New Delhi, May 13: సీబీఎస్‌ఈ ఫలితాల్లో ( CBSE Class 12th results) ఆశించిన మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడింది ఢిల్లీకి చెందిన ఓ బాలిక. వెస్ట్ ఢిల్లీలోని హరినగర్ ప్రాంతంలో ఉండే 16 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది(suicide). కొద్దిరోజుల క్రితం వెలువడిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల్లో సైన్స్ స్ట్రీమ్ లో 75 శాతం మార్కులు సాధించింది. దీనిపై ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడటం లేదు. ముభావంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Depressed over CBSE Class 12th result, a 16-yr-old girl committed suicide by hanging herself from a ceiling fan at her home in West Delhi's Hari Nagar area, an official said.
"She had secured 75% marks in science stream & she was deeply upset. No suicide note was found. The dead… pic.twitter.com/YL5Lcpg0Tu
— IANS (@ians_india) May 13, 2023
అయితే శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకొని చనిపోయింది. కానీ తన ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి నోట్ లభ్యం కాలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం పంపించి కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.