New Delhi, JAN 18: ఈ ఏడాది తొలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ (Election Commission of India) ప్రకటించనుంది. త్వరలోనే గడువు ముగుస్తున్న నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya), త్రిపుర (Tripura) అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ రెడీ (Schedule of General Elections) చేసింది ఈసీ. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. మూడు రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మూడు ఈశాన్య రాష్ట్రాలే కావడం గమనార్హం. మార్చి నెలలో ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటించారు. అక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎలక్షన్స్ కు సంబంధించిన భద్రతపై కూడా ఇప్పటికే కేంద్ర బలగాలను సిద్ధం చేస్తున్నారు.
Election Commission of India (ECI) to announce the Schedule of General Elections to Legislative Assemblies of Nagaland, Meghalaya & Tripura today. pic.twitter.com/mzLYH43Wdg
— ANI (@ANI) January 18, 2023
త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా, మేఘాలయ, నాగాలాండ్ ల్లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. ఇప్పటికే కొద్ది నెలలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టాయి. షెడ్యూల్ విడుదలైతే ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది.