
హిమాచల్ ప్రదేశ్ | ఈరోజు ధర్మశాలలో సీఎం ర్యాలీలో విధులు నిర్వహిస్తుండగా సీనియర్ పోలీసు అధికారి ఛజు రామ్ రాణా గుండెపోటుతో మరణించారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ మంగళవారం రాష్ట్రంలో తొలి ర్యాలీ నిర్వహించింది. ధర్మశాలలో, ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ర్యాలీలో విధులు నిర్వహిస్తుండగా, సీనియర్ పోలీసు అధికారి ఛజు రామ్ రాణా గుండెపోటుతో కుప్పకూలారు. కాంగ్రెస్ కృతజ్ఞతా ర్యాలీకి ఉదయం నుంచి జోరావర్ స్టేడియం వద్ద ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు స్టేడియం పూర్తిగా కిక్కిరిసిపోయింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలోనే విధులు నిర్వహిస్తూ పోలీస్ అధికారి మృతి చెందారు.
Here's ANI Tweet
Himachal Pradesh | A senior police officer Chhaju Ram Rana died due to a heart attack while he was on duty at CM's rally in Dharamshala today.
— ANI (@ANI) January 3, 2023