New Delhi, DEC 28: కరోనా అనంతరం పెరిగిన ఔషదాల వినియోగం, తయారీతో క్వాలిటీపై కేంద్రం దృష్టి సారించింది. ఇటీవల గాంబియాలో (Gambia) నాసిరకం దగ్గుమందు వాడటం వల్ల 70 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవన్నీ భారతీయ కంపెనీలకు చెందినవే కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో దేశంలోని వివిధ ఔషద తయారీ యూనిట్లలో (drug-making units) తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.
ఇందుకోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడి తనిఖీలు చేపట్టనున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansuk Mandaviya) ఆదేశాల మేరకు తనిఖీలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం, దేశవ్యాప్తంగా ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 నిబంధనలకు అనుగుణంగా ఉండేలా తనిఖీ, రిపోర్టింగ్, తదుపరి చర్యల ప్రక్రియను పర్యవేక్షించడానికి సీడీఎస్‌సీవోలో ఇద్దరు జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
Government starts joint inspection of drug manufacturing units across the country to ensure high quality of medicines.https://t.co/UAXMA9bxcB
— All India Radio News (@airnewsalerts) December 28, 2022
దేశంలో తయారయ్యే ఔషధాలకు సంబంధించి అధిక నాణ్యత ప్రమాణాలను పాటించేలా (quality of drugs) ఉమ్మడి తనిఖీని నిర్వహిస్తున్నారు. నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ లేదా కల్తీ లేదా నకిలీ ఔషధాల తయారీని గుర్తించేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ఔషధాల భద్రత, సమర్థత, నాణ్యతను నిర్ధారించడం ఔషధ నియంత్రణ లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. దీనిద్వారా దేశంలో ఉత్పత్తి చేసిన ఔషధాలకు సంబంధించి అధిక నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కట్టుబడి ఉండేలా చూడనున్నారు.