వార్తలు
AP, Telangana Weather Alert: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో
Arun Charagondaభారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Helicopter Crash Caught on Camera in Kedarnath: కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
Rudraఉత్తరప్రదేశ్ లోని కేదార్ నాథ్ లో ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. మరమ్మతులు జరుగుతున్న శిక్షణ హెలికాప్టర్ కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
Toddy From Neem Tree: వేప చెట్టుకు కల్లు, గద్వాల జిల్లాలో వింత, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaగద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కారుతుంది కల్లు. కల్లు కారుతున్న వేప చెట్టుకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందన్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల నుండి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Hyderabad: ఎంత తెలివిగా బైక్ దొంగతనం చేశాడో చూడండి..ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీ టీవీ ఫుటేజ్
Arun Charagondaహైదరాబాద్ బాలాపూర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
CM Revanth Reddy: టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, అవసరమైతే చట్ట సవరణ చేస్తామని వెల్లడి
Arun Charagondaస్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలన్న సీఎం రేవంత్...ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని చెప్పిన రేవంత్..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Vijayawada Landslide: విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)
Rudraభారీ వర్షాలు ఏపీ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. నగరంలోని మొగల్ రాజపురంలో పలు ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.
Car Accident in Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ప్రమాదంలో మరో కారు, ఆటో ధ్వంసం
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసి ఉన్న మరో కారును, ఆటోను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.
Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!
Rudraమారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ
Rudraరాజధాని హైదరాబాద్ లో వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, బంజారాహిల్స్, లక్డీక పూల్, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.
Boy Clings to Kidnapper: పెంచిన పాశం ముందు కన్నపాశం అచ్చెరువొందిన వేళ.. కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన రెండేండ్ల బాలుడు... కిడ్నాపర్ పై పెంచుకున్న మమకారమే కారణం.. ఇంటర్నెట్ ను కదిలిస్తున్న భావోద్వేగ వీడియో ఇదిగో మీరూ చూడండి!!
Rudraకిడ్నాపర్ల చెరలో పసి మొగ్గలు పడే అవస్థలను, ఆ దృశ్యాలను సినిమాలు, సీరియళ్ళలో చూసి అయ్యో పాపం అని అనుకునే సందర్భాలు మీకు ఉండే ఉంటాయి.
Viacom18 And Star India Merger Deal: దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్, వయాకాం-వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం
VNSరెండు సంస్థల విలీనంతో ఏర్పాటయ్యే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కానున్నది. ‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్రన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్‌తోపాటు అన్ని పక్షాల న్యాయవాదులు, ప్రతినిధుల సమక్షంలో వయాకాం-స్టార్ ఇండియా (Star India) విలీనంపై అభ్యంతరాలు వెల్లడి కాలేదు.
New Service at Mee Seva: ఇకపై పహాణీ కాపీల కోసం ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు, తాజాగా మరో 9 కొత్త సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
VNSతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రకటించింది.
Kerala: కేరళ చరిత్రలో అరుదైన ఘటన, భర్త స్థానంలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన భార్య..
VNSభార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబ నిర్వహణ సాధ్యం.. అదే వారిద్దరూ ఐఏఎస్ (IAS) ఆఫీసర్లైతే రోజువారీగా కుటుంబ నిర్వహణతోపాటు అధికార విధుల్లోనూ కలిసే పాల్గొంటారు. కానీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య చీఫ్ సెక్రటరీగా (Chief Secretary) బాధ్యతలు చేపట్టనున్నారు.
Shruti Haasan Joins Rajinikanth's Coolie: రజనీకాంత్ కూలీ చిత్రంలో ప్రీతిగా శృతి హాసన్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
Vikas Mఇప్పటికే మలయాళ నటుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం గురువారం అక్కినేని నాగార్జున సైమన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరో పాత్రను రివీల్ చేశారు. ఈ సినిమాలో తమిళ నటి శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ప్రీతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
Airbus Beluga in Hyderabad: హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, వేల్ ఆఫ్ ది స్కై ప్రత్యేకతలివే! (వీడియో ఇదుగోండి)
VNSవేల్ ఆఫ్ ద స్కై' (Whale of the Sky) గా పిలవబడే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో (Airbus Beluga) విమానం.. శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. 'ఎయిర్ బస్ బెలూగా'(Airbus Beluga) అనే పేరు గల తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం, ఇప్పటివరకు హైదరాబాద్ కు రెండు సార్లు రాగా.. మూడోసారి,
SpiceJet Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో స్పైస్ జెట్, 150 మంది క్రూ సిబ్బందికి మూడు నెలల పాటు వేతనం లేని సెలవులు మంజూరు
Vikas Mదేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ (Spice Jet) ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవులు మంజూరు చేసింది. సెలవు ప్రకటించిన క్రూ సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి హెల్త్ బెనిఫిట్లు, ఎర్న్డ్ లీవ్స్ యధాతథంగా కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.
DGCA: ఎయిర్ ఇండియాకు బిగ్ షాక్, రూ. 10 లక్షలు ఫైన్ వేసిన డీజీసీఏ, ఈ మూడు సంస్థలకు నోటీసులు
VNSఆకాశ ఎయిర్ పలు రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇటీవల నిర్వహించిన సమీక్షలో డీజీసీఏ నిర్ధారణకు వచ్చింది. ఈ విషయమై సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది
No Mango in Mango Juice! మామిడి పండ్లు లేకుండానే మ్యాంగో జ్యూస్, టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ వైరల్ వీడియో ఇదిగో..
Vikas Mటెట్రా ప్యాక్ మామిడి పండ్ల రసాలను తినడానికి ఇష్టపడని వారు ఉండరు, ముఖ్యంగా వేసవి కాలంలో, వాణిజ్య దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ జ్యూస్‌లు అసలు మామిడి పండ్లతో తయారు చేయబడతాయా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మామిడి రసాన్ని తయారు చేయడాన్ని చూపించే ఇటీవలి వైరల్ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది.
Aarti Wins Bronze Medal: ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం
Vikas Mఆర్తి దుబాయ్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10,000 M రేసు నడక ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ U20 క్వాలిఫికేషన్ సమయాన్ని 49 నిమిషాలకు మెరుగుపరచడానికి ఆమె 47:45.33ని పూర్తి చేసింది.
Hidden Cameras in College Girls' Washroom: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై జగన్ ఆగ్రహం, విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపాటు
Hazarath Reddyకృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.