News

Odisha: హదయాన్ని కదిలించే సంఘటన, హార్ట్ ఎటాక్‌తో తినుబండారాలు అమ్మే బండిపైనే ఓ వ్యక్తి మృతి..కలిచివేస్తున్న వీడియో

Arun Charagonda

ఒడిషాలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ 40 ఏండ్ల ఓ వ్యక్తి టీవీఎస్ బండికి తినుబండారాలు కట్టుకొని వాటిని వీధుల్లో తిరుగుతూ అమ్ముతాడు. ఎప్పటిలాగే తినుబండారాలను అమ్మేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి వర్షం పడుతుండడంతో ఒక దగ్గర ఆగాడు. ఇంతలోనే గుండెపోటు రావడంతో బండి మీదే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి, తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్‌రాజ్‌ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

Nimishamba Devi Temple: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపచారం, అమ్మవారికి చీర కట్టకుండా ప్రాక్ వేసిన పూజారులు, ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబికా దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి ప్రాక్ వేసారని పూజారులపై మండిపడుతున్నారు మహిళలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా ప్రాక్ ఎలా వేస్తారంటు నిలదీశారు. ఇక ప్రశ్నించిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, పడుకుని మొబైల్ చూస్తూ ఫుట్‌బోర్డ్ నుండి పట్టాలపై పడి మరణించిన యువకుడు

Hazarath Reddy

కడలూరుకు చెందిన పి బాలమురుగన్ (24) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని సైదాపేట రైల్వే స్టేషన్‌లో వైగై ఎక్స్‌ప్రెస్ ఫుట్‌బోర్డ్ నుండి పడి మరణించాడు. ఈ సంఘటన మధ్యాహ్నం 2:30 గంటలకు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్ మెట్లపై కూర్చున్న బాలమురుగన్ తన బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ 4 పై పడిపోయాడు.

Advertisement

Jangaon: మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులపై పోక్సో కేసు నమోదు

Arun Charagonda

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై.. ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక(14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నా.. వేర్వేరు కారణాలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు.

Nagaruna Petition On Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా, సోమవారం మరోసారి విచారించనున్న న్యాయస్థానం

Arun Charagonda

మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా వేసింది న్యాయస్థానం. సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి మనోరంజన్ కోర్టు. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో వాయిదా వేయగా సోమవారం రోజు పిటిషన్ పై విచారించనుంది మనోరంజన్ కోర్టు.

Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Arun Charagonda

సంచలనం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్​ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ సిట్​లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి సీనియర్​ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Viral Video: ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్రంగా గాయాలు.. నిజామాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

చిన్నారులపై వీధి కుక్కల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారి హరినేత్రపై తాజాగా ఓ వీధి కుక్క దాడికి పాల్పడింది.

Advertisement

Andhra Pradesh Shocker: కడపలో దారుణం, ఎనిమిదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం , పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కడపలోని చిన్నచౌక్ పొలిస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా భర్త చనిపోవడంతో ఓ యువకుడిని(27) మళ్లీ పెళ్లి చేసుకుంది మహిళ.

Dattatreya's Alai Balai: ‘అలయ్ బలయ్’ వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి సందడి.. 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్యక్రమం

Rudra

బండారు దత్తాత్రేయ అనగానే తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’ ఈవెంట్. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు.

Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?

Rudra

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.

Rashid Khan Marriage: అంగరంగ వైభవంగా ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం, పెద్ద ఎత్తున హాజరైన క్రికెటర్లు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో కన్నుల పండువగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆఫ్ఘాన్ క్రికెట్ టీం సభ్యులతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై విషెస్ తెలిపారు. రషీద్ ఖాన్ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10.61 కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడి నుండి డబ్బు దోచుకున్న కేటుగాళ్లు

Arun Charagonda

హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.10.61 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.

Cancers-Alcohol Link: ఎడాపెడా బాటిల్స్ లెక్కన మందు గుంజుతున్నారా? అయితే, జాగ్రత్త.. మద్యపానంతో ఆరు రకాల క్యాన్సర్లు వస్తాయట!

Rudra

మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, సినిమా హాల్స్ లో ఎంత ప్రచారం చేసినా మందుబాబులు మారడంలేదు. అయితే, మద్యపానం వల్ల అనారోగ్యమే కాదు ఆరు రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

Fake SBI: నకిలీ బ్యాంకునే సృష్టించార్రోయ్.. ఛత్తీస్‌ గఢ్‌ లో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌.. ప్రజలకు లక్షల్లో టోకరా.. అసలేం జరిగిందంటే?

Rudra

నకిలీ పెన్నులు, నకిలీ వాటర్ బాటిల్స్ ఇలా నకిలీ పేరిట ఏవేవో తయారుచేయడం చూశాం. అయితే, ఛత్తీస్‌ గఢ్‌ లో ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే సృష్టించారు కేటుగాళ్లు.

Cancer Agents In Cakes: బర్త్ డే నాడు కేకులను కూడా తిననిచ్చేలా లేరు కదా.. చివరకు కేక్స్ లో కూడా క్యాన్సర్‌ కారకాలు

Rudra

కాదేదీ కల్తీకి అనర్హం అనేలా తయారైంది నేటి కల్తీ రాయుళ్ల దందా. చివరకు బర్త్ డే కేక్స్ కూడా కల్తీకి గురవుతున్నాయి. ఎంతలా అంటే క్యాన్సర్ వచ్చేంతలా. కర్ణాటక రాజధాని బెంగళూరులో 12 కేక్‌ శాంపిళ్లలో క్యాన్సర్‌ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం అధికారులు ప్రకటించారు.

Advertisement

Medak Horror: మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)

Rudra

శాస్త్ర సాంకేతికత ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు పెద్దయెత్తున రాజ్యమేలుతున్నాయి. ఇదీ అలాంటి ఘటనే. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది.

Tirumala Brahmotsavalu: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగవైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది.

Rakul Preet Singh: నా పేరును మీ రాజకీయాల కోసం వాడుకోకండి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Vikas M

నేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా వున్నాను. ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం. నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం వుంది. ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం

Secunderabad To Vasco Da Gama By Weekly Train: గోవాకు వెళ్లాల‌నుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరక్ట్ ట్రైన్ కు ఆమోదం, ఈ నెల 9 నుంచి కొత్త ట్రైన్ ప్రారంభం

VNS

గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును (Goa Train) అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా – సికింద్రాబాద్‌ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని (By Weekly EXpress) ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement
Advertisement