వార్తలు
Hyderabad Youth Dies in US: అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..
Rudraచేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది?
Love Proposal at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అంతా చూస్తుండానే తోటి అథ్లెట్ కు లవ్ ప్రపోజ్ చేసిన మరో అథ్లెట్, వైరల్ గా మారిన లవ్ స్టోరీ
VNSపారిస్ ఒలింపిక్స్ (Aris Olympics) ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు
HD Kumaraswamy: మీడియాతో మాట్లాడుతుండగానే కేంద్రమంత్రి కుమారస్వామి ముక్కు నుంచి రక్తం, హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు, ఆందోళనలో అభిమానులు (వీడియో ఇదుగోండి)
VNSఓ హోటల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. చొక్కాపై సైతం రక్తపు మరకలు కనిపించాయి. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో జేడీఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
Prashant Kishor New Party: పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్, గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ ప్రకటించనున్న పోల్ స్ట్రాటజిస్ట్, ఇంతకీ పార్టీ పేరేంటో తెలుసా?
VNSజన్ సురాజ్ పార్టీని (Jan Suraaj Party) నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్న చేపడుతున్న విషయం తెలిసిందే. అదే పేరును పార్టీకి పెట్టబోతున్నట్లుగా ఆదివారం ప్రకటించారు
Hippopotamus Attacked Zoo Caretaker: తన పిల్లను ముట్టుకున్నందుకు కేర్ టేకర్ ను చంపేసిన హిప్పోపొటోమస్, రాంచీ జూ లో ఘటన
VNSమరోవైపు నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడిలో మరణించిన వ్యక్తికి రూ. 4 లక్షల పరిహారం కూడా లభిస్తుందని జూ డైరెక్టర్ జబ్బర్ సింగ్ తెలిపారు. సంతోష్ ఆసుపత్రి ఖర్చులను జూ అథారిటీ భరిస్తుందని చెప్పారు. అలాగే అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ప్రయత్నిస్తామని అన్నారు
Belated ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగుస్తోంది, ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
VNSబీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ (Belated ITR Filing) చేయడం వల్ల కొన్ని బెనిఫిట్లు కోల్పోతారు పన్ను చెల్లింపుదారులు. దీర్ఘకాలిక పెట్టుబడులు, బిజినెస్ ఇన్ కం, ఇతర మార్గాలో సమకూర్చుకునే నిధులపై నష్టాన్ని తర్వాతీ ఏడాదికి కొనసాగించలేరు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకునేందుకు అనుమతించరు.
Kakinada Road Accident: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు స్పాట్ డెడ్, బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaకాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నలుగురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Delhi: ప్రాణాలు తీసిన కోచింగ్ సెంటర్, సెల్లార్‌లో లైబ్రరీ- ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి, విద్యార్థుల ఆందోళన, న్యాయం చేయాలని డిమాండ్
Arun Charagondaఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నీటమునిగింది. సెల్లార్‌లో లైబ్రరీ ఉండగా దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు విద్యార్థులు లోపల చిక్కుకున్నారు. ముగ్గురూ నీటిలో మునిగి చనిపోయారు.
Telangana Shocker: ప్రేమ వ్యవహారం, డిగ్రీ విద్యార్ధిని చంపిన ఇంటర్ విద్యార్థులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
Arun Charagondaప్రేమ వ్యవహారంలో డిగ్రీ విద్యార్థిపై దాడి చేసి చంపారు ఇంటర్ విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం - పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అల్లూరి విష్ణు(22)పై కొంత మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన విష్ణును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, విష్ణు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
Astrology: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన లాభం..
sajayaన్యూమరాలజీ ప్రకారం ప్రతి వ్యక్తికి ఒకటి నుండి తొమ్మిది అంకెల వరకు సంఖ్యలు కేటాయించబడతాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి చిన్న వయసులోనే ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ
Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ ఛాలెంజ్, అమ్మవారి సన్నిధిలో రాజకీయాలేంటి?, కోమటిరెడ్డి ఫైర్
Arun Charagondaభాగ్యనగరం బోనమెత్తింది. నగరం వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొంది. ఎక్కడ చూసిన బోనాల పండగ శోభ సంతరించుకోగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వైన్స్ షాపులు బంద్ చేయగా ట్రాఫిక్ ఆంఓలు సైతం విధించారు.
China Rains: అరుదైన దృశ్యం...చైనాలో వర్షపు తుపాను, నదిలోని చేపలన్ని ఒక్కసారిగా డ్యాన్స్, వైరల్ వీడియో
Arun Charagondaచైనా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఇక చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి.
AP Volunteers: ఏపీ సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్, త్వరలో వాలంటీర్లకు శుభవార్త చెప్పనున్న టీడీపీ సర్కార్?
Arun Charagondaప్రజల వద్దకే సంక్షేమం ,ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంలో 2019లో వైసీపీ అధినేత, నాటి ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్ సిస్టమ్. దాదాపు ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఒకేసారి వాలంటీర్లుగా నియమించి ప్రతి 50 కుటుంంబాలకు ఒక వాలంటీర్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు అద్భుత స్పందన వచ్చింది.
Bengaluru: శభాష్ పోలీస్, పంక్చర్ ఫిర్యాదులు రావడంతో రోడ్డుపై మేకులు తొలగింపు,సర్వత్రా హర్షం
Arun Charagondaలోహపు మేకులతో కొట్టుకుపోయిన రోడ్డును శుభ్రం చేశారు బెంగళూరు పోలీసులు. ఘటనా స్థలంలో బ్యాక్ టు బ్యాక్ పంక్చర్‌లు వచ్చాయని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో వారు దీనిని శుభ్రం చేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
Walnuts Diabetes Link: వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచివి.. అయితే, ఆ సమస్య ఉన్నవారికి మాత్రం కావు.. ఏమిటా విషయం?
Rudraవాల్ నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి.
Shamirpet Road Accident: హైదరాబాద్ శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంతో బస్సును ఢీ కొట్టిన కారు, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి, షాకింగ్ వీడియో
Arun Charagondaతెలంగాణలోని హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ - శామీర్‌పేట రాజీవ్ రహదారిపై అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మోహన్(25), దీపిక(25) మృతి చెందారు. బస్సు వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్ ఫుటేజ్ వీడియో వైరల్‌గా మారింది.
Chimpanzee Human Similarity: మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయ్,, నిజమండీ.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraమనుషులు ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ కు చెందిన గాల్ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.
Israel: ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదుల డ్రోన్ దాడి , 9 మంది మృతి,మృతులంతా చిన్నారులే, 30 మందికి గాయాలు, దాడికి పాల్పడింది తామేనని హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ప్రకటన
Arun Charagondaఇజ్రాయెల్‌పై డ్రోన్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Exact Time for Pregnancy: రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోండి.. గర్భం దాల్చాలనుకునే వారికి ఇదే సరైన సమయం
Rudraనిద్రపోయే సమయం, నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని హునన్ లో ఉన్న సెకండ్ జియాంగ్యా హాస్పిటల్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది.
Andhra pradesh: తిరుమలలో పాము కాటుకు గురైన భక్తుడు, అలిపిరి మెట్లపై కాటు వేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫారెస్ట్ అధికారులు
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం చోటు చేసుకుంది. చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర(29) అలిపిరి మెట్ల నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఏడవ మైలు దగ్గర పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు బాధితుడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది.