News

Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను మానేయాలి..లేకపోతే ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

sajaya

కొలెస్ట్రాల్ సమస్య ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య చిన్న వయసులో వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు, ఓయూ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సీతక్క

Arun Charagonda

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.

Health Tips: మీ కాళ్ళలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తే అజాగ్రత్త వద్దు ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యల లక్షణం.

sajaya

కాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కాళ్ల ఆరోగ్యం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీ కాళ్ళలో పాదాలలో ఇటువంటి రకాల సమస్యలు కనిపిస్తే మీకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Bomb Threat To Vadodara Airport: నవరాత్రి ఉత్సవాలు, వడోదర ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు, అణువణువు తనిఖీ చేస్తున్న పోలీసులు

Arun Charagonda

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వడోదర విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపుకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ రావడంతో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Pune Court Summons To Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్, పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పుణె ప్రత్యేక కోర్టు, విచారణకు హాజరుకావాలని ఆదేశం

Arun Charagonda

ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 2023 లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ.. వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పుణె కోర్టు పరువు నష్టం దావా దాఖలు చేయగా విచారణ సందర్భంగా రాహుల్‌కి సమన్లు జారీ చేసింది న్యాయస్థానం.

Chhattisgarh:కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్, ఛత్తిస్ ఘడ్ ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి!

Arun Charagonda

ఛత్తిస్ ఘడ్, అబుజమ్మడ్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. 31 మృతదేహాలను దంతెవాడకు మరియు 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించినట్లు తెలుస్తోండగా ఇందుకు సంబంధించి అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

TTD On Reverse Tendering: టీటీడీ కీలక నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానానికి పుల్ స్టాప్ పెట్టిన టీటీడీ

Arun Charagonda

ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది టీటీడీ. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రస్తుతం వివిధ ద‌శ‌ల్లో రూ.1750 కోట్ల ప‌నులు జరుగుతుండగా దీనికి స్వస్తి పలికింది టీటీడీ. గతంలో నెయ్యి కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండగా ఈ విధానానికి స్వ‌స్తి ప‌లికింది టీటీడీ.

Heavy Rain Alert To Telugu States: రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు బారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరిక

Arun Charagonda

ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.

Advertisement

Charminar: చార్మినార్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌, అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు...వీడియో వైరల్

Arun Charagonda

చార్మినార్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌ చేశాడు. అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు వేయగా సోష‌ల్‌మీడియాలో వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Nagarjuna: అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు, తమ్మడికుంట కబ్జా చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు

Arun Charagonda

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Aravind Kejriwal: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్న కేజ్రీవాల్...వీడియో ఇదిగో

Arun Charagonda

ఇటీవల ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్..తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు కేజ్రీవాల్‌. ఇకపై అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో పాటు మండి హౌస్‌ సమీపంలోని ఫిరోజ్‌ షా రోడ్డులో ఉన్న పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు.

Chandrababu On Tirumala: తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు..వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన సీఎం

Arun Charagonda

తిరుమల లో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి..వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో.

Advertisement

Telangana Shocker: ఆన్‌లైన్ బెట్టింగ్..రైతు కుటుంబం ఆత్మహత్య, కొడుకు రూ.20 లక్షలు పొగొట్టుకోవడంతో అప్పుల బాధ తాళలేక ముగ్గురు ఆత్మహత్య

Arun Charagonda

నిజామాబాద్ - బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి దాదాపు రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు కొడుకు హరీష్. అప్పుల పాలు కావడంతో పొలాన్ని అమ్మేసిన కుటుంబం. దీంతో ఆర్ధిక ఇబ్బందులు రావడంతో తండ్రి సురేష్, తల్లి హేమలతతో పాటు.. కొడుకు హరీష్ కూడా ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Dussehra Rush: జనంతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు (వీడియో)

Rudra

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

Rain in Hyderabad: హైదరాబాద్‌ ను ముంచెత్తిన భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులూ వానలే

Rudra

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.

PM KISAN Yojna: రైతన్నలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లలోకి పీఎం-కిసాన్‌ పథకం డబ్బులు

Rudra

రైతన్నలకు శుభవార్త. అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు శనివారం విడుదల కానున్నాయి. ఈ పథకం కింద నేడు రూ.20 వేల కోట్ల నిధుల విడుదలతో దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి జరగనుంది.

Advertisement

Police Case on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై మధురైలో కేసు నమోదు.. ఎందుకంటే?

Rudra

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై తమిళనాడులోని మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు.

Mallareddy Mass Dance: మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)

Rudra

‘పాలమ్మిన, పూలమ్మిన..’ అనే డైలాగ్ తో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వైరల్ అవ్వాల్సిందే.

Charminar Viral Video: చార్మినార్‌ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌ చ‌ల్‌.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)

Rudra

హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. నిషేధించబడిన పైఅంతస్తులోకి చేరి అత్యంత ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు చేశాడు.

Posani Shocking Comments: కొండా సురేఖ వ్య‌వ‌హారంలో బాల‌కృష్ణ ఎందుకు స్పందించ‌లేదు! పోసాని కృష్ణ‌ముర‌ళీ కీల‌క కామెంట్లు..నా విష‌యంలో ఒక న్యాయం, వాళ్ల‌కో న్యాయ‌మా?

VNS

అక్కినేని నాగార్జున కుటుంబం – తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి (Posani Krishnamurthy) స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement