News
Latest ICC Rankings: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్, ప్రపంచ నంబర్ వన్ టీ20 ఆల్‌రౌండర్‌గా లియామ్ లివింగ్‌స్టోన్, రెండో స్థానానికి పడిపోయిన మార్కస్ స్టోయినిస్
Vikas MICC కొత్త T20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది, ఇందులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ గెలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లివింగ్‌స్టోన్ పాయింట్ల పట్టికలో ఆటగాళ్లందరినీ అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Donald Trump 3rd Assassination Attempt: డొనాల్డ్ ట్రంప్‌పై 3వసారి హత్యాయత్నం, కారు సమీపంలో భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Vikas Mలాంగ్ ఐలాండ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో కారులో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొనడంతో మరో హత్యాయత్నం విఫలమైంది. సెప్టెంబరు 18, బుధవారం సాయంత్రం ట్రంప్ షెడ్యూల్ చేసిన ప్రసంగానికి కొన్ని గంటల ముందు కారు ర్యాలీ ప్రదేశానికి సమీపంలో పోలీసులు ఈ పధార్థాలను కనుగొన్నారు.
Andile Phehlukwayo Run Out Video: ఇదేమి రనౌట్ బాబోయ్, ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసిన తరువాత రనౌట్ ఎలా అయ్యాడో మీరే చూడండి
Vikas Mసెప్టెంబరు 18న ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా 1వ ODI 2024లో ఆండిలే ఫెహ్లుక్వాయోను ఆకట్టుకునే రనౌట్‌గా తీసి గుల్బాదిన్ నైబ్ అద్భుతమైన తెలివిని ప్రదర్శించాడు. ఇది ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో అల్లా ఘజన్‌ఫర్ ఆండిల్ ఫెహ్లుక్‌వాయోపై LBW కోసం అప్పీల్ చేయడంతో జరిగింది.
IPL 2025: పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, అధికారిక ప్రకటన విడుదల చేసిన PBKS
Vikas Mవచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని వీడి పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన దేశానికే చెందిన ట్రెవర్ బేలిస్ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Walkie-Talkie Blasts in Lebanon: నిన్న పేజర్లు..ఇవాళ వాకీటాకీలు..లెబనాన్ లో వరుస పేలుళ్లు, వాకీ టాకీలు పేలి ముగ్గురు మృతి, పలువురికి గాయాలు (వీడియో ఇదుగో)
VNSలెబనాన్ (Lebanon)లో మరోసారి అనూహ్య దాడులు చోటుచేసుకున్నాయి. వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే.. తాజాగా వాకీటాకీ (Walkie Talkies)లు పేలినట్లు సమాచారం. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యులు, ఓ చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌లో పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం
Free Gas Cylinders from Diwali: వీడియో ఇదిగో, దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, సూపర్ సిక్స్ హామీని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఇక రాష్ట్రంలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Bangalore Crime: 20 ఏళ్ల యువతికి ప్రపోజ్ చేసిన 60 ఏళ్ల వృద్ధుడు, పార్కులో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా కత్తితో దాడి చేసిన యువతి ప్రియుడు
VNSపరిచయం ఉన్న యువతిని వృద్ధుడు పార్కుకు పిలిచాడు. అక్కడ ఆమెకు ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ మరోసారి పార్కులో కలుసుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన యువతి ప్రియుడు ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు. (Old Man Stabbed) ఈ విషయం తెలిసిన పోలీసులు గాయపడిన వృద్ధుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Kumari Aunty Donates Rs 50,000: వీడియో ఇదిగో, వరద బాధితుల కోసం రూ. 50 వేలు సాయం ప్రకటించిన కుమారి ఆంటీ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నగదు అందజేత
Hazarath Reddyకుమారి అంటీ తన మంచి మనసును చాటుకుంది. వరద బాధితుల సహాయార్థం ఆమె ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆమె ఈ మొత్తాన్ని అందించింది. కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి శాలువా కప్పి సన్మానించారు. వరద బాధితులకు తనవంతుగా సాయం చేసినందుకు అభినందించారు.
First Mpox Case in Kerala: దేశంలో మరో మంకీ పాక్స్ కేసు నమోదు, క్రమంగా విస్తరిస్తున్న డేంజరస్ వైరస్, యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి నిర్ధారణ
VNSదేశంలో మంకీ పాక్స్ (Mpox Case) రెండో కేసు నమోదైంది. కేరళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు బుధవారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రోగిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎం పాక్స్‌కు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం (Kerala M pox Case) తెలిపింది.
Delhi New CM Sworn Date: ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్, సెప్టెంబర్ 21న ప్రమాణం చేయించనున్న లెఫ్టినెంట్ గవర్నర్
VNSఢిల్లీ ముఖ్యమంత్రిగా నియామకమయైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి (Atishi) ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ప్రమాణస్వీకారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే
Bank Holidays in October: అక్టోబర్ నెలలో బ్యాంకు పనులు ఉన్నవాళ్లు జాగ్రత్త, వచ్చే నెలలో ఏకంగా 12 రోజులు సెలవులు, పూర్తి వివరాలు ఇవిగో!
VNSరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు (Bank Holidays) మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులుపడే ఛాన్స్ ఉంటుంది.
Kamareddy School Bus Fire: వీడియో ఇదిగో, బ్యాటరీ పేలి ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు, భయంతో కేకలు వేసిన విద్యార్థులు
Hazarath Reddyవేట్ స్కూల్ బస్సులో మంటలు రేగిన ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. దీంతో.. బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయానికి లోనై కేకలు వేశారు.
Balineni Srinivasa Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్ ఇన్‌ఫ్రా
Hazarath Reddyఅనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ స్టాండలోన్ రుణాల (standalone external debt)ను భారీగా తగ్గించుకుంది. మొత్తం రుణాలను రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, రాహుల కలయిక వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఈ రెండిటి కలయిక వల్ల కొన్ని సార్లు గందరగోళం ఏర్పడుతుంది.
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
Hazarath Reddyప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కోవిడ్-19 వైరస్ కాలానుగుణంగా అనేక విధాలుగా రూపాంతరం చెంది, వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా వ్యాపిస్తోంది. తాజాగా, కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇది 27 దేశాలకు పాకడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaసెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం. ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది.
CM Revanth Reddy On MSME Policy: ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర సంపద పెంపొందించాలనే ఈ కొత్త పాలసీని రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaరాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ - 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్...సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు...అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
Asteology: సెప్టెంబర్ 20 నుండి సూర్యుడు,కేతు గ్రహాలు కన్యారాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి ప్రయోజనం.
sajayaగ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 20న సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ రెండు గ్రహాలు కూడా సెప్టెంబర్ 20 ఉదయం 8 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశం.