MLC Elections Results (PIC @ ANI Twitter)

Hyderabad, March 16: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ (MLC Elections Results) ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.... కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections Results) ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది స్థానాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్ పేపర్ల (Ballot) పరిశీలన ఉంటుంది. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు మధ్యాహ్నం ఒంటిగంటలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల (Teachers MLC) ఫలితాలు రేపు అర్థరాత్రి వరకు, గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ఎల్లుండి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Revanth Reddy Plays Football Video: యువకులతో కలిసి పుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ‘ఖేల్’ ఖతం అని క్యాప్షన్ ఇస్తూ ట్వీట్ 

ఇదిలాఉంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల నిబంధనావళిని అధికార వైసీపీ యథేచ్ఛగా ఉల్లంఘించిందని అన్నారు. 2019 తర్వాత తిరుపతిలో జరిగిన వివిధ ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు, బోగస్ ఓట్ల నమోదు, ఎన్నికల అధికారుల అధికార దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు చంద్రబాబు బుధవారం ఏడు పేజీల లేఖ రాశారు. ఇదిలాఉంటే అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని వైసీపీ ధీమాను వ్యక్తంచేసింది.

Socio Economic Survey: సామాజిక ఆర్థిక సర్వేను విడుదల చేసిన సీఎం జగన్, ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని తెలిపిన ముఖ్యమంత్రి 

తెలంగాణలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు, ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల కౌంటింగ్‌కు దాదాపుగా 300 మంది సిబ్బంది పాల్గొంటుండగా, కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ -రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.