New Delhi, March 16: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 12మందిని అరెస్ట్ చేసి విచారణ జరిపిన ఈడీ (ED) ఈ కేసులో దూకుడు చూపిస్తోంది. మార్చి 11న రామచంద్ర పిళ్లై తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) విచారించిన ఈడీ ఇవాళ మరోసారి కవితను విచారించనుంది. మార్చి 11న పలు కీలక అంశాలపై కవితపై పశ్నల వర్షం కురిపించిన ఈడీ 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. తో కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈరోజు మరోసారి అరుణ్ రామచంద్ర పిళ్లైను (Ramachandra Pillai), కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ విచారిస్తోంది. అలాగే ఈ కేసులో అత్యంత ముఖ్యమైన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గత ఆరు రోజుల నుంచి వరుసగా విచారిస్తోంది ఈడీ. అలాగే తొమ్మిది రోజులుగా ఈడీ కష్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను కూడా ఈడీ అధికారులు వరసుగా ప్రశ్నిస్తున్నారు.
Security deployed outside the Delhi residence of BRS MLC K Kavitha ahead of her questioning by Enforcement Directorate in the Delhi excise policy case pic.twitter.com/lDNjVpLaq4
— ANI (@ANI) March 16, 2023
లిక్కర్ పాలసీ రూపకల్పన (Delhi Liquor Policy), రూ.100 కోట్ల ముడుపుల వ్యవహరాలు, దానికి సంబంధించిన ఆధారాలు వంటి పలు కీలక అంశాలపై ఈడీ అధికారుల బృందం నిందితులను వరుసగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెల్లడి అవుతున్నాయి. అలా దీనికి సంబంధించిన ఆధారాలను నిందితులు ధ్వంసం చేయటంపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఈడీ ఆ దిశగా క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. విచారణలో వెల్లడి అయిన వివరాలను ఏప్రిల్ మొదటివారంలో రెండవ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ చేయనుంది ఈడీ. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో 12మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ 12మంది 10మంది నిందితులు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 9మంది తీహార్ జైల్లో ఉన్నారు.
కాగా ఢిల్లీలో మార్చి 10న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు దీక్ష చేసిన కవిత ఆ మరునాడే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈక్రమలో మరోసారి ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈడీ విచారణ సమన్లను రద్దు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దాంతో ఈడీ ముందు హాజరు తప్పనిసరి కానుంది. అయితే గతంలో ఈడీ విచారణకు హాజరైన సమయంలో కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్, భారత జాగృతి కార్యకర్తలు ఈడీ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఇక మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు మద్దతుగా ఉన్నారు. న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.