Shimla faces drinking water scarcity (photo-ANI)

హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య సిమ్లా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. సిమ్లా జల్ ప్రబంధన్ నిగమ్ లిమిటెడ్ (SJPNL) ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తుంది. విపత్తు వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. నీటి పథకాలు, రోడ్లు లేదా ఆనకట్టలు కావచ్చు.. సిమ్లాలో, మేము ప్రైవేట్ ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నాము, నగర్ నిగమ్ యొక్క ట్యాంకర్లు కూడా నీటిని అందిస్తున్నాము. ట్యాంకర్ల వినియోగంతో వీలైనంత ఎక్కువ ప్రదేశాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని నీటి కొరతపై సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేందర్ చౌహాన్ చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

బియాస్ నది ఉగ్రరూపం వీడియో ఇదిగో, ట్రక్కును అమాంతం లాక్కెళ్లిన భారీ వరద, భారీ వర్షాలకు హిమాచల్ విలవిల

ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా (Shimla)లో అత్యధికంగా 11 మంది మరణించారు. మృతి చెందిన 30 మందిలో ఇప్పటి వరకు 29 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు భారీ వర్షం కారణంగా సంభవించిన వరదలకు సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Here's Videos

వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చందర్తాల్, పాగల్ నల్లా, లాహౌల్, స్పితి సహా పలు ప్రాంతాల్లో సుమారు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక ఉనా జిల్లాలోని మురికివాడను వరదలు ముంచెత్తాయి. అందులో చిక్కుకుపోయిన 515 మంది కార్మికులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సురక్షితంగా రక్షించారు.

బియాస్ నది ఉగ్రరూపం వీడియో ఇదిగో, దేవాలయాలను తనలో కలుపుకుంటూ సాగుతున్న భారీ వరద

తాజా పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ (Sukhvinder Singh Sukh) ప్రజలకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా చిక్కుకుపోయిన పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలు వంటి కారణాల వల్ల 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణనష్టం అంత ఎక్కువగా లేదు. ప్రధాన రహదారులు, లింక్ రోడ్లతో సహా 1,300 రోడ్లు దెబ్బతిన్నాయి. రాబోయే రెండు రోజులు అలర్ట్ గా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి అన్నారు.