మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. నాగాలాండ్, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్‌డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేఘాలయ గవర్నర్ ఫగూ చౌహాన్ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.
మంగళవారం సంగ్మాతో పాటు ఎన్‌పీపీకి చెందిన ప్రిస్టోన్ టిన్‌సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధర్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్‌ఎస్‌పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.ఈ మేరకు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీకి నుంచి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు.
మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని NPP 26 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆ తర్వాత 11 స్థానాలతో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సంగ్మా UDF, HSPDP, BJP, ఇండిపెండెంట్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు.
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందిన నీఫియు రియో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హోలీ తర్వాత రోజు గురువారం త్రిపురలో బీజేపీకి చెందిన మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.