Tillu Tajpuriya (Photo Credits: Twitter@LiteKashmir)

New Delhi, May 02: తీహార్‌ జైళ్లో (Tihar jail) గ్యాంగ్‌వార్ జరిగింది. రెండు గ్యాంగుల మధ్య ఘర్షణలో ఓ గ్యాంగ్‌స్టర్ మరణించాడు. 2021లో రోహిణి కోర్టులో కాల్పులకు తెగబడ్డ కేసులో నిందితుడు గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియాపై (gangster Tillu Tajpuriya) అతని శత్రువర్గం దాడి చేసింది. తెల్లవారుజామున గ్యాంగ్‌స్టర్ టిల్లుపై ఐరన్ రాడ్లతో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరో గ్యాంగ్‌స్టర్ యోగేష్ తుండా (Yogesh Tunda) ఈ దాడికి పాల్పట్లు గుర్తించారు. తుండా దాడిలో తీవ్రంగా గాయపడ్డ టిల్లును వెంటనే దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించనట్లు వైద్యులు తెలిపారు.

2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులకు సంబంధంచిన కేసులో గ్యాంగ్‌స్టర్ టిల్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పటి ఘటనలో మరో గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగి మరణించాడు. టిల్లు గ్యాంగ్‌లో కాల్పులకు దిగిన మరో ఇద్దరిని పోలీసులు అక్కడికక్కడే మట్టుబెట్టారు. అప్పటి నుంచి ఈ కేసులో విచారణను ఎదుర్కుంటున్న టిల్లు....తీహార్ జైళ్లో ఉన్నాడు.