శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్ వన్ అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన వివరించారు.
వ్యవసాయం లో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైంది. 36 శాతం కంట్రీబ్యూషన్ వ్యవసాయం నుంచి వస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైంది. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించాం. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి’’ అని విజయ్‌కుమార్ వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)