్న

Arun Charagonda

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు మాజీ సీఎం జగన్. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్‌ తో విచారణ జరపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించగా వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు అని తెలిపారు. తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని తెలిపారు జగన్.

Harishrao On Runa Mafi: హైడ్రా పేరుతో అరాచకం, రైతులు డిక్లరేషన్ ఏమైంది?, తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందన్న మాజీ మంత్రి హరీశ్ రావు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమంలో మాట్లాడిన హరీశ్‌..రేవంత్ తీరును ఎండగట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తుందని...హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసిని ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళ్ళు కూల గొడితే ఊరుకోం అని తేల్చిచెప్పారు. ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు అని ప్రశ్నించారు.

Boat Capsize in Congo: సరస్సులో మునిగిపోతున్న బోటు వీడియో ఇదిగో, 87 మంది మృతి, వందల మంది గల్లంతు

Hazarath Reddy

కాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్‌ లోడ్‌ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో సరస్సులో బోల్తా పడింది

Advertisement

DMK Vs Pawan Kalyan: సనాతన ధర్మానికి మీరే పెద్ధ శత్రువులు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్ విసిరిన డీఎంకే, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

తిరుపతి వారాహి డిక్లరేషన్‌ సభలో సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ (DMK Vs Pawan Kalyan) ఇచ్చింది.

Maharashtra Deputy Speaker: మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన, సచివాలయంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్ నరహరి, తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్ర సచివాలయం పైనుండే దూకేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్. అయితే బిల్డింగ్‌కు సేఫ్టీ నెట్‌ ఏర్పాటు చేసి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయనను రక్షించారు. గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) రిజర్వేషన్‌ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

KVP Ramachandra Rao On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ, పార్టీకి చెడ్డ పేరు రావొద్దు...అక్రమమైతే నేనే కూలుస్తానని కామెంట్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని ...ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించాలన్నారు. అక్రమమైతే నా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని లేఖలో పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని... కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు..అలా వస్తే నా రక్తం సహించదు అని తెలిపారు కేవీపీ.

Sanatan Dharma Row: వేచి చూడండి అంటూ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతి వారాహి డిక్లరేషన్‌ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది.

Advertisement

Deoria: వీడియో ఇదిగో, కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న విద్యార్థులను అది చూపాలంటూ వేధించిన కామాంధులు, పొలాల్లో గుండా పెరిగెడుతూ..

Hazarath Reddy

ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని నారాయణ్‌పూర్‌లో కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న పాఠశాల విద్యార్థినులను కొందరు వ్యక్తులు వేధించిన సంఘటన కలకలం రేపింది. దుండగులు బాలికలను వెంబడించడంతో వారు కేకలు వేసి భయాందోళనకు గురై పారిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Virat Kohli With Anushka Sharma: బ్యాటు పట్టిన అనుష్క శర్మ, బాల్ పట్టిన విరాట్ కోహ్లీ...ఫన్నీ అండ్ వైరల్ వీడియో

Arun Charagonda

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి క్రికెట్ ఆడారు. ముందుగా అనుష్క బ్యాటింగ్ చేయగా కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే అనుష్క రెండు సార్లు అవుట్ చేయగా అనుష్క శర్మ బుంగమూతి పెట్టింది. ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడిన కోహ్లీకి బిగ్ షాక్ ఇచ్చింది అనుష్క. బాల్ దూరంగా ఎవరు కొడితే వాళ్ళే తీసుకురావాలంటూ చెప్పగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Google Pay personal Loan: గుడ్ న్యూస్...ఇకపై గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల పర్సనల్ లోన్, రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్..వివరాలివే

Arun Charagonda

ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి గూగుల్ పే ద్వారా ఇక నుంచి గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ తో జత కట్టినట్లు తెలిపింది. అలాగే తమ ప్లాట్ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది.

Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్‌ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ట్వీట్

Hazarath Reddy

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement